సిలికానాంధ్ర విశ్వ విద్యాలయ చిహ్నం ఆవిష్కరణ - .

University of Silicon Andhra Logo Launch

అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం మిల్ పిటాస్ లో తెలుగు భాష,సాహిత్యం,కళా సంస్కృతుల అధ్యయనం కోసం నెలకొల్పుతున్న యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర (U.S.A.)వచ్చే జులైలో పనిచేయడం ప్రారంభిస్తుందని విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్ వెల్లడించారు. నగరంలో నారాయణగుడా లోని ఆంధ్ర బాలానంద సంఘం సమావేశ మందిరం లో ఆదివారం సిలికానాంధ్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నూతన విశ్వవిద్యాలయ చిహ్నాన్ని ఆవిష్కరించారు.

ప్రధానమంత్రి కార్యాలయ పూర్వ సమాచార అధిపతి పీ వీ ఆర్ కె ప్రసాద్ ఈ చిహ్నాన్ని ఆవిష్కరించారు. చిహ్నాన్ని గురించి వివరిస్తూ ప్రాక్పశ్చిమాల తాత్వికత ఇందులో ప్రతిఫలించిందని ఆయన తెలిపారు. ప్రాచీన సాంస్కృతిక మూలాలకు నిలయమైన భారతదేశం, ఆధునిక వికాసానికి ప్రతీకగా నిలచిన అమెరికా ఎంతో అర్ధ్వంతంగా చిహ్నంలో చిత్రింపబడ్డాయని అంతర్జాతీయ సమాచార సంకేతిక విజ్ఞాన అధ్యయన సంస్థ (IIIT) కు చెందిన ప్రముఖ భాషా శాస్త్రవేత్త ఆచార్య పేరి భాస్కర రావు విశ్లేషించారు.

కూచిభొట్ల ఆనంద్ ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తెలుగు భాష,సాహిత్యం,సంస్కృతి అత్యంత ప్రాచీనమైనవని, ఐతే ఇప్పటివరకూ వీటి అధ్యయనం కోసం ప్రపంచంలో ఒక విదేశీ విశ్వ విద్యాలయం ప్రారంభం కావడం ఇదే ప్రధమమని చెప్పారు. భిన్న అధ్యయనాంశాలను విశ్వ విద్యాలయం ప్రవేశపెడుతుందని తెలిపారు. తొలుత తెలుగు భాషా సాహిత్యాలు, కర్ణాటక సంగీతం,కూచిపూడి నాట్యం, భాషా శాస్త్రం తదితర అంశాలో ఎం ఏ స్థాయి కోర్సులను విదేశీ విశ్వ విద్యాయ ప్రమాణాల సరళిలో ప్రవేశ పెడతామని,అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధన,అభ్యాసాంశాలుంటాయని ఆనంద్ తెలిపారు.


ప్రపంచ రికార్డులు నెలకొల్పడంలో అగ్రగామిగా ఉన్న సిలికానాంధ్ర తనదైన శైలిలో, విశిష్టమైన రీతిలో తెలుగుతనం ఉట్టిపడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. సిలికానాంధ్ర అధ్యక్ష్యులు మాడభూషి విజయసారధి,ప్రధాన కార్యదర్శి(ఈండియా) డా. జె. చెన్నయ్య, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ విద్యాత్మక సలహాదారులు డా. రమాదేవి,డా. సుమిత్ర,డా. సరోజ,డా. యశోదా ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదే సమయంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన ఆవిష్కరణ సభలో Pappu Rama Rao Professor Miami University Oxford OHIO, Deena babu,Ajay Ganti, Dilip Kondiparti, Raju CHamarthi, Sriram Kotni, Raja Mangalampalli, Ratnamala Vanka, Kaja Ramakrishna  పాల్గొన్నారు.

 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి