ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

ప్రకాష్ రాజ్ ’దోసిట చినుకులు’ పుస్తక పరిచయం!

’దోసిట చినుకులు’ పేరులో ఎంతటి భావుకత్వమో కదా! రచయిత విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్!! స్వతహాగా నాకు కసితో ఎదిగిన మనుషుల నుంచి వచ్చే రచనలు చాలా ఇష్టం. సమాజానికి ఏదన్నా బలంగా చెప్పాలనిపించినప్పుడో లేదా అందర్నీ తనవాళ్లనుకుని తమ అనుభవాలని పంచుకోవాలనిపించినప్పుడో వాళ్లు కలం పడతారు. ఇంతకు ముందు ఐశ్వర్య తన తండ్రైన సూపర్ స్టార్ రజనికాంత్ గురించి రాసినప్పుడు, అనుపమ్ ఖేర్ తన చిత్రసీమ అనుభవాలని కాగితం మీద రంగరించినప్పుడు, ఏ ఆర్ రెహమాన్ కు సంబంధించిన పుస్తకాలు చదివి కొత్త అనుభుతుల్ని సొంతం చేసుకున్నాను.

పోయిన సంవత్సరం డిశంబర్’19 నాడు హైదరాబాదు బుక్ ఫెయిర్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు గేటుకు పక్కగా ఉన్న ఫ్లెక్శీలో ప్రకాష్ రాజ్ గారి దోసిట్లో చినుకులు పుస్తకావిష్కరణ అని చదివి లోపలికి వెళ్లి అడుగునుకదా, ఆ కార్యక్రమం మరుసటిరోజట! ఆ పుస్తకం మిసిమి వారి ప్రచురణట. నేను సరాసరి మిసిమి స్టాల్ కి వెళ్లి అడిగితే మరుసటి రోజు దొరుకుతాయి తప్ప అప్పుడు ఒక్క కాపీ కూడా లేదట. కొంత నిరుత్సాహం కలిగినమాట వాస్తవం.  

ఆ తర్వాత ఇదే విషయం స్నే’హితుడు’ వాసుదేవ మూర్తితో చెప్పి మర్చిపోయాను. అతను ఆ పుస్తకం నాకు సంపాదించి పెట్టాడు. నా ఆనందం వర్ణణాతీతం.

ఇదంతా పుస్తకం నాకు లభించే ముందు నేపథ్యం.

23 జీవితాన్ని కాచి వడబోసినంతటి స్వ’అనుభవాలతో..రెండు మూడు పేజీల నిడివితో.. రచనకు ప్లస్ అయ్యే అందమైన బొమ్మలతో ఒక్క బిగిన చదివింపజేసింది.

 కొన్ని మెచ్చుతునకలు-

ఈరోజు చావుకు గౌరవం లేనందువల్ల, పుట్టుక అర్థాన్ని పోగొట్టుకుంది.

వ్యక్తిని కొలవాల్సింది అతడు ఎదిగిన ఎత్తుతో కాదు, అతడు ఎదిగిన ఎత్తుకి ఎంతమందిని తనతో పాటు తీసుకెళ్లాడని.

మన చెట్లు అడుగుతాయి-మేము రెండు వేల సంవత్సరాల నుండి శిలువల్ని ఇస్తూనే వున్నాం, మీ నుండి ఒక్క ఏసును కూడా ఇవ్వలేకపోతున్నారే?

క్షమాపణ అడిగేవాడు మనిషి, క్షమించగలిగేవాడు పెద్దమనిషి.

గొర్రెల్ కాపరికి దారి తప్పే మేకమీదే కదూ ఎక్కువ ప్రేమ. దారి తప్పని మేకలకు కాపరి భుజాలపై ఎక్కే అదృష్టం దొరకదే!

మూర్ఖత్వం అనేది మనందరి అందవిహీనత్వం.

గెలుపు అనేది ఒక రాజభవనంలాంటిది. అక్కడ భద్రంగా, క్షేమంగా, ఉండవచ్చు. కాని ఏమీ నేర్చుకోలేం. దట్టంగా పెరిగిన అడవుల్లో మాత్రం అనుభవాలు ఆకుపచ్చగా విచ్చుకుంటాయి.      

పుస్తకం నిండా పరచుకున్న జీవిత సత్యాల్లోంచి కొన్ని మాత్రమే పైన ఉదహరించాను.

నాపై ప్రభావితం చూపిన పుస్తకం అనను గాని, ఆలోచనసరళిని సంస్కరించింది అని చెప్పొచ్చు.

ఒక మంచి పుస్తకం చదివిన తృప్తి సొంతం చేసుకున్నాను.

***

 

 

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు