ఘజల్ శ్రీనివాస్...ఈ పేరు తెలియని తెలుగువారు...ఆయన పదానికి పరవశించనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో....ఆయన పదం...గానం....ఆహార్యం...అన్నీ వైవిధ్యమే. ఘజల్ అనేది ఇంటిపేరుగా స్థిరపడిన శ్రీనివాస్ ఇటీవల గొప్ప సత్కారం అందుకున్నారు....
వసంతపంచమి ఉత్సవాల సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో ఆ రాష్ట్ర మాజీముఖ్యమంత్రి, రాజకీయ యోధుడు ములాయం సింగ్ సోదరుడు ప్రజానేత, శివ్ పాల్ సింగ్ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అలంకరణ పురస్కారం " సావిత్రి-నారాయణ్ స్మృతి పురస్కారం " అందుకున్నారు. ఈ కార్యక్రమంలో స్మృతి-నారాయణ్ బోర్డ్ సభ్యులు సత్వీర్ సింఘ్, వికాస్ ససింఘ్ తదితరులు పాల్గొన్నారు....ఈ శుభసందర్భంలో ఘజల్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ...వారు ఇలాంటి మరెన్నో పురస్కారాలు అందుకోవాలనీ, మరిన్ని ఉన్నతశిఖరాలను చేరుకోవాలనీ గోతెలుగు కోరుకుంటోంది