కవితలో కవిత్వం కోల్పోకుండా చెప్పడం - ..

చక్కటి కవితలు అందించి గోతెలుగు పాఠకులను అలరిస్తున్నకవుల అంతరంగాన్ని ఆవిష్కరించే ఇంటర్వ్యూలతో పాఠకులకు వారిని మరింత చేరువచేయాలనేది మా సంకల్పంతో అందిస్తున్నవి ఈ ఇంటర్వ్యూలు.. ఔత్సాహికులకు స్ఫూర్తిగా... లబ్దప్రతిష్టులను సైతం ఆకర్షించేలా పాఠకుల మదిలో చిరస్థాయిగా నిలిచి పోయేలా ప్రతిష్టాత్మకంగా అందించడం గోతెలుగు ప్రధానోద్దేశం...ఈ క్రమంలో ఈవారం మనముందుకొచ్చిన కవి నాగ్రాజ్ తో ఇంటర్వ్యూ ఈ వారం మీ కోసం ప్రత్యేకం....)  

గోతెలుగు: మీ జన్మస్థలం, బాల్యం, చదువు, అమ్మానాన్నల గురించి....
నాగ్రాజ్ :  జన్మస్థలం మెట్పల్లి , చదువు బ్.అ. డిగ్రి,  మా అమ్మగారు సరోజ గృహిణి నాన్న గారు గంగాధర్ చిరు బట్టల వర్తకం .
భార్య విశ్వధ, కవల కూతుర్లు షణ్ముఖి ధరణి


గోతెలుగు:మిమ్మల్ని కవితాప్రపంచం వైపు నడిపించిన స్పూర్థిప్రదాతలు....
నాగ్రాజ్ :నేను పదవ తరగతి చదివేప్పుడు
మా నాన్న గారిని బతిమలి శ్రీ శ్రీ గారి ఖడ్గశృష్ఠి కవితా సంకలనం కొనుక్కున్నాను , అదేనన్ను కవితా రచన వైపు నడిపించింది, నా కవితలకు మెరుగులు దిద్దినది మాత్రం గురువులు శ్రీమాన్ మురళిమోహనాచారి గారు, ప్రమోద్
కుమార్ సార్, శ్రీయుతులు వెంపల్లి రెడ్డి నాగరాజు గారు.

గోతెలుగు:మీ తొలి కవితను ప్రోత్సహించిన పత్రిక, సంపాదకులు..ఆనాటి అనుభూతి...
నాగ్రాజ్ :కవితలు రాయడం నా పదిహేనవ యేటనె ప్రారంభించినా....  వాటిని  పత్రికలకు పంపకపోయేది , నేను డిగ్రీ చదివే రోజుల్లో మా టీవీ లో ఒక కవితల ప్రోగ్రాం ప్రసారమయ్యేది అందులో మొట్ట మొదటి సారి నా కవిత చదివారు అది నేను మరిచిపోలేని అనుభవం, ఈ మధ్యకాలంలో ఫేస్ బుక్ కవితాలయం గృూపు వారు మొదట నా కవితలని చాలా ప్రోత్సహించారు వారం వారం వారు నిర్వహించే పోటీలో చాలా సార్లు నా కవితను విజేతగా ప్రకటించారు. నవతెలంగాణ దిన పత్రిక, వార్త దిన పత్రిక , గోతెలుగు , అచ్చంగా తెలుగు, తెలంగాణ సాహిత్యం , అంతర్జాల పత్రికలు నవ మల్లెతీగ మాస పత్రికలు మంచి ప్రోత్సాహాన్ని అందించాయి.


గోతెలుగు:కవి హృదయం, స్పందనలు ఎలా ఉండాలని మీ ఆకాంక్ష..
నాగ్రాజ్ :ఏదేని ఒక సంఘటన అది బాధ కలిగించేదా  సంతోష పరిచేదా అది ఏ రకమైన అనుభూతిని కలించేదైనా దాన్ని వెంటనే కవితారూపంలో, మనకు కలిగే స్పందనలను అదే అనుభూతితో చదివే వారిని ప్రేరేపించేదిగా రాయాలని నా ఆకాంక్ష.

గోతెలుగు:ఆధునిక కవితా ప్రపంచం ఎటువైపు వెళ్తోంది...
నాగ్రాజ్ :ఆధునిక  పరిస్థితుల లో అంతర్జాలం పుణ్యమాని కవిత ఎక్కువ మందికి చేరువ కాగలుగుతుంది. వచన , పద్యకవితలు తమ ఉనికిని ఉన్నతంగా చాటుకుంటున్నాయి.


గోతెలుగు:కవితా లోకంలో మీరెక్కడున్నారు..
నాగ్రాజ్ : మొలక దశలో


గోతెలుగు:భావుకత, వాస్తవికత ఈ రెండింట్లో దేనిపై మీ మక్కువ?
నాగ్రాజ్ :భావుకత తో కూడిన వాస్తవికత


గోతెలుగు:వచన కవిత్వానికి ప్రాస ఎంతవరకు అవసరం?
నాగ్రాజ్ : కవితాత్మకత చెడనంతవరకు


గోతెలుగు:ఊహల్లో తేలిపోతూ అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించేదీ కవులే, వాస్తవాన్ని మరింత భయంకరంగా చూపిస్తూ పాఠకులను భయభ్రాంతులకు గురిచేసేదీ కవులే....ఏది కవి బాధ్యత?
నాగ్రాజ్ :సమయోచితమైన చింతన ను కలిగించేదే నిజమైన కవిత


గోతెలుగు:సమాజం పట్ల కవికున్న బాధ్యత ఎలాంటిది?
నాగ్రాజ్ :కవితే కదిలించేది.  ఇది అనాదిగా కవిత్వం తనంత తానుగా పద్యంగా, పాటగా,వచనంగా ప్రకటించుకుంటూనే ఉంది.


గోతెలుగు:కవితా ప్రపంచం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు, అందుకున్న పురస్కారాలు....
నాగ్రాజ్ : పురస్కారాలు ఏమీ అందుకోలేదు, అందుకు తగిన ప్రయత్నం ఇంతవరకు చేయలేదు.

 

గోతెలుగు:మీ ధ్యేయం, లక్ష్యం...ఏమిటి? ఎటువైపు మీ పయనం...
నాగ్రాజ్ :భాషకు , సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పమైతే బలంగా ఉంది.


గోతెలుగు:మీ గమ్యానికి మీరెంత చేరువలో ఉన్నారు?
నాగ్రాజ్ : గమ్యమేమి నిర్ణయించుకోలేదు,
నిరంతరాయంగా కవితా రచన చేస్తూ పోవడమే

గోతెలుగు:కలమే శక్తివంతమైన ఆయుధం..మీ ఆలోచనలతో, అక్షరాలతో మీరేం సాధించారు? ఇంకా ఏమేం సాధించాలనుకొంటున్నారు?
నాగ్రాజ్ :నా కవిత్వం ద్వారా పండితులను,
పామరులను సమాన స్థాయిలో రంజింపజేయడమే


గోతెలుగు:కొత్త విషయాన్ని చెప్పడం, విషయాన్ని కొత్తగా చెప్పడం...ఏది కవిత పరమార్థం?
నాగ్రాజ్ :కవితలో కవిత్వం కోల్పోకుండా చెప్పడం


గోతెలుగు:గోతెలుగుతో మీ అనుబంధం....మీ అభిప్రాయం
నాగ్రాజ్ :అంతర్జాల పత్రికల్లో అత్యధికులకు నా కవిత్వం చేరువకావడానికి కారకం మన గోతెలుగు పత్రిక ,  నా కవిత్వం కన్నా ముందు నన్ను కార్టూనిస్టుగా తలకెత్తుకున్నది కూడా మన గోతెలుగు పత్రికే , గోతెలుగుతో నా అనుబంధం రాధా మాధవుల ప్రేమ లాంటిది, కుచేలుడు శ్రీ కృష్ణుడి లాంటి స్నేహం లాంటిది. ఇక్కడ రాధ కుచేలుడు నేనన్న మాట. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు