కళ్లు నిండుగా, కడుపు లైట్‌గా.! - ..

Eyes full, light on the stomach.

ఆకేసి, పప్పేసి, బువ్వేసి, నెయ్యేసి.. అంటూ అప్పట్లో పాటేసుకునేవాళ్లం. పాటే కాదు, అరచేతిలో చిన్న పిల్లలకు నచ్చిన వంటకాలన్నింటినీ వడ్డించేసేవాళ్లం. అదో ఆట అప్పుడు. అదే ఆట ఇప్పుడు కొత్తగా ఆడేస్తున్నారు. అయితే ఇప్పుడిది చిన్నపిల్లలాట కాదు. అవును మీరు విన్నది నిజమే. ఇది పెద్దవాళ్ల ఆట. బొమ్మరిల్లులాంటి ఇంట్లో చిన్న పొయ్యి, చిన్న చిన్న కడాయిలు, చిన్న చిన్న పాత్రలతో చిన్న పిల్లలు ఉత్తుత్తి వంటలు వండి వడ్డించేసేవారు. కానీ ఇప్పుడు అవే వంటల్ని నిజంగా వండేస్తున్నారు అలాంటి బొమ్మరింట్లోనే చిన్న చిన్న పాత్రల్లో. చిన్న పాత్రలంటే ఎంత చిన్నవో తెలుసా.? కందిపప్పంత దోసెలు, శనగపప్పంత జిలేబీలు, ఆవగింజంత బోండాలు ఇలా ఒక్కటేమిలీ, అరచేతిలో అరవై రకాల వంటకాల్ని సిద్ధం చేసేస్తున్నారు. నమ్మడం లేదు కదా. కానీ ఇది నిజంగా నిజం.

సోషల్‌ మీడియాలో ఇప్పుడీ మినీ వంటకలు భలే గిరాకీ ఉందండోయ్‌. ఇలా మినీ వంటకాలతో రూపొందించిన వీడియోలకు బోలెడన్ని వ్యూస్‌ వచ్చేస్తున్నాయి. వంటలు చిన్నవే కానీ, బోలెడన్ని డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. 'కొత్త ఒక వింత పాత ఒక రోత' అనేవారు. కానీ ఇప్పుడు వింతేమిటంటే పాతనే కొత్తగా వింతగా చూపిస్తున్నారు. ఆ వింతను వెర్రిగా ఫాలో చేసేస్తున్నారు. ఈ వెర్రికి ఆధ్యం పోసిందే సోషల్‌ మీడియా. అంటే సింపుల్‌గా ఇది సోషల్‌మీడియా వెర్రి అనాలి. ఆ వెర్రిలో భాగంగానే ఈ మినీ వంటలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. వీటిని ఆసరాగా తీసుకుని మినీ స్టార్టప్స్‌ పేరుతో కొన్ని అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయి. జనం వెర్రినే కదా, క్యాష్‌ చేసుకునేది. ఆ వెర్రి వెయ్యి రకాలిప్పుడు.

ఏ రకం అయినా ఫెయిల్యూర్‌ కాదు, అయితే కొంచెం కొత్తగా ఆలోచించాలంతే. వింతగా ఎట్రాక్ట్‌ చేయాలంతే.  చిన్న పిల్లలు ఆడుకునే ఆటల్నే ఉపాధి అవకాశాలుగా ఎంచుకోవడం అనే ఆలోచన చాలా బాగుంది. అయితే పెద్దల ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఈ ఆలోచనను డెవలప్‌ చేస్తున్న యూత్‌ క్రియేటివిటీని మెచ్చుకోవాలి. సిటీ ఔట్‌ కట్స్‌లో ఓ చోట పల్లెటూరి వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తున్నారు. అక్కడే ఈ మినీ వంటకాలకు సంబంధించిన మినీ సామాగ్రినంతటినీ రూపొందిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా తయారుచేయిస్తున్నారండోయ్‌ ఈ వస్తువులన్నీ. ఇన్ని రకాలుగా ఈ వినూత్న ఆలోచన ఉపాధిని కలిగిస్తోందో కదా. ఇందుకోసం భారీ మొత్తంలో ఛార్జ్‌ చేస్తున్నారు. ఇలా లైవ్‌గా మినీ వంటలు చేసి మురిసిపోయేందుకు ఛార్జ్‌ని లెక్క చేయడంలేదు. సో ఓ పక్క ఎంటర్‌టైన్‌మెంట్‌. మరో పక్క తద్వారా లభించే ఆదాయం. భలే ఉంది కదా ఈ మినీ థాట్‌.!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు