పొలిటికల్‌ గ్లామరూ.. అదిరింది గురూ.! - ..

political glamour

రాజకీయాల్లో సినీ గ్లామర్‌ కొత్తేమీ కాదు. సినిమాలూ, రాజకీయాలూ ఇంతలా తెలుగునాట కలగలిసిపోయాయంటే అందులో స్వర్గీయ ఎన్టీఆర్‌ వేసిన ముద్ర అలాంటిది. ఎన్టీఆర్‌ కంటే ముందే సినిమాలకీ, రాజకీయాలకీ సంబంధం ఉన్నా, ఎన్టీఆర్‌ వేసిన ముద్ర ప్రత్యేకం. ఇప్పుడాయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. దివంగత హరికృష్ణ కూడా రాజకీయాల్లో యాక్టివ్‌గానే పని చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌, తారకరత్న ప్రచారానికి పరిమితమయ్యారు. హరికృష్ణ కూతురు సుహాసిని ఇటీవల ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో గెలపు, ఓటములు సహజం. అలాగే సినీ ప్రముఖులపై రాజకీయాల్లో ఒకింత ఎక్కువ బురద చల్లడమూ సహజమే.

మెగాస్టార్‌ చిరంజీవి 2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీతో హల్‌చల్‌ చేశారు. కానీ 2014కి వచ్చేసరికి రాజకీయంగా మౌనం దాల్చాల్సి వచ్చింది. ఇప్పుడాయన పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన స్థానంలో పవన్‌ కళ్యాణ్‌ గత ఐదేళ్లుగా యాక్టివ్‌ రోల్‌ పోషిస్తున్నారు జనసేన పార్టీతో. ఇప్పటివరకూ అయితే మెగా కాంపౌండ్‌ నుండి జనసేన పార్టీలోకి ఎవ్వరూ చేరలేదు. నాగబాబు జనసేనలో చేరతారనీ, ఎన్నికల్లో పోటీ చేస్తారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుండి మరోసారి పోటీ చేస్తున్నారు. కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి రోజా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారామె.

సినీ నటుడు మురళీ మోహన్‌ ఈ సారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. కమెడియన్‌ అలీ అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ తరపున ప్రచారం చేయబోతున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఈ సారి సినీ గ్లామర్‌ ఎక్కువే ఉంది. 'వినాయకుడు' ఫేం కృష్ణుడు, థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీ వైఎస్సార్‌ సీపీలో యాక్టివ్‌ అయ్యారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ మామగారు నార్ని శ్రీనివాసరావు ఇటీవల వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, శివ ప్రసాద్‌, దివ్యవాణి, జయసుధ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే. సినిమా గ్లామర్‌ ఖచ్చితంగా ఓట్లు రాబడుతుంది. ఇందులో సందేహం లేదు. కానీ అందరూ రాజకీయాల్లో సక్సెస్‌ అవుతారని చెప్పలేం. ఓటర్లకు మాత్రం సినీ తారల ప్రచారంతో సందడే సందడి.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు