
తస్మాత్ జాగ్రత్త
ఓ నా పిచ్చి గోడ
చెవులున్నాయని
పనికిరాని విషయాలు
రిక్కించి వింటున్నావా
అడ్డమైన విషయాలు
లోనికి దూరుస్తున్నావా
మాటలు నేర్చిన
మనుషులే కాదు
మాటమార్చే మనుషులు
వున్నారని ఏమారకు
కొందరు మనుషులకు
ఒళ్లంతా
ముళ్లుంటాయి
తస్మాత్ జాగ్రత్త
- ఆదినారాయణ