మొటిమలు మచ్చలు మాయం చేసే శెనగపిండి & రోజ్ వాటర్ - ..

Bellamin & Rose Water

అందాన్ని మెరుగుపరుచుకోవడంలో శెనగపిండి మరియు రోజ్ వాటర్ గ్రేట్ బ్యూటీ ప్రొడక్ట్స్. ఈ రెండింటి కాంబినేషన్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల వివిధ రకాల చర్మసమస్యలను నివారించుకోవచ్చు. శెనగపిండిలోనే నేచురల్ బ్యూటీ లక్షణాలు చర్మాన్ని నునుపుగా మార్చడంతో పాటు ముఖంలో గ్లో తీసుకొస్తుంది ముఖ్యంగా ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వల్ల ఫేషియల్ హెయిర్, మొటిమలు మరియు మరిన్ని ఇతర చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. ఫేస్ ప్యాక్ వేసుకొన్న తర్వాత రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు కనబడకుండా పోతాయి. మరి ఈ రెండింటి కాంబినేషన్లో ముఖ సౌందర్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మరి అన్ని ప్రయోజనాలను పొందాలంటే శెనగపిండి మరియు రోజ్ వాటర్ ను ఏవిధంగా ఉపయోగించాలి. వీటి వల్ల ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం... ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి వేసి, దానికి కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేలి. ఉండలు లేకుండా రెండూ బాగా స్మూత్ గా కలిసేదాక పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి, తేమను పూర్తిగా తుడిచేసి, తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో సోప్ వాడకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ముఖ్యంగా ఈ రెండింటి యొక్క కాంబినేసన్ లో ప్రయోజనాలేంటో చూద్దాం: మొటిమలను నివారిస్తుంది: శెనగపిండి మరియు రోజ్ వాటర్ కాంబినేషన్ పేస్ట్ ను ముఖానికి పట్టించి బాగా ఆరిన తర్వాత ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. తడి ఆరిన తర్వాత చిక్కటి తేనెను ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత మంచినీటితో కడిగేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

స్కార్స్ తొలగిస్తుంది : మొటిమల ద్వారా వచ్చిన స్కార్స్ ను నివారిస్తుంది. శెనగపిండి మరియు రోజ్ వాటర్ కాంబినేషన్ పేస్ట్ ను ప్రతి రోజూ ఉదయం అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పేస్ట్ ను అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ముడతలను మాయం చేస్తుంది: శెనగపిండి మరియు రోజ్ వాటర్ కాంబినేషన్ చాలా అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఈ రెండింటి కాంబినేసన్ లో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముకంలో ముడుతలు, సన్నని చారలు తొలగింపబడుతాయి. డ్రై అయిన తర్వాత ఫేస్ మాస్క్ ను తొలగించి శుభ్రంగా చల్లటి నీటితో కడిగి, తడి ఆరిన తర్వాత రోజ్ వాటర్ లో ముంచిని కాటన్ బాల్ తో ముఖం మొత్తం మర్దన చేసుకోవాలి.

ఫేషియల్ హెయిర్ తొలగిస్తుంది: మహిల్లో మరో సాధారణ సమస్య ఫేషియల్ హెయిర్. ఫేషియల్ హెయిర్ వల్ల కొంత మంది చాలా బాధపడుతుంటారు. ఈ సమస్యను నుండి బయటపడాలంటే శెనగపిండి మరియు రోజ్ వాటర్ ఒక బెస్ట్ కాంబినేషన్ . ఈ రెండింటి కాంబినేషన్ లో ప్యాక్ రెడీ చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత మాస్క్ ను తొలగించాలి . ఇలా వారానికొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది .

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు