'కంప్యూటర్' ఇప్పుడీ పేరు విననివారుండరు. వాడకం తెలియని వారు కూడా అతి కొద్దిమంది మాత్రమే. కంప్యూటర్ అంటే స్మార్ట్ ఫోన్ కావచ్చు, ల్యాప్‌టాప్స్ కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు ఏదైనా సరే, ఏడాది వయసు పిల్లల నుండే వీటి వాడకాన్ని ఓ అలవాటుగా పెట్టుకున్నారు. గేమ్స్ కావచ్చు, ఇతరత్రా వ్యవహారాల కోసం కావచ్చు ఇప్పుడు కంప్యూటర్ అనేది మనిషి జీవితంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. అదే సర్వరోగాలకూ కారణభూతమవుతోంది. ముఖ్యంగా యువత కంప్యూటర్ బేస్‌డ్ ఉద్యోగాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సాఫ్ట్‌వేర్ కావచ్చు మరేదైనా టెక్నికల్ ఫీల్డ్ కావచ్చు కంప్యూటర్ లేనిదే పనులు జరగని పరిస్థితి. అందుకే కంప్యూటర్ వాడకంతో పాటు హెల్త్ కాన్షియస్ కూడా అవసరమే కదా. అందుకే కంప్యూటర్ ముందు సిట్టింగ్ ప్రోసెస్ ఎలా ఉండాలి.? ఎలా లేకపోతే zసమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్ ముందు కాలక్షేపం చేయాల్సి వస్తుంది. అయితే ఒక పద్ధతి ప్రకారం కూర్చొంటే ఎలాంటి సమస్య రాదు. పద్దతి అంటే నిట్ట నిటారుగా కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల మెడ, తల భాగానికి వెన్నెముక కండరాలు సపోర్ట్‌గా నిలుస్తాయి. దాంతో మెడకు సంబంధించిన నొప్పులు రాకుండా ఉంటాయి. మీకీ సంగతి తెలుసా.? మన వెన్నుముక కేవలం 5 కిలోల బరువును మాత్రమే మోయగలదంట. ప్రయోగాత్మకంగా నిరూపితమైన విషయమిది. నిటారుగా కూర్చోవడం వల్ల వెన్నెముక వెయిట్‌పై ఎక్కువ ఒత్తిడి కలగదట. బ్యాలెన్స్ కరెక్ట్‌గా ఉంటుందట. మరో విషయం ఏంటంటే కంప్యూటర్ స్క్రీన్ కళ్లకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. అయితే కొందరు మెడను ముందుకు వంచి నడుమును కూడా అందుకనుకూలంగా వంచేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వెన్నుముకపై దాదాపు 20 కిలోల వెయిట్ వరకూ పడుతుందట. ఇలా చేయడం వల్ల వెన్నులో విపరీతమైన నొప్పి, మెడ కండరాలు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇనిస్టెంట్‌గా ఈ సమస్యలు అంత బాధించకపోయినా, ఇన్ ఫ్యూచర్ బాగా బాధిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సిస్టమ్‌పై వర్క్ చేసేవారు అదే పనిగా గంటల తరబడి కూర్చోకూడదని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అరగంటకోసారి లేచి అటూ ఇటూ నాలుగు అడుగులేసి మళ్లీ కూర్చోవడం వల్ల బాడీలోని కండరాలు, నరాలు రీఛార్జ్ అవుతాయి. సో కండరాలు పట్టేయడమన్న మాటే ఉండదు. ఈ ప్రాసెస్‌ని ఫాలో చేస్తే, లైఫ్ లాంగ్ కాకపోయినా వెన్నునొప్పులు, మెడ నొప్పులను కొంతవరకూ అయినా వాయిదా వేయవచ్చు. లేదంటే వయసుతో సంబంధం లేకుండా, కండరాల నొప్పులతో బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా యూత్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటుంటారు. స్మార్ట్ యుగంలో కంప్యూటర్ ముందు కూర్చుంటే కానీ ఏ పనీ కాని పరిస్థితి. అలా రోజులో ఎక్కువ భాగం వారు సిస్టమ్స్ ముందే గడిపేస్తున్నారు. కానీ ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని వ్యవహరిస్తే మంచిది. నేటి యువతే రేపటి భవిత. ఆ యువత భవిష్యత్తు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాఠించాలి తప్పదు.