మోచేతులు దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు చిట్కాలు - ..

knee

కొందరికి మోచేతులు నల్లగా ఉంటాయి. బాగా గరుకుగా అనిపిస్తాయి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఆ ప్రాంతం తెల్లగా మారదు. అయితే మోచేతులు, మోకాళ్లు, ఇతర ప్రాంతాల్లో ఉండే నలుపును కూడా కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా తెల్లగా మార్చుకోవొచ్చు.
 తులసి

తులసి ద్వారా మోచేతుల ప్రాంతలో ఉండే నలుపు పోతుంది. తులసి ఆకులను బాగా మెత్తగా చూర్ణంలా తయారు చేసుకోండి. అందులో కాస్త పాలమీగడ కలుపుకోండి. అలాగే కాస్త పసుపు కూడా కలుపుకోండి. ఆ పేస్ట్ ను మోచేతులతో పాటు నల్లగా ఉండే ఇతర ప్రాంతాల్లో పూసుకోండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే కచ్చితంగా నలుపు పోతుంది.

నిమ్మ

నిమ్మకాయను కోసి ఆ ముక్కతో మోచేతుల వద్ద స్మూత్ గా మసాజ్ చేయండి. అలాగే కాస్త తేనె తీసుకుని అందులో చ‌క్కెర‌ కలుపుకోండి. ఆ మిశ్రమంతో నల్లగా ప్రాంతంలో రాసుకుంటూ ఉండండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే నలుపు మొత్తం పోతుంది.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనె కాస్త గోరువెచ్చని కొబ్బరి నూనె తీసుకోండి. అందులో కొంచెం నిమ్మరసం కలపండి. ఆ కొబ్బరి నూనెను మోచేతుల దగ్గర రుద్దుకోండి. అలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే నలుపు మొత్తం తగ్గిపోతుంది.

 శనగపిండి
శనగపిండి ద్వారా కూడా నలుపును తగ్గించుకోవొచ్చు. కాస్త పెరుగు తీసుకోండి. అందులో శనగపిండి కలిపి మిశ్రమంగా తయారు చేసుకోండి. దాన్ని మోచేతుల వద్ద పూసుకోండి. అరగంట అయ్యాక క్లీన్ చేసుకోండి.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ద్వారా కూడా నలుపును పోగొట్టుకోవొచ్చు. కాస్త ఆలివ్ ఆయిల్ తీసుకోండి. అందులో కొంచెం చక్కెర కలపండి. దాంతో మోచేతుల దగ్గర బాగా రుద్దుకోండి. అలా రెగ్యులర్ గా చేస్తే మోచేతులు స్మూత్ గా మారుతాయి. తెల్లగా అవుతాయి.

టమాట

టమాట రసం ద్వారా నలుపును, గరుకుదనాన్ని పోగొట్టుకోవొచ్చు. కాస్త టమాట రసం తీసుకోండి. అందులో కాస్త తేనెను కలుపుకోండి. దాంతో నలుపు ఉన్న ప్రాంతాల్లో మర్దన చేసుకోండి. ఒకవేళ తేనె లేకపోతే కొబ్బరి నూనెను కూడా కలుపుకోవొచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు