కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లూ స్మార్ట్‌గా సంపాదించేస్తున్నారోయ్‌.! - ..

earning youth very smart

'కూటి కోసమే కోటి విద్యలు' అంటారు మన పెద్దలు. ఆ 'కూటి' తోనే కోటి విద్యలు అనాలి ఇప్పుడు. అవునండీ. ఎవరిప్పుడు ఇళ్లల్లో వంటలు చేసుకుంటున్నారు. అంతా ఆన్‌లైన్‌ ఆర్డర్‌. బ్రేక్‌ఫాస్ట్‌ మొదలుకొని, స్నాక్స్‌, లంచ్‌, డిన్నర్‌, ఆఫ్టర్‌ డిన్నర్‌ స్నాక్స్‌ ఇలా టైంతో పనే లేదు. తెల్లారింది మొదలుకుని, పడుకునే వరకూ ఏదో ఒక ఫుడ్‌ ఆర్డర్‌ చేయడం, ఆ ఫుడ్‌ని ఇంటి వరకూ తెప్పించుకుని హాయిగా ఫ్రెండ్స్‌తో కూర్చొని మెక్కేయడం ఇదే ఇప్పటి ఫ్యాషన్‌. ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్‌ని ఉపాధిగా ఎంచుకుంది నేటి యువత. ఫుడ్‌ ట్రక్స్‌ మొదలుకొని, జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్‌ డెలివరీ సంస్థలతో టై అప్‌ పెట్టుకుంటున్నారు. తద్వారా టైమ్‌తో సంబంధం లేకుండా పార్ట్‌ టైం మనీని గెయిన్‌ చేస్తున్నారు.
దీనికి కావాల్సింది చేతిలో స్మార్ట్‌ మొబైల్‌. తిరగడానికి ఓ బైక్‌ అంతే. పెట్టుబడి లేని వ్యాపారం. టైమ్‌తో అస్సలు సంబంధమే లేని ఉద్యోగం. చదువుకునే విద్యార్ధులు, ఉద్యోగం చేసుకునే కుర్రాళ్లు ఈ ఫుడ్‌ డెలివరీ బోయ్స్‌ అవతారమెత్తుతున్నారు. స్మార్ట్‌గా నచ్చిన టైం నచ్చిన ఫుడ్‌ ఆర్డర్స్‌ని అందించి కష్టానికి తగిన ఫలితాన్ని ఇట్టే అందుకుని ఉపాధి పొందుతున్నారు. డిగ్నిటీ ఫర్‌ జాబ్‌ అన్నమాట. ఎన్ని ఆర్డర్స్‌ డెలివరీ చేస్తే అంతే మనీ. భలేగుంది కదా. అందుకే ఈ జనరేషన్‌ కుర్రాళ్లలో చాలా మంది ఇదే ఉపాధిగా ఎంచుకుంటున్నారు. అయితే ఏ ఉద్యోగానికైనా మంచీ, చెడూ ఉన్నట్లుగా ఇందులో కూడా కొన్ని మంచి చెడులున్నాయ్‌లెండి. ఈ మధ్య ఓ ఫుడ్‌ డెలివరీ బోయ్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే అలా జరిగే పరిస్థితులు చాలా చాలా అరుదు. ఇంత టైం అని పెట్టుకోవడం, ఆ టైంలో ఇన్ని ఆర్డర్స్‌ పాస్‌ చేయడం. నో స్ట్రెయిన్‌, బట్‌ ఓన్లీ గెయిన్‌. ఇదే సూత్రాన్ని ఫాలో చేస్తున్నారు.

చదువుకునే కుర్రాళ్లు చదువులకు అడ్డంకి లేకుండా, ఒక టైం చూజ్‌ చేసుకుంటుంటే, ఉద్యోగులు మరో టైం. పార్ట్‌ టైం అనే కానీ, ఈ రకంగా కుర్రాళ్లు సంపాదించే ఆదాయం ఏమంత తక్కువ కాదండోయ్‌. నెలకు 50 నుండి 60 వేల వరకూ ఆర్జిస్తున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. డిగ్రీలు చేసి, బీటెక్స్‌ కంప్లీట్‌ చేసిన కుర్రాళ్లు కూడా ఆన్‌లైన్‌ ఫుడ్‌ పోర్టల్స్‌లా మారిపోవడానికి ఏమాత్రం మొహమాటపడట్లేదంటేనే అర్ధం చేసుకోవాలి వీటి పట్ల యూత్‌ ఎంతగా ఎట్రాక్ట్‌ అవుతుందో. ఆయా ఫుడ్‌ డెలివరీ సంస్థలు కూడా చదువుకున్న యువతనే ఎక్కువ ప్రోత్సహిస్తోంది. కస్టమర్స్‌తో హుందాగా వ్యవహరిస్తారనే ఉద్దేశ్యం కావచ్చు మరింకేదైనా కావచ్చు. సో హ్యాట్సాఫ్‌ టు ఆన్‌లైన్‌ ఫుడ్‌ పోర్టల్స్‌.!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు