చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram


మనదేశంలో చాలా చట్టాలున్నాయి, కానీ వాటిని   ఇంప్లిమెంట్  చేయడంలోనే అసలు గొడవంతా.. ఎప్పుడో ప్రభుత్వం ఇరుకులో పడ్డప్పుడు, ఆ రాజ్యాంగం ఏదో ఓసారి చూసి, అవేవో సెక్షన్ల కింద ఓ కేసు రిజిస్టర్ చేస్తారు.. అదికూడా, ఆ నేరం చేసినవాడు అధికారపక్షం వాడా, ప్రతిపక్షం వాడా అన్నది చూసుకుని మరీనూ…ఇదంతా ఏదో విమర్శించడానికి కాదు, జరుగుతున్న కథే. పైగా ఏదో కేసులాటిది ఫైలె  చేయగానే, అదేం చిత్రమో మొదట వాడికి గుండెనొప్పో ఏదో వచ్చి ఆసుపత్రిలో చేరతాడు. ఆ తరవాతెప్పుడో కోర్టులో హాజరు పరచడమేమిటి, క్షణాల్లో  భైల్  మీద బయటకొచ్చేస్తాడు… ఈ సౌలభ్యాలన్నీ రాజకీయనాయకులకీ, పలుకుబడున్నవారికీనూ.. అసలు దేశం విడిచి పారిపోయే సదుపాయాలుకూడా ఉన్నాయి. అదేం కర్మమో ఆ నేరస్థులు హాయిగా ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వాలు నెలకోసారి, కేసు నడుస్తోందీ, త్వరలో వాణ్ణి దేశానికి తెప్పించి శిక్ష వేసేస్తామూ.. అని ప్రకటనలు చేస్తూనే ఉంటారు. వాడు రానూ రాడూ, శిక్షా పడదూ…
అలాగని పోలీసు వ్యవస్థ పనిచేయడంలేదా అనుకోకూడదు. పని చేస్తోంది– వారి  లిమీట్స్  వారివీ.. సినిమాల్లో చూడ్డం లేదూ ? వీళ్ళకి తేరగా దొరికేది మాత్రం సాధారణ జనాలు…ఈమధ్యన  ట్రాఫిక్ సిగ్నల్తో పాటు అవేవో సి.సి.కెమెరా  కూడా పెట్టేసారు, పెద్దపెద్దనగరాల్లో..ఏదైనా పెద్ద పెద్ద నేరాలు జరిగినప్పుడు ఈ  సిసి ఫూటేజ్  ద్వారానే నేరస్థుడిని పట్టుకుంటూంటారు.. అలాగే  సిగ్నల్ ని జంప్ చేసినప్పుడల్లా, వాడి అదృష్టం బాగోక, ఆ కెమేరాలో, వాడూ, వాడి బండీ పడ్డాయా, వెంటనే వాడి ఫోను కి ఓ  ఎస్.ఎం.ఎస్ వెళ్ళిపోతుంది.. నువ్వు ఫలానా చోట సిగ్నల్ అతిక్రమించావూ, నీకు జుర్మానా వేసాము అవటా అని…ఆ  సంస్  అందుకున్నవాడు ఏ లా అబ్డింగ్ సిటిజన్ అయితే, వెంటనే పోలీసు స్టేషన్ కి వెళ్ళి కట్టేస్తాడు. కానీ అందరూ అలా ఉండరుగా.. ” చల్తా హై యార్.. ” అని ఆ విషయం వదిలేస్తారు. కానీ ఆ పోలీసు రికార్డులో, వీడూ, వీడి ప్రవరా అన్నీ ఉంటాయి. ఇలాటప్పుడే ”  कानून का हाथ बहुत लंबे है ”  అన్నది రంగంలోకి వస్తుంది. మన అదృష్టం బాగోకపోయినా, లేచినవేళ బాగోకపోయినా, మనకి సంబంధం లేకపోయినా, మనమూ అందులో భాగస్వాములవుతూంటాము.
 రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన పోలీసుల ప్రవర్తన కూడా చిత్రంగా ఉంటుంది. వీళ్ళకి రోజుకిన్ని కేసులు పట్టుకోవాలీ అని ఓ కోటా ఉంటుందనుకుంటా.. చట్టాన్ని అతిక్రమించినవారందరినీ పట్టుకోరు. ఏదో లేచినవేళ బాగోనివాడెవడో వీళ్ళ కళ్ళ బడతాడు. కార్ల కిటికీ అద్దాలకి నల్లటి ఫిలిం ఉండకూడదూ, దాంట్లో ఉన్నవాళ్ళెవరో కనిపించాలీ అని ఓ చట్టం ఉంది… ఎవడూ పట్టించుకోడు.
నేరం నిరూపింపబడ్డ వాడు, ఎన్నికల్లో , ఆరు సంవత్సరాలపాటు పోటీ చేయకూడదని ఓ చట్టం ఉంది. అదేం చిత్రమో, ఇప్పటిదాకా బహుశా ఇద్దరో ముగ్గురికో ఆ శిక్ష పడ్డట్టుంది. మరో చిత్రమేమిటంటే, దేశంలో ప్రతీ రాజకీయనాయకుడి మీదా,  ఎన్నోఎన్నెన్నో కేసులున్నాయి..అయినా ఆ కేసులు విచారణకి రానూ రావూ, వీళ్ళకి శిక్షా పడదూ.  అధవా విచారణకి వచ్చినా,  సాక్ష్యాలు సరీగ్గాలేవని కొట్టిపారేస్తారు.. అలాగే ఇంకం టాక్స్   వారు , ఎవరిదగ్గరో నల్లధనం ఉందని వారి ఇళ్ళమీదా, ఆఫీసులమీదా దాడి చేసినా, శిక్ష పడ్డానికి చాలా టైము పడుతుంది. కానీ, ప్రభుత్వోద్యోగి ఒక్క రోజుకైనా, జైలుకెళ్ళాల్సిన సందర్భం వస్తే మాత్రం, వాడిని సస్పెండు చేస్తారు.
 ఒకానొకప్పుడు, మన పాలకులు అదేదో విలేఖర్ల సమావేశం అని పెట్టేవారు.. ఈ రోజుల్లో ఎవరిని చూసినా, అదేదో అంతర్జాలంలో  ట్విట్టర్   ట, దాంట్లోనే  రాయడం. ఏదైనా గొడవొస్తే  ఆ రాసినదేదో  దెలెతె  చెసే సౌలభ్యం ఉంది కాబట్టి. మామూలు విలేఖర్ల సమావేశాల్లో అన్నీ రికార్డవుతాయిగా. అదీ ముఖ్యకారణం.
 ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ వదిలేసి, ఇంకో పార్టీ లో ( అధికార పార్టీ) చేరకూడదని , అప్పుడెప్పుడో ఆణ్టే డిక్లరేషన్ ఆఫ్ లవ్   అని ఒకటిచేసారు, గుర్తుందా.. అయినా సరే, తాంబూలాలు పుచ్చుకుని,  అధికార పార్టీలోకి చేరే వారు పుష్కలంగా ఉన్నారు.  
 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు