జయంతులు :
ఫిబ్రవరి 1
శ్రీ జువ్వాడి హనుమంతరావు : వీరు ఫిబ్రవరి 1 , 1929 న ఇరుకుళ్ళ గ్రామంలో జన్మించారు. ప్రముఖ సాహితీవేత్త. . వీరు తన శ్రావ్యమైన కంఠం తో తనదైన శైలిలో అంతరార్థాలను విశదీకరిస్తూ రసికులకు వినిపించగలిగి, వారి మూర్తితత్వాన్ని ఆవిష్కరించారు, తానే రచించాడా అన్నంతగా ప్రజల్లోకి రామాయణ కల్పవృక్షాన్ని తీసుకెళ్లారు..
ఫిబ్రవరి 4
శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ : వీరు ఫిబ్రవరి 4 , 1891 న తిరుచానూర్ లో జన్మించారు. వీరు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు. 1956 లో లోక్ సభ స్పీకరు గా ఎన్నుకోబడ్డ మొదటి తెలుగువారు...
ఫిబ్రవరి 5:
శ్రీ గరికపాటి రాజారావు : వీరు, ఫిబ్రవరి 5 , 1915 న రాజమండ్రి లో జన్మించారు. వీరు సినిమా, నాటక రంగాల్లో ఎంతో సేవ చేసారు. ఆంధ్ర ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు..
శ్రీ షేక్ నాజర్ : వీరు ఫిబ్రవరి 5, 1920 న పొన్నుకల్లె గ్రామంలో జన్మించారు.. బుర్రకథాపితామహుడిగా పేరు పొందారు. .. నాటకాల్లో స్త్రీపురుష పాత్రలు అవలీలగా వేసేవారు..
ఫిబ్రవరి 6:
శ్రీ భమిడిపాటి రామగోపాలం : వీరు ఫిబ్రవరి 6, 1932 న పుష్పగిరి లో జన్మించారు. ప్రముఖ రచయిత.. వీరు పత్రికారంగంలో కూడా పనిచేసారు. వీరి రచన “ ఇట్లు మీ విధేయుడు “ కి కేంద్ర సాహిత్య ఎకాడమీ పురస్కారం లభించింది. తన ఆత్మకథకు “ “ఆరామ గోపాలం “ అని పేరుపెట్టారు. “ భరాగో “ గా ప్రసిధ్ధి చెందారు.
ఫిబ్రవరి 7
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి : వీరు ఫిబ్రవరి 7 , 1888 న , పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించారు. వీరు ప్రముఖ కవి , భాషా పరిశోధకుడు, రేడియో నాటకరచయిత, విమర్శకుడు. తెలుగులో అనేక కావ్యములు రచించడముతో పాటు అనువాదాలు, వివరణా గ్రంథాలు రచించారు.. ఈయన ప్రాచ్యలిఖిత పుస్తకాలయములో అనేక తెలుగు గ్రంథాలను చారిత్రకాధారములతో సవివరముగా పరిష్కరించి ప్రకటించారు..
వర్ధంతులు..
ఫిబ్రవరి 1
శ్రీమతి జోలిపాళ్యం మంగమ్మ : వీరు ఆల్ ఇండియా రేడియో లో , మొట్టమొదటి మహిళా తెలుగు న్యూస్ రీడర్ గా ప్రసిధ్ధురాలు. వీరికి తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషలలో ప్రావీణ్యం ఉండేది. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఎన్నో పుస్తకాలు రాసారు.
వీరు ఫిబ్రవరి 1 , 2017 న స్వర్గస్థులయారు.
ఫిబ్రవరి 2.
శ్రీ ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి : వీరు ప్రముఖ కవి, పండితులు. తెలుగులో 14 పుస్తకాలు రాసారు.. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో మంచి పట్టు ఉన్న వ్యక్తి.
వీరు ఫిబ్రవరి 2, 1916 న స్వర్గస్థులయారు.
ఫిబ్రవరి 3 :
శ్రీ కొమ్మినేని అప్పారావు : వీరు కె. చక్రవర్తిగా ప్రసిధ్ధులు. ప్రముఖ సంగీత దర్శకుడు.. 900 కి పైగా తెలుగు సినిమాలకు సంగీత దర్శకుడు. కొన్ని సినిమాల్లో తన నటనా చాతుర్యాన్నికూడా ప్రదర్శించారు.
వీరు ఫిబ్రవరి 3, 2002 న స్వర్గస్థులయారు.
ఫిబ్రవరి 4
శ్రీ మునిమాణిక్యం నరసింహరావు : వీరు ప్రముఖ తెలుగు హాస్య రచయిత. ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది.
వీరు ఫిబ్రవరి 4, 1973 న స్వర్గస్థులయారు.