ఎండాకాలం వచ్చింది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండవేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఎండాకాలం సరైనా జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పిల్లలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడిమికి డీహైడ్రేషన్, విరేచనాలు, చమటకాయలతో బాదపడుతున్నారు. అయితే వేసవిలో దాహార్తిని తీర్చే చల్లటి నీరు, కొబ్బరి బొండాలతో పాటు మజ్జిగ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది. చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. అన్నింటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలాల్లో మీరు తీసుకుంటున్న నీటి కంటే రెండింతలు అధికంగా తీసుకోవాలి. అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను కూడా తినవచ్చు. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది.తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది. వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి. ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది. స్క్రబ్బర్‌లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. వేసవిలో రెండు పూటల స్నానం చేయడం మంచిది.
వడదెబ్బ: శరీరం 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. ఎండలో తిరుగడం వల్ల 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే వడదెబ్బ సమస్య ఏర్పడుతుంది. 38 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. అధిక ఉష్ణోగ్రతకు గురైన వ్యక్తి ఐదు రోజుల్లో మృతిచెందే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఐదేళ్లలోపు, 60 ఏళ్ల పైబడ్డవారు త్వరగా వడదెబ్బకు గురవుతారు. గర్భిణుల రీరంలో తేమశాతాన్ని కాపాడుకోకుంటే వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ ప్రభావం ముందుగా శరీరంపై పడుతుంది.రక్తకణాలు కుచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం మీద పడుతుంది.
వడదెబ్బ లక్షణాలు :
- వడదెబ్బకు గురైనవారి శరీరంలో నీటిశాతం లోపించి బాడీ డీహైడ్రేట్ అవుతుంది.
- శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల గుండె, రక్తనాళాలు, కాలేయం, మూత్ర పిండాలు దెబ్బతింటాయి.
- ఒంట్లోని లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు.
- జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరుగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
- అధిక ఉష్ణోగ్రత వల్ల పల్స్ పడిపోతుంది. తల తిరుగడం, తలనొప్పి వస్తాయి.
- మతి కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, మూత్రం పచ్చగా రావడం లాంటి లక్షణాలుంటాయి.
చికిత్స:
- వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకురావాలి.
- బట్టలను వదులు చేసి 25 - 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న నీటితో శరీరాన్ని తడుపాలి. దీని వల్ల శరీరంపై ఉండే రక్తనాళాలు కుచించుకుపోకుండా ఉంటాయి.
- శరీర ఉష్ణోగ్రత తగ్గేలా చూడాలి. గజ్జలు, చంకలు, మెడపై ఐస్‌ప్యాక్‌లు పెట్టాలి.
- వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి.. సకాలంలో చికిత్స అందించాలి.
పాటించాల్సిన జాగ్రత్తలు:
- ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎండలో తిరుగక పోవడం ఉత్తమం.
- ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే తలకు, ముఖానికి ఎండ తగులకుండా జాగ్రత్త పడాలి. టోపీ, గొడుగు, తలపాగా ధరించాలి.
- ఇళ్లు, కార్యాలయాల్లో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
- ప్రతిరోజూ 5 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలి.
- నీరసంగా అనిపిస్తే ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ కలిపిన నీటిని తీసుకోవాలి.
- ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
- కారం, మసాలాలకు వీలైనంత దూరంగా ఉండాలి.
- కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.
- వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి.
- తగ్గించాలి. యోగా, నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.