నయా ట్రెండ్‌: 'రెంట్‌' హండ్రెడ్‌ పర్సంట్‌.! - ..

new trend

నేటి తరం యువతీ యువకుల జీవన విధానమే వేరు. అంతా స్మార్ట్‌. అన్నీ స్మార్ట్‌గా ఉండాలని అనుకుంటున్నారు. ఇలు, ఇంట్లోని వస్తువులు, ఇంటి వాతావరణం కూడా స్టార్ట్‌గానే ఉండాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే వారి ఎంపిక ఉంటోంది. కరెక్ట్‌గా ఆ పాయింట్‌నే మెయిన్‌ పాయింట్‌గా తీసుకుని కొన్ని అంకుర సంస్థలు విభిన్నంగా ఆలోచిస్తున్నాయి. వేలు పెట్టి కొన్న స్మార్ట్‌ ఫోన్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ రాగానే అంతవరకూ వారి దగ్గర ఉన్న మొబైల్‌ ఫోన్‌ బోర్‌ కొట్టేస్తోంది. అంతే వెంటనే మార్చేస్తున్నారు. ఇది మొబైల్‌ విషయంలో. అయితే ఇంట్లోని వస్తువులు.. వీటి విషయంలో కూడా నేటి యువత ఇలాగే ఆలోచిస్తోంది. పాత రోజుల్లో మన బామ్మలు, తాతల కాలంనాటి మంచాలు, కుర్చీలు, ఇతరత్రా ఫర్నీచర్‌ని తరాల తరబడి అలాగే దాచుకునేవారు. కానీ ఈ రోజుల్లో నచ్చిన ఫర్నీచర్‌ బోర్‌ కొట్టిందా.. వెంటనే మార్చేసి మరో కొత్త ఫర్నీచర్‌ తెచ్చేసుకుంటున్నారు. ఇదీ నేటి యువత జీవనశైలి. యువత ఆలోచనలకు తగ్గట్లుగానే ఇంట్లోని పెద్ద వారి ఆలోచనలు కూడా మారిపోతున్నాయి.

అందుకే ఆన్‌లైన్‌లో ఫర్నీచర్‌కి సంబంధించిన అన్ని ఐటెమ్స్‌ అద్దెకు దొరికేస్తున్నాయి. మన బడ్జెట్‌లో మనకు నచ్చిన డిజైన్‌ని నచ్చినన్నాళ్లు వాడుకుని తిరిగిచ్చేయొచ్చునన్నమాట. ఉపాధి అవకాశాల్లో ఇదో కొత్త రకం పద్దతి. దీని పేరే 'గ్రేబ్‌ ఆన్‌ రెంట్‌'. ఇక్కడ ఇంటికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఫర్నీచర్‌ తదితర సామాగ్రి అద్దెకు దొరుకుతుంది. రెంట్‌ కూడా రీజన్‌బుల్‌గానే ఉంటుంది. ఐటెంని బట్టి, నెలా నెలా ఇంత చొప్పున డబ్బులు పే చేస్తే చాలు. ఆయా వస్తువుల్ని మనకు నచ్చినన్నాళ్లు వాడుకోవచ్చు. నగర జీవితంలో రెంటెండ్‌ హౌస్‌ల్లో ఎన్నాళ్లు ఉంటామో తెలీదు. ఇళ్లు మారిన ప్రతీసారి సామాన్లు పాడైపోతున్నాయే అని బెంగపడాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవల్సిన విషయమేంటంటే సీజనల్‌గా వాడే కొన్ని వస్తువులను ఇంట్లో అనవసరంగా ప్లేస్‌ చేయాల్సిన పని లేదు. ఉదాహరణకు ఏసీలు, కూలర్లు వంటివి సమ్మర్‌లో మాత్రమే వినియోగిస్తుంటాం. మిగిలిన రోజుల్లో వాటిని పక్కన పెట్టి, తర్వాత మెయింటెనెన్స్‌కి డబ్బులు తగలబెట్టి.. ఇదంతా పెద్ద తలకాయ నొప్పి. ఈ తలనొప్పి లేకుండా చక్కగా ఆ సీజన్‌లో కావల్సిన ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని మూడు, నాలుగు నెలలు రెంట్‌కి తీసుకుని తిరిగిచ్చేస్తే సరిపోతుంది.

ఇక్కడ అద్దెకు దొరికే వస్తువుల్ని విడివిడిగానూ తీసుకోవచ్చు. లేదంటే ప్యాకేజీ రూపంలోనూ తీసుకోవచ్చు. ఒకేసారి మూడు, లేదా ఆరునెలలకు కలిపి ప్యాకేజీలా అద్దె చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. ఈ గ్రాబ్‌ఆన్‌ రెంట్‌' పద్ధతిలో లాగ్‌ ఆన్‌ అవ్వాలంటే మీ గుర్తింపు కార్డు, ఆడ్వాన్స్‌గా కొంత అమౌంట్‌ చెల్లిస్తే చాలు. ఆన్‌లైన్‌లో కావల్సిన ఐటెంని సెలెక్ట్‌ చేసుకుంటే, ఆ వస్తువుల్ని వారే ఇంటికి తెచ్చిచ్చేస్తారు, ఏసీలు, టీవలు వంటివి కంపెనీ సిబ్బందే అమర్చి వెళతారు. మన అవసరం తీరాక సమాచారమ్‌ అందిస్తే వాళ్లే వచ్చి తీసుకెళ్తారు. చదువుకున్న యువత ఉద్యోగాలు రాక, ఖాళీగా ఉండలేక ఇలాంటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. అమెరికా వంటి దేశాల్లో ఎప్పటినుండో అందుబాటులో ఉన్న ఈ విధానం ఇప్పుడిప్పుడే హైద్రాబాద్‌ వంటి నగరాలకూ విస్తరిస్తోంది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు