వికారి నామసంవత్సర నవనాయకులు మరియు ఫలితాలు , ద్వాదశ రాశుల ఆదాయ వ్యయాలు - డా. టి. శ్రీకాంత్

vikari nama samvatsara phalitalu
వికారి నామసంవత్సర ద్వాదశ రాశుల వారి ఆదాయ వ్యయాలు 
 
మేషరాశి : 
ఆదాయం ---14   వ్యయం ---14 రాజపూజ్యం ---03 అవమానం --07
వృషభరాశి : 
ఆదాయం ---08   వ్యయం ---08 రాజపూజ్యం ---06 అవమానం --06  
మిథునరాశి: 
ఆదాయం ---11   వ్యయం ---05 రాజపూజ్యం ---02 అవమానం --02  
కర్కాటకరాశి : 
ఆదాయం ---05   వ్యయం ---05 రాజపూజ్యం ---05 అవమానం --02  
సింహరాశి : 
ఆదాయం ---08   వ్యయం ---14 రాజపూజ్యం ---01 అవమానం --05  
కన్యారాశి : 
ఆదాయం ---11   వ్యయం ---05 రాజపూజ్యం ---04 అవమానం --05  
తులారాశి: 
ఆదాయం ---08   వ్యయం ---08 రాజపూజ్యం ---07 అవమానం --01  
వృశ్చికరాశి : 
ఆదాయం ---14   వ్యయం ---14 రాజపూజ్యం ---03 అవమానం --01  
ధనస్సురాశి: 
ఆదాయం ---02   వ్యయం ---08 రాజపూజ్యం ---06 అవమానం --01  
మకరరాశి : 
ఆదాయం ---05   వ్యయం ---02 రాజపూజ్యం ---02 అవమానం --04  
కుంభరాశి : 
ఆదాయం ---05   వ్యయం ---02 రాజపూజ్యం ---05 అవమానం --04  
మీనరాశి :   
ఆదాయం ---02   వ్యయం ---08 రాజపూజ్యం ---01 అవమానం --07   
 
వికారి నామసంవత్సర నవనాయకులు
 
రాజు - శని
మంత్రి - రవి
సైన్యాధిపతి - శని
సస్యాధిపతి - బుధుడు
ధాన్యాధిపతి - చంద్రుడు
అర్ఘ్యధిపతి - శని
మేఘాధిపతి - శని
రసాధిపతి - శుక్రుడు
నీరసాధిపతి - బుధుడు
 
 
నవనాయక ఫలితాలు
 
రాజు ---శని
ఈ సంవత్సరం రాజు శని అగుటచే ధర్మసంభందమైన కార్యక్రమాలు చేయువారికి బాగాఉంటుంది. ఫలితాలు కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. వ్యాపార పరమైన రంగాల్లో అభివృద్ధి కాస్త నెమ్మదించే ఆస్కారం ఉంది. తీవ్రవాదకలాపాలు చేసేవారిని కట్టడి చేయగలుగుతారు. వర్షాలు అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా కురుస్తాయి , వ్యవసాయంలో బాగానే ఉంటుంది. పంటదిగుబడి విషయంలో కాస్త మిశ్రమ ఫలితాలు సూచితం. నూతన పారిశ్రామిక అవకాశాలు కలుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం మాత్రం వేగంగా అభివృద్ధిని కలిగి ఉంటుంది.
 
మంత్రి --- రవి
ఈ సంవత్సరం మంత్రి రవి అగుటచే స్వార్థప్రయోజనాల కోసం పనిచేసే వారు బయట పడుతారు. ప్రజాసంబంధాల పై ప్రభావం అధికంగా ఉంటుంది. ఎవరికి వారికే అహంకారం లేదా గర్వం పెరుగుటకు ఆస్కారం కలదు. ఒకరి మాట పై మరొకరికి విశ్వాసం తగ్గుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. రాజుకు ప్రజలతో సంభందాలు అంతంత మాత్రం గానే ఉండే ఆస్కారం కలదు. కొంత హింస పెరుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్త అవసరం. అనుకోకుండా అవసరం అయినా వస్తువుల ధరలు పెరుగుటకు ఆస్కారం కలదు.
 
సైన్యాధిపతి - శని 
మానసిక వికారాలు పెరుగుతాయి. యుద్ధపరమైన వాతావరణం ఉంటుంది. అధికారులకు సేవకులకు మధ్య అంతరం పెరుగుటకు అవకాశం ఉంది. కాస్త భయాందోళనలు తప్పక పోవచ్చును. అధికమొత్తంలో తీవ్రవాద నిర్మూలన చర్యలు జరుగుతాయి. నాయకుల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. 
 
సస్యాధిపతి - బుధుడు 
పంట పరమైన విషయాల్లో మిశ్రమ దిగుబడి అలాగే కొన్ని రకాల పంటల్లో నిరాశ తప్పక పోవచ్చును.సామాన్యవర్షపాతం ఉంటుంది. పుస్తక ప్రచురణ సంస్థలకు అలాగే పుస్తకాలు అమ్మేవారికి. రచయితులకు మంచి కాలం.  
ధాన్యాధిపతి - చంద్రుడు
పాలు అలాగే పాలకు సంబంధిన ఉత్పత్తులు (పెరుగు, వెన్న, నెయ్యు) మొదలైన వాటి ఉత్పత్తి పెరుగుతుంది. త్వరత్వరగా నిర్ణయాలు తీసుకొనే వారై సంఖ్యా పెరుగుతుంది. వారి పంట కూడా మంచి ఫలితాలే ఇస్తుంది. 
 
అర్ఘ్యధిపతి - శని 
మిశ్రమవర్షపాతం అలాగే నల్లరేగడి భూముల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి. దొంగల వలన భయం పెరుగుతుంది. 
 
మేఘాధిపతి - శని 
సాంప్రదాయ వ్యాధులు అలాగే జ్వరాలు పెరుగుటకు ఆస్కారం ఉంది. కొత్త కొత్త వ్యాధులు వస్తాయి. ప్రజలకు ఇబ్బందులు తప్పక పోవచ్చును. 
 
రసాధిపతి - శుక్రుడు 
సుగంధ ద్రవ్యాలు అలాగే పరిమళాల కు సమ్భనందించిన వ్యాపారాలు అభివృద్ధిని కలిగి ఉంటాయి. 
 
నీరసాధిపతి - బుధుడు 
బంగారు వినియోగం పెరుగుతుంది. స్త్రీ లలో వాటిపై మక్కువ మరింతగా పెరుగుతుంది. 

******************

పంచాంగం

మేష రాశి .....ఈవారం మొత్తంమీద మానసికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడిని పొందుటకు అవకాశం కలదు కావున దైవసంభందమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది కావున ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబపరమైన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అలాగే మీయొక్క అసంభందమైన విధానాల మూలాన కొత్త కొత్త మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. మీయొక్క మాటతేరు మిమ్మల్ని ఇబ్బందిపాలుచేసే అవకాశం ఉంది జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేయకండి నిదానంగా వ్యవహరించుట సూచన. చిననాటి మిత్రులతో మీయొక్క ఆలోచనలను పంచుకొనే అవకాశం ఉంది. తల్లితరుపు వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది.    

 

వృషభ రాశి .....ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. నచ్చిన పనులను ఆరంభించే అవకాశం కలదు వాటికి సమయం ఇస్తారు. ఉద్యోగంలో ఊహించిన విధంగా గుర్తింపు లభిస్తుంది, కాకపోతే అధికారుల మూలాన పనిఒత్తిడి పెరుగుతుంది ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్ళుట వలన  మేలుజరుగుతుంది . చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో వచ్చే మార్పులు మీకు సంతృప్తిని కలుగజేస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకశాలు లభించే అవకాశం కలదు. కుటుంబంలో సభ్యుల నుండి వచ్చు సూచనల విషయంలో స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట మంచిది. అనుకోని ఖర్చులు కలుగుతాయి.  

 
మిథున రాశి ......ఈవారం మొత్తంమీద చర్చాసంభందమైన విషయాల్లో నిదానంగా అలాగే సమయానికి అనుకూలంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటలో ఇతరుల సహకారం తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం ఉత్తమం. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కీలకమైనవిగా ఉండే అవకాశం కలదు కావున బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం సూచన. రాజకీయపరమైన విషయాల్లో అనుకూలమైన మార్పులకు అవకాశం ఉంది. గతంలో మీరు చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట ఉత్తమం. దైవసంబందమైన విషయాలకు సమయం ఇవ్వండి. ప్రతిపనిలోను బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట సూచన. మిత్రులను కలుస్తారు.    

కర్కాటక రాశి ......ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు,నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయంలో సమయానికి ధనం చేతికి అందుతుంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. అనవసరమైన చర్చలకు సమయం ఇవ్వకండి సర్దుబాటు విధానం మేలుచేస్తుంది. పెద్దలతో స్వల్పవిభేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్త. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కలదు. కుటుంబసభ్యుల నుండి చాలావరకు మీ ఆలోచనలను వ్యతిరేకించే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో కొంత అస్మత్రుప్తిని కలిగి ఉంటారు అలహే నూతన నిర్ణయాలను తీసుకుంటారు. తండ్రితరుపు బంధువుల నుండి వార్తలు వింటారు. 

 
 
సింహ రాశి ...... ఈవారం మొత్తంమీద సంతానపరమైన విషయాల్లో కాస్త అసంతృప్తిని కలిగి ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు అవకాశం ఇస్తాయి. ఉద్యోగంలో చిన్న చిన్న సర్దుబాటులు చేసుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి వారి సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది. సోదరసంభందమైన విషయాల్లో చర్చలు చేయుటకు అవకాశం కలదు వారి నుండి కొత్త కొత్త వార్తలను వినే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు అలాగే సామాజిక సేవాకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. స్త్రీ సంభందమైన విషయాల్లో నూతన మార్పులు అలాగే వారినుండి వచ్చే విషయాలు మీలో నూతన మార్పులకు అవకాశం కలిపిస్తుంది.  
 
 
కన్యా రాశి ......ఈవారం మొత్తంమీద ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కలదు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు,నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. నచ్చిన వ్యక్తుల నుండి నూతన సమాచరం సేకరిస్తారు వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. కుటుంబసభ్యులతో చర్చలకు అవకాశం ఉంది కాకపోతే వాటిని సాగదీసే ప్రయత్నం చేయకండి. ప్రయాణాలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. పెద్దలతో విభేదాలు రాకుండా చూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వాహనముల విషయంలో జాగ్రత్తలు పాటించుట అలాగే అగ్నిసంభందమైన వస్తువులతో కలిసి పనిచేసే సమయంలో జాగ్రత్త అవసరం లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును.  
 
 
తులా రాశి .......ఈవారం మొత్తంమీద సమయాన్ని ప్రయాణాలకు కేటయించే అవకాశం కలదు. చాలారోజుల నుండి విదేశీప్రయత్నాలు వాయిదాపడుతున్న వారికి ఆశించిన వార్తలను వినే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది,అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోండి అలాగే నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారసంభందమైన విషయాల్లో మిత్రులతో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన అలాగే భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉంటారు. ఉద్యోగంలో అధికారులతో చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంది వాటికి సమయం ఇస్తారు.  

వృశ్చిక రాశి .......ఈవారం మొత్తంమీద  ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన,ధనమునకు సంభందించిన విషయాల్లో మాత్రం అనవసరమైన వాగ్దానాలు చేయకపోవడం ఉత్తమం. సోదరవర్గంతో చర్చలు చేయుటకు అవకాశం కలదు. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ఉద్యోగంలో పెద్దలతో చర్చలు జరుగుటకు అవకాశం ఉంది వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం కలదు కావున ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. నూతన ప్రయత్నాలను వాయిదా వేయుట ఉత్తమం. కుటుంబంలో సభ్యుల నుండి నూతన విషయాలను తెలుస్కొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది ఈ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట వలన మేలుజరుగుతుంది.

ధనస్సు రాశి ...... ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో నూతన ఆలోచనలు కలిగిఉండే అవకాశం కలదు. అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు వారికి నచ్చిన విధంగా మీయొక్క ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ధనం అవసరానికి సర్దుబాటు అవుతుంది. పనిలో శ్రమను పొందుతారు నిదానంగా వాటిని వాటిని నలుగురి సహాయంతో పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. బంధువుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో చిన్న చిన్న మార్పులకు అవకాశం ఉంది. స్త్రీ సంభందమైన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట సూచన లేకపోతే మాట పడవలసి రావోచ్చును. మిత్రులను కలిసే అవకాశం ఉంది.   
 

మకర రాశి ......ఈవారం మొత్తంమీద చిననాటి మిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొనే అవకాశం ఉంది భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కనభరుస్తారు. కుటుంబంలో ఆశించిన మార్పులకు అవకాశం ఉంది,సంతోషకరమైన వార్తలను వినే అవకాశం కలదు. దూరప్రదేశం నుండి ఒకవార్తను వింటారు ఆవార్త మూలాన మీలో అనుకోని మార్పులకు అవకాశం ఇస్తుంది. దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారపరమైన విషయాలో చిన్న చిన్న మార్పులు జరుగుతాయి వాటిని స్వగాతిన్చుట వలన మేలుజరుగుతుంది.  తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు వాటికి సమయాన్ని ఇస్తారు.  
 

కుంభ రాశి ...... ఈవారం మొత్తంమీద చక్కటి ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది కావున కాస్త శ్రద్ధను కలిగి ఉండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన సత్ఫలితాలు పొందుతారు. ధనమునకు సంభందించిన విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు వారితో కలిసి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కలదు. వారితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి చేయు ప్రయత్నాలు అనుకున్న ఫలితాలను ఇస్తాయి. విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాలలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం అన్నది సూచన. వాహనముల మూలాన అనుకోని ఖర్చులకు అలాగే ఇబ్బందులకు అవకాశం ఉంది జాగ్రత్త అవసరం.    

మీన రాశి ........ఈవారం మొత్తంమీద సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వాటికి సమయం ఇస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి గతంలో మీకు రావాల్సిన ధనం వస్తుంది. మీయొక్క మిత్రులతో మాకు ఉన్న అనుభందం గట్టిపడుతుంది. ఉద్యోగంలో అధికారులతో ఏర్పడు చిన్న చిన్న విభేదాలను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం ఒత్తిడి తప్పక పోవచ్చును నిదానంగా వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మేలు. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. సంతానంతో సమయాన్ని సరదాగా గడుపుతారు వారి మూలాన నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. 
 
 
 
 
డా. టి. శ్రీకాంత్ 

మరిన్ని వ్యాసాలు