అతివలు రాణించలేని రంగము వుందా?
అతివలు సాధించలేని లక్ష్యము వుందా?
అధినేత్రులై దేశాలను పాలించారు!
వాణిజ్యంలో కూడా రాణించారు!
అభినేత్రులై లోకాన్ని అలరించారు!
ఆటల్లో తమ ధాటిని చూపించారు!
ఆలించగలరు, పాలించగలరు
ప్రేమించగలరు, శాసించగలరు
వంట గది నుండి
యుధ్ధరంగం వరకు
తమ సత్తా చూపించగలరు!
అన్నిటా మేటిగా నిలుస్తున్న ధీర వనితలు
కుటుంబాలని సంతోషంగా
నడిపించే మాతృ మూర్తులు
ఎందరో మహిళా మణులు
అందరికీ శత కోటి వందనాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు !
సుజాత పి.వి.ఎల్