తమిళనాడు తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

కేతుగ్రహ స్థానం కీఝపెరుంపాలెం

క్రిందటివారం మనం రాహుకేతుగ్రహాలు యెలా యేర్పడ్డాయో తెలుసుకున్నాం , రాహుగ్రహ క్షేత్రం గురించికూడా తెలుసుకున్నాం . ఈ వారం కేతుగ్రహం గురించి , కేతుగ్రహస్థలం గురించి తెలుసుకుందాం .

కేతు గ్రహం అనుకూలంగా లేకపోతే ఆస్థి గొడవలు , అవమానం , ఆరోగ్య సమస్యలు , కంటి సమస్యలు మొదలైన సమస్యలు యెదురౌతాయి , కేతుగ్రహం అనుకూలంగా వుంటే స్థిరాస్తులు కొనుగోలు , పదోన్నతులు కలుగుతాయి .

శ్రీకాళహస్తిలో రాహుకేతు గ్రహా శాంతి చేస్తారు కాని కేతుగ్రహానికి వేరేగా మనదేశంలో యే క్షేత్రమూ లేదనే చెప్పాలి , కేతుగ్రహానికి వున్న మందిరం కూడా యిదేనేమో . ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం జిల్లాలో కీఝపెరుంపాలెం లో వుంది , బుధగ్రహ కోవెలవున్న తిరువేంకాడు కి సుమారు 7 కిలోమీటర్ల దూరంలోను , పుంపుహార్ కి సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనూ వుంది .

చిన్నచిన్న గ్రామాలను , పంటపొలాలను దాటుకుంటూ సాగుతుంది ప్రయాణం . చాలా చిన్న కోవెలని చెప్పుకోవాలి , రెండతస్థుల రాజగోపురం , రెండు ప్రాకారాలతో నిర్మించబడిన కోవెల . కేతుగ్రహశాంతి హోమాలు జరుగుతూ వుంటాయి . రాజగోపురంలోంచి రాగానే యెదురుగా శివకోవెల యిక్కడ శివుడు నాగనాథుడు అనే పేరుతో పూజలందుకుంటున్నాడు . అమ్మవారిని సౌందర్యనాయకి అని అంటారు . కేతుగ్రహస్థానం శివకోవెలకు ఉత్తర దిశగా వుంటుంది . కేతుగ్రహ శాంతిచేసుకొనేవారు ముందుగా నాగతీర్థమని పిలువబడే పుష్కరిణిలో స్నానం చేసి పసుపులో ముంచిన వస్త్రాలుగాని తడి వస్త్రాలు గాని ధరించి శివుని దర్శించుకొని , సౌందర్యనాయకిని దర్శించుకొని హోమంచేసుకుంటారు .

క్రిందట సంచికలో  స్వరభాను అనే రాక్షసుని మొండెం పాము తలతో వుంటాడు కేతువు అని తెలుసుకున్నాం . అమృతపానం వల్ల పాపపుణ్యాల వివక్షత తెలిసిన కేతువు పాపవిమపక్తికొరకు యీ ప్రదేశంలో శివుని కై తపస్సు చేసుకొని శివుని ప్రశన్నుని చేసుకున్నాడు . పాముచే పూజింపబడిన శివుడు కాబట్టి యిక్కడ శివునికి నాగనాథుడు అనే పేరు వచ్చింది . 

మిగతా మందిరాలలో లాగానే సూర్యచంద్రులు , భైరవుడు , దుర్గ , లింగోధ్బవం , సంధికేశ్వరుడు మొదలైన విగ్రహాలను చూడొచ్చు .      కేతుగ్రహం అనుకూలంగా లేనప్పుడ రంగురంగుల వస్త్రం లో ఉలవలు దానం చేస్తే దోషం పోతుందని అంటారు . ఉత్తరంగాగాని , పడమరగాగాని కూర్చొని కేతు మంత్రం జపిస్తే దోషనివారణ జరుగుతుంది .

ఈ మందిరానికి పక్కగా సీతారాముల మందిరం వుంది . ఇది కూడా చాలా పురాతనమైన మందిరం అంటారు కాని స్థలపురాణం తెలియరాలేదు .

నవగ్రహాల గురించి , నవగ్రహ స్థానాలగురించి తెలుసుకున్నాం కదా ? యిప్పుడు నవగ్రహమంత్రాలు , నవగ్రహ గాయత్రి గురించి తెలుసుకుందాం .

ఓమ్ సూర్యాయ సోమాయ , మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనైభ్యశ్చ రాహవేకేతవే నమః

సూర్యగ్రహం —

ఆదివారం నాడు సూర్యుడికి యెదురుగా నిలబడి క్రింద మంత్రాలలో మీకు వీలయిన మంత్రం వీలైనన్ని మార్లు జపిస్తే మంచి ఫలితాలు వుంటాయి . కెంపు ధరించాలి .

ఓమ్

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపజ్ఞమ్ ప్రణతోస్మి దివాకరం

మూలమంత్రం —

ఓమ్ 

హ్రం  హ్రీం హ్రౌం సహ సూర్యాయనమః

సూర్య గాయత్రి

ఓమ్ అశ్వద్వజాయ విద్మహే
పాశ హస్తాయ ధీమహి
తన్నో సూర్య ప్రచోదయాత్ 

చంద్రగ్రహం——

చంద్ర గ్రహ శాంతికి సోమవారం నాడు క్రింద మంత్రాలను శక్తానుసారంగా జపించుకోవచ్చు . ముత్యం ధరించాలి .

ఓమ్

దధి శంక తుషారాభం క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం 

మూలమంత్రం —-

ఓమ్ శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయనమః

చంద్ర గాయత్రి

ఓమ్ పద్మద్వజాయ విద్మహే
హేమ రూపాయ ధీమహి
తన్నో సోమ్ ప్రచోదయాత్    

    మంగళ ( కుజ ) గ్రహం —-

           కుజగ్రహ శాంతికి మంగళవారంనాడు యీ క్రింద మంత్రాలను జపించాలి . పగడం ధరించాలి .

        ఓమ్

        ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నభం

        కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం

మూలమంత్రం —-

           ఓమ్ క్రాం క్రీం క్రౌం సహ భౌమాయనమః

         మంగళ గాయత్రి

              ఓమ్ వీరద్వజాయ విద్మహే

             విఘ్నహస్తాయ ధీమహి

             తన్నో భౌమ ప్రచోదయాత్

     బుధ గ్రహం —

          బుధవారంనాడు క్రింద మంత్రాలను జపించాలి . పచ్చ ( ఎమరాల్డ్ ) ధరించాలి .

         ఓమ్ 

        ప్రియంగు కళికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్

        సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధమ్ ప్రణమామ్యహం .

మూలమంత్రం —-

        ఓమ్ బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయనమ

      బుధ గాయత్రి

             ఓమ్ గజద్వజాయ విద్మహే

             శుక హస్తాయ ధీమహి

              తన్నో బుధ ప్రచోదయాత్

    బృహస్పతిగ్రహం —-

            గురువారం నాడు క్రింద మంత్రాలను జపించాలి . కనకపుష్యరాగం ( ఎల్లో సఫైర్ ) ధరించాలి . 

      దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నభం

     బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం

మూలమంత్రం —-

     ఓమ్ గ్రాం గ్రీం గ్రౌం సహ బృహస్పతయేనమః

గురు గాయత్రి

                 ఓమ్ వృషభ ద్వజాయ విద్మహే

                  ఘ్రిని హస్తాయ ధీమహి

                   తన్నో గురు ప్రచోదయాత్

శుక్ర గ్రహం —-

         శుక్రగ్రహ శాంతికి శుక్రవారంనాడు క్రింద మంత్రాలు జపించాలి , వజ్రం ధరించాలి .

      ఓమ్

      హిమకుంద మృణాలాభం దైత్యానం ప్రథమం గురుం

      సర్వశాస్త్ర్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం

మూలమంత్రం —-

      ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయనమః

          శుక్ర గాయత్రి

               ఓమ్ అశ్వద్వజాయ విద్మహే

               ధనుర్ హస్తాయ ధీమహి 

               తన్నో శుక్ర ప్రచోదయాత్

శనిగ్రహం — 

      శనీశ్వరుని శాంతికి శనివారంనాడు క్రింద మంత్రాలను జపించాలి . నీలం ( బ్లు సఫైర్ ) ధరించాలి .

     ఓమ్ 

     నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం

    ఛాయామార్తండ సంభూతం తంనమామి శనైశ్చరం 

మూలమంత్రం —-

      ఓమ్ ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయనమః

       శనీశ్వర గాయత్రి —

         ఓమ్ కాకద్వజాయ విద్మహే

           ఖడ్గ హస్తాయ ధీమహి

           తన్నో మంద ప్రచోదయాత్ 

రాహు గ్రహం —

        రాహు గ్రహ శాంతికి ప్రతీ రోజూ రాహుకాలంలో క్రింద మంత్రాలను జపించాలి . గోమేధికం ధరించాలి .

     ఓమ్ 

    అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం

    సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం

మూలమంత్రం —-

       ఓమ్ భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవేనమః

       రాహు గాయత్రి —-

         ఓమ్ నాక ద్వజాయవిద్మహే

        పద్మహస్తాయ ధీమహి

         తన్నో రాహు ప్రచోదయాత్

కేతుగ్రహం ——

        కేతుగ్రహ దోషనివారణకు ప్రతీరోజూ యమగండ సమయంలో గాని లేక మంగళ వారం నాడుగాని క్రింది మంత్రాలు జపించాలి . వైఢూర్యం ( క్రైసోబెరల్ )ధరించాలి .

     ఓమ్ 

     ఫలాసపుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం

    రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం

     మూలమంత్రం —-

       ఓమ్ స్త్రాం స్త్రీం స్త్రౌం సహ కేతవేనమః

      కేతు గాయత్రి —

          ఓమ్ అశ్వద్వజాయ విద్మహే

          శూల హస్తాయధీమహి

           తన్నో కేతు ప్రచోదయాత్

        ఇవి నాకు తెలిసిన కొన్ని పరిహారాలు , వచ్చేవారం కుంభకోణం లోని మరో కోవెల గురించి చదువుదాం , అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు