జయంతులు
జనవరి 12
శ్రీ యల్లాప్రగడ సుబ్బారావు .. వీరు 1895 లో జన్మించారు. భారత దేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం( Folic Acid ) యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. క్షయరోగ నివారణ, బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నారు.
జనవరి 14
శ్రీ న్యాపతి సుబ్బారావు … వీరు 1856 లో జన్మించారు. “ ఆంధ్ర భీష్మ “ గా ప్రసిధ్ధిచెందిన స్వాతంత్ర సమర యోధుడు, సంస్కరణ వాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు..
జనవరి 15
శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి. : 1887 లో జన్మించిన వీరు, “ కవిరాజు “ గా ప్రసిధ్ధి చెందారు. హేతువాదం, మానవతా వాదం తెలుగు సాహిత్యం లోకి మొదటిసారిగా ప్రవేశ పెట్టిన వారు.
జనవరి 17
శ్రీ అక్కినేని లక్ష్మీవరప్రసాద్ : వీరు 1908 లో జన్మించారు. L V Prasad గా చిరపరిచితులు. సినీనిర్మాత, దర్శకుడు , నటుడు… దాదాసాహేబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత.
***********
వర్ధంతులు
జనవరి 11
శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్య పిళ్ళై : వీరు 2016 లో స్వర్గస్థులయారు. ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. వారు సంస్కృతంలో రాసిన కలిచెర్ల పట్టాభిరామ సుప్రభాతం, సీతాష్టకం, పోలేరిమాతాస్తోత్రాలను నేటికీ చిత్తూరులోని పలు దేవాలయాల్లో సుప్రభాత సమయాన వేస్తారు. తెలుగు మీద అపారమైన అభిమానంతో తెలుగు భాష స్థితిగతులమీద "వెలుగు తగ్గిన తెలుగు", "తెలుగు ఎప్పుడు? ఎక్కడ? ఎలా?" రాశారు. ఇంకా కథలు, నాటకాలు, వ్యాసాలు లెక్కలెనన్ని వెలువరించిన వీరు ఒక నడిచే గ్రంథాలయం లాంటి వారని ఆయన్ని ఎరిగిన వారందరికీ తెలుసు.
జనవరి 14
శ్రీ కేసనపల్లి లక్ష్మణ కవి : వీరు 1979 లో స్వర్గస్థులయారు. సహజకవి, పండితుడు, విమర్శకుడు మరియు పౌరాణికుడు. వీరు నరసరావుపేట సమీపంలోని కేసనపల్లి వాస్తవ్యుడు. ఇతడు గురుముఖతః అక్షరాలు మాత్రం నేర్చుకున్నారు.. స్వయంకృషితో భారత రామాయణాలను కంఠస్థం చేసి సాహిత్యపు లోతులను ఆకళింపు చేసుకున్నారు..
జనవరి 15
శ్రీ గిడుగు రామ్మూర్తి : వీరు 1940 లో స్వర్గస్థులయారు. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.
జనవరి 16
శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు. : వీరు 1942 లో స్వర్గస్థులయారు. . ప్రముఖ వస్తాదు, మల్ల యోధుడు.. రొమ్ముపై ఏనుగును ఎక్కించుకుని 5 నిముషాలు అలాగే ఉంచుకోగలిగిన దిట్ట. దేశమంతా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖులచేత ప్రశంసలు పొందిన తెలుగు వాడు.