చక్కటి కవితలు అందించి గోతెలుగు పాఠకులను అలరిస్తున్నకవుల అంతరంగాన్ని ఆవిష్కరించే ఇంటర్వ్యూలతో పాఠకులకు వారిని మరింత చేరువచేయాలనేది మా సంకల్పంతో అందిస్తున్నవి ఈ ఇంటర్వ్యూలు..ఔత్సాహికులకు స్ఫూర్తిగా...లబ్దప్రతిష్టులను సైతం ఆకర్షించేలా పాఠకుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోయేలా ప్రతిష్టాత్మకంగా అందించడం గోతెలుగు ప్రధానోద్దేశం...ఈ క్రమంలో ఈవారం మనముందుకొచ్చిన కవి కొప్పుల ప్రసాద్...సీమ కరువుపై రాసిన కవిత కు పుట్టపర్తిలో ఘనసన్మానం అందుకున్న కొప్పుల ప్రసాద్ ఇంటర్వ్యూ ఈవారం మీకోసం ప్రత్యేకం....
గోతెలుగు:మీ జన్మస్థలం, బాల్యం, చదువు, అమ్మానాన్నల గురించి....
గోతెలుగు:మిమ్మల్ని కవితాప్రపంచం వైపు నడిపించిన స్పూర్థిప్రదాతలు....
ప్రసాద్ : మా గురువులు ఇంటర్లో కళా మురళి అనే గురువు
గోతెలుగు:మీ తొలి కవితను ప్రోత్సహించిన పత్రిక, సంపాదకులు..ఆనాటి అనుభూతి...
ప్రసాద్ : ఈనాడు పత్రిక జలయజ్ఞంలో నా మొదటి కవిత అచ్చయినది
గోతెలుగు:కవి హృదయం, స్పందనలు ఎలా ఉండాలని మీ ఆకాంక్ష..
ప్రసాద్ : వాస్తవాలు చూసి స్పందించాలి అనేది నా ఆకాంక్ష
గోతెలుగు:ఆధునిక కవితా ప్రపంచం ఎటువైపు వెళ్తోంది...
ప్రసాద్ : సమాజానికి ఉపయోగపడే విధంగా కవిత ఉండాలి
గోతెలుగు:కవితా లోకంలో మీరెక్కడున్నారు..
ప్రసాద్ : నాకంటూ సాహిత్యంలో ఒక స్థానం సంపాదించుకున్నాను
గోతెలుగు:భావుకత, వాస్తవికత ఈ రెండింట్లో దేనిపై మీ మక్కువ?
ప్రసాద్ : వాస్తవికత మీద మక్కువ ఎక్కువ
గోతెలుగు:వచన కవిత్వానికి ప్రాస ఎంతవరకు అవసరం?
ప్రసాద్ : ప్రాస అవసరం లేదు ఉంటే గాన యోగ్యముగా ఉంటుంది
గోతెలుగు:ఊహల్లో తేలిపోతూ అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేదీ కవులే, వాస్తవాన్ని మరింత భయంకరంగా చూపిస్తూ పాఠకులను భయభ్రాంతులకు గురిచేసేదీ కవులే....ఏది కవి బాధ్యత?
ప్రసాద్ : వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పాలి
గోతెలుగు: సమాజం పట్ల కవికున్న బాధ్యత ఎలాంటిది?
ప్రసాద్ : వీలైనంతవరకు సమాజానికి చాలా బాధ్యతాయుతంగా ఉండాలి
గోతెలుగు:కవితా ప్రపంచం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు, అందుకున్న పురస్కారాలు....
గోతెలుగు:మీ ధ్యేయం, లక్ష్యం...ఏమిటి? ఎటువైపు మీ పయనం...
ప్రసాద్ : కవిత ద్వారా సమాజానికి సేవ చేయడం
గోతెలుగు:మీ గమ్యానికి మీరెంత చేరువలో ఉన్నారు?
ప్రసాద్ : చెప్పలేని పాఠకుల అభిప్రాయం
గోతెలుగు:కలమే శక్తివంతమైన ఆయుధం..మీ ఆలోచనలతో, అక్షరాలతో మీరేం సాధించారు? ఇంకా ఏమేం సాధించాలనుకొంటున్నారు?
ప్రసాద్ : సాధించాల్సింది చాలా ఉన్నది
గోతెలుగు:కొత్త విషయాన్ని చెప్పడం, విషయాన్ని కొత్తగా చెప్పడం...ఏది కవిత పరమార్థం?
ప్రసాద్ : మనం చెప్పే విషయాలు చాలా మందికి తెలిసి ఉంటాయి దానినే కొత్తగా చెప్పాలి
గోతెలుగు: గోతెలుగుతో మీ అనుబంధం....మీ అభిప్రాయం