మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
ఈవారం కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత కలిగి ఉండుట అలాగే పెద్దలకు తెలియజేయుట మంచిది. సోదరులతో చర్చలు చేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానం విషయంలో సంతోషాన్ని పొందుతారు. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, సాధ్యమైనంత మేర ఖర్చులను తగ్గించుకోవడం సూచన. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. ఆరోగ్యం విషయాల్లో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
ఈవారం సోదరుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, నూతన ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. తండ్రితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. సాధ్యమైనంత మేర వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండుట సూచన, కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం పొందుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. గతంలో మీరుతీసుకున్న నిర్ణయాలకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. సొంతఆలోచనల విషయంలో తొందరపాటు వద్దు, ఒకింత వేచిచూసే ధోరణి మేలుచేస్తుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది , వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. నూతన ఉద్యోగప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. చిన్న చిన్న విషయాలకు సైతం అధికప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో బాగుటుంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన. బంధువులను కలుసుకునే ఆస్కారం ఉంది, వారినుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈవారం మొదట్లో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి, కాకపోతే అందుకు తగినట్లుగా ఆదాయం ఉండుట వలన పెద్దగా ఇబ్బంది ఉండదు. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. నూతన పెట్టుబడుల కోసమా చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వకపోవచ్చును. సంతానం నుండి వచ్చిన సూచనలు పరిగణలోకి తీసుకోండి. స్వల్పఅనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది, కాస్త జాగ్రతగా ఉండుట సూచన.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
ఈవారం బంధువులను కలుస్తారు, వారితో సమయం సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమాయానికి పూర్తిచేస్తారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది , కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది, ప్రమోషన్ లేక బదిలీకి అవకాశం ఉంది. ఎవరికైనా ఆర్థికపరమైన విషయాల్లో మాటఇచ్చే విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. కొన్ని కొన్ని విషయాల్లో వేచిచూసే దోరని మంచిది.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
ఈవారం పెద్దలనుండి వచ్చిన సూచనలకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యక్తిగతజీవితంలో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాల వలన నష్టపోతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. బంధువులతో ఊహించని విధంగా మానస్పర్దలు పెరుగుతాయి. మానసికంగా దృడంగా ఉండుట సూచన. తల్లి ఆరోగ్యమ్ మిమ్మల్ని ఒకింత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగివస్తారు.
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. పెద్దలతో చర్చలు చేయునపుడు కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. చేపట్టిన పనులు వేగంగా ముందుకు కదులుతాయి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త అవసరం. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. తండ్రితరుపు వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి , వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
ఈవారం మీకు తెలియకుండానే కొన్ని పనుల పట్ల అశ్రద్ధ చూపించే అవకాశం ఉంది, కాస్త యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేయండి. మీ మాటతీరు కొంతమందిని ఆకట్టుకుంటుంది, దానికి తగినట్లు గా మీ ఆలోచనలు ఉండుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతాంలో మీరు తీసుకున్న నిర్ణయాల వలన పెద్దలతో మాటపడే ఆస్కారం ఉంది. ఓపిక అవసరం. విలువైన వస్తువులను లేదా వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆత్మీయుల ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కొంత ఇబ్బందికి గురిచేస్తాయి, బాధపెడతాయి.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
ఈవారం పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. పనులలో కొంత వేగం తగ్గుతుంది. దూరదృష్టిని కలిగి ఉండి ముందుకు వెళ్లడం సూచన. స్త్రీ పరమైన విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంధువులతో ఊహించని విధంగా విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్త అవసరం. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. రావాల్సిన ధనం వారాం చివరలో మీ చేతికి అందే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. సహకారం లభిస్తుంది.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
ఈవారం మిత్రులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. రాజకీయపరమైన విషయాల్లో ఇబ్బంది తప్పక పోవచ్చునునస్టమ్,, నష్టం ఉంటుంది. కుటుంబంలో మీరు ఆశించిన మేర సహకారం రాకపోవచ్చును. తండ్రితరుపు బంధువులను కలుస్తారు. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి లేక మిత్రులనుండి నూతన విషయాలు తెలుస్తాయి.
మీన రాశి : (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )
ఈవారం సంతానం గురుంచి నూతన ఆలోచనలు చేస్తారు. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. సోదరుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ఆరోగ్యం బాగాఉంటుంది,సమస్యలు తగ్గుతాయి. విదేశీ లేదా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం