ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొట్ట మొదట స్పందించేది సినీ పరిశ్రమే. ఓ చిన్న నటుడి దగ్గర నుండీ, అగ్ర స్థాయి నటుడి వరకూ తమకు తోచిన రీతిలో స్పందిస్తుంటారు సినిమా వోళ్లు. టెక్నీషియన్లు, హీరోలు, హీరోయిన్లూ, నిర్మాతలూ ఇలా ఒక్కరేంటీ. సామాజికి బాధ్యతగా భావించి ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ వంతుగా సాయమందిస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, పది కాదు పాతిక కాదు సందర్భాలు కోకొల్లలు. మాది ఒకటే కులం. అది సినీ కులం.. మాది ఒకటే మతం. అది సినీ మతం.. మాది ఒకటే జాతి అది సినిమా జాతి.. అంటూ సినీ పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. కానీ సినీ కుటుంబంలోనూ చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతున్నాయ్. అందమైన అద్దాల మేడ కదా.. చిన్న రాయి తగిలినా నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆ చిన్న రాయి రాజకీయం కావడమే దురదృష్టమిక్కడ.
స్వర్గీయ నందమూరి తారకరామారావు, సూపర్ స్టార్ కృష్ణ, రామానాయుడు, జమున, శారద.. ఇలా చాలా మంది రాజకీయాల్లో రాణించారు. ఈ తరంలో చిరంజీవి దగ్గర నుండి బాలకృష్ణ, రోజా, పవన్ కళ్యాణ్ వరకూ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చినవారు అప్పట్లో వ్యక్తిగత విమర్శలు చేసుకునే వారు కాదు. రాజకీయాల్లో చాలా హుందాగా వ్యవహరించేవారు.
దాంతో సినిమాల్లో వారి పట్ల ఎంత అభిమానముందో, అదే అభిమానం రాజకీయాల్లో కూడా దక్కేది. కానీ ఇప్పుడలా కాదు, వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటుతున్నాయి. తద్వారా సినిమాల ద్వారా వారు సంపాదించిన అభిమానాన్ని రాజకీయాల్లోకి వచ్చాక కోల్పోతున్నారు సినిమావోళ్లు. ఎన్టీఆర్ టైంలో ఆయన్ని దేవుడిగా భావించేవారు. ప్రజారాజ్యం పార్టీ టైమ్‌కొచ్చేసరికి చిరంజీవిపై విమర్శల హవా ఎక్కువైంది. అప్పట్లో టీడీపీ నేతగా రోజా, చిరంజీవిని అత్యంత జుగుప్సాకరంగా విమర్శించారు. అది గతం. ఇప్పుడు రోజాలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత రాజకీయాల్లో సినీ గ్లామర్ క్రియాశీలక పాత్ర వహిస్తోంది.
టీడీపీ, వైకాపా, జనసేన, బీజేపీ ఇలా ప్రతీ రాజకీయ పార్టీలోనూ ప్రత్యేకంగా సినీ గ్లామర్ కీలకంగా కనిపిస్తోంది. అయితే రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలూ వేరు. సినీ వ్యక్తుల విమర్శలు వేరు. రాజకీయ నాయకులు ఈ రోజు విమర్శించుకుంటే, రేపు కలిసిపోయి చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంటారు. చాలా సులువుగా పార్టీలు మార్చేస్తుంటారు. కానీ సినిమా జనం అలా కాదు, ఒక్కసారి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే, మళ్లీ తిరిగి కలవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. రాజకీయాల కారణంగా సినీ జనం వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు జుగుప్సాకరంగా మారుతున్నాయి. సినీ జనం ఓ పార్టీకి కొమ్ము కాయడమంటే అది చాలా రిస్క్‌తో కూడుకున్న పని. ఈ పరిణామం తర్వాత తమ కెరీర్‌ని దెబ్బ తీసే సందర్భాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా వైకాపా నేత రోజాలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం ఆమె చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత విమర్శల జోలికి పోవడం లేదు. కానీ చిన్నికృష్ణ, పోసాని, పృధ్వీ, దివ్యవాణి, తదితరులు అలా కాదు, ప్రచారంలో భాగంగా నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ప్రచారంలో సినీ గ్లామర్‌ని వాడుకునే రాజకీయ నేతలు అవసరం తీరాక వారిని చిన్నచూపు చూస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలా చిన్నచూపు చూడబడిన వారు తిరిగి సినిమాల్లోనే తమ జీవితం కొనసాగించాల్సి ఉంటుంది. రాజకీయాల్లో కాదు. ఈ చిన్న లాజిక్‌ని ఎలా మిస్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇటీవల కోనవెంకట్, పవన్ కళ్యాణ్‌పై నోరు జారి, వెంటనే సరిదిద్దుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే, నేను గెలిచినట్లే అని స్టేట్‌మెంట్ ఇచ్చి ఆలీ తన హుందాతనాన్ని చాటుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు విమర్శిస్తే ఓ లెక్క. అలా కాక కేవలం ప్రచారంలో భాగంగానే విమర్శలకు పాల్పడడం సినిమావోళ్లకు అస్సలు తగని పని. రాజకీయాల్లోకి వెళ్లే సినీ జనాలు గుర్తుపెట్టుకోవాల్సిందొక్కటే.. అవసరార్ధం రాజకీయ నాయకులు ఎలాగైనా మారిపోతారు. సినీ జనాలు తమ రెస్పెక్ట్‌ని కోల్పోతారు. సినీ గ్లామర్‌కీ, పొలిటికల్ వాడకానికీ ఉన్న సంబంధం ఇది.. తేడా ఇది. ఈ చిన్న లాజిక్‌ని సినిమావోళ్లు మిస్ చేసుకోకూడదు మరి.