మహిళలు - మహారాణులు - సుజాత.పి.వి.ఎల్

mahilalu - maharaanulu
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న జరుపుకుంటున్నాం. మహిళలు వివిధరంగాల్లో సామాజిక, సాంస్కృతిక మరియు రాజకీయ ప్రగతికి స్ఫూర్తిగా ఉమెన్స్ డే ని జరుపుకుంటున్నాం. మొదట్లో మహిళా దినోత్సవాన్ని వేరు వేరు తేదీలల్లో జరుపుకునేవారు. చికాగోలో 1908 మే ౩ వ తేది, న్యూయార్క్ లో ఫిబ్రవరి 28...ఇలా వివిధ తేదీల్లో జరుపుకునే వారు. 1913 లో రష్యా మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. అప్పటికే రష్యాలో జూలియన్ క్యాలెండరు అమలులో ఉంది.

1914 కి ముందు మహిళా సమస్యను గురించి ఎన్నో ఆందోళనలు జరిగినాయి. అయితే 1914 నుండి మార్చి 8 వ తేదీని మహిళా దినోత్సవంగా ప్రకటించారు. నిజానికి నేడు స్త్రీలు అడుగిడని రంగమే లేదనడం లో అతిశయోక్తి లేదు. డాక్టర్లుగా, యాక్టర్లుగా, పొలిటీషియన్లుగా ఆడవాళ్లు సంఖ్యలో పెరుగుతున్నారు. ఆధునిక మహిళలు పురుషులతో అన్నింటా సమానమేనని సవాలు చేసి నిరూపిస్తున్నారు. యుద్ధరంగంలో కూడా ముదితలు ఝాన్సీలక్ష్మీ లాగా, రుద్రమ్మదేవి లాగా రాణించగల ధీశాలురు. పారిశ్రామిక విప్లవ కాలంలో పశ్చిమ దేశాలలో తప్పనిసరిగా స్త్రీకి పురుషుడితో పాటు కొంత స్వతంత్ర ప్రతిపత్తి వచ్చింది. దాని ప్రభావం ఇటు వైపు దేశాలన్నిటి మీద పడినట్టే మన ఇండియా మీద కూడా పడింది. దాని ప్రభావమే అబలలు సబలలుగా నిరూపించబడ్డారు. 1996 లో స్త్రీ స్వేచ్ఛ అనే పత్రికను నిర్వహిస్తూ మహిళల హక్కుకు పాటుపడిన సుబ్బమ్మగారికి ఎం.ఏ.థామస్ జాతీయ మానవ హక్కుల అవార్డు వచ్చింది. ఇంకా ఎందరో మహిళా మణులు లతా మంగేష్కర్, మేధా పాట్కర్, మోహినీ గిరీ , మహా శ్వేతా దేవి, రేణుకా మిశ్రా, కరణం మల్లీశ్వరి ...మొదలైన ప్రముఖ మహిళా మణులు తమ తమ స్వీయ ప్రతిభతో ఉన్నత పదవుల్లో వుండి , ఉద్యమాల్లో కళారంగాల్లో తమదైన ప్రతిభ చాటుకుని పలు రంగాల్లో ప్రముఖ మహిళలుగా పేరు తెచ్చుకున్నారు. ముదితల్ నేర్వగ లేని విద్య లేదని నిరూపించుకున్నారు.

భారత దేశం లో మహిళా హక్కుల పోరాటం తొలిసారిగా అహ్మదాబాద్ లో అనసూయా సౌరాబాయి టెక్సటైల్ లేబర్ అసోసియేషన్ అనే పేరుతో కార్మిక సంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసినవారిలో సుశీలా గోపాలన్, విమలా రణబీలే, కెప్టెన్ లక్ష్మి సెహగల్, అహల్యా రoగ్నేకర్, పార్వతీ కృష్ణన్లు ప్రముఖులు. వీరి ఆధ్వర్యం లో మహిళలు పోరాటంలో పాల్గొనడం మరియు నేతృత్వం వహించడం జరిగింది.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు