జయంతులు
ఏప్రిల్ 12
1.శ్రీ కోపల్లె హనుమంతరావు : వీరు ఏప్రిల్,12, 1880 న మచిలీపట్నం లో జన్మించారు. వారసత్వంగా వచ్చే దివాన్ పదవిని స్వీకరించడం ఇష్టంలేక ప్రజాహిత కార్యక్రమాలకు అంకితం చేశారు. 1910 లో ఆంధ్ర జాతీయ విద్యా పరిషత్ స్థాపించారు. తరువాతి రోజులలో ఆంధ్ర జాతీయ కళాశాల ను దీనికి అనుబంధం చేసారు.
2. శ్రీ వీరవెల్లి రాఘవాచార్య : “ జ్వాలాముఖి “ గా ప్రసిధ్ధి చెందిన వీరు, ఏప్రిల్ 12, 1936, న ఆకారం గ్రామంలో జన్మించారు. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకరు. విరసం సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను 'దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు' పేరుతో హిందీ నుంచి అనువదించారు.
ఏప్రిల్ 16
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు : వీరు ఏప్రిల్ 16, 1848 న రాజమండ్రి లో జన్మించారు. గొప్ప సంఘసంస్కర్త.వితంతు పునర్వివాహాన్ని ప్రోత్సహించారు. ఆంధ్రదేశంలో బ్రహ్మసమాజం స్థాపించారు. ఆయన 130 కి పైగా గ్రంథాలు వ్రాసారు.. ఆన్ని గ్రంథాలు వ్రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి
వర్ధంతులు
ఏప్రిల్ 12
1 శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య : వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా మోక్షగుండానికి చెందినవారు. వీరు తెలుగు మాట్లాడగలిగేవారు. భారతదేశపు ప్రముఖ ఇంజనీరు, పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేశారు.. 1955 లో ఆయనకు భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది. ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు. భారతదేశంలో ఆయన జన్మదినమైన సెప్టెంబరు 15 ను ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు:
వీరు ఏప్రిల్ 12, 1962 న స్వర్గస్థులయారు.
2. శ్రీ ఎక్కిరాల భరద్వాజ : ఒక ఆధ్యాత్మిక గురువు, రచయిత. విశేషించి ఆంధ్రదేశానికి షిరిడీ సాయిబాబా మాహాత్మ్యమును పరిచయము చేసి, గురు శుశ్రూష సంప్రదాయము పట్ల సరైన అవగాహనను ఇచ్చిన వ్యక్తిగా భరద్వాజ ప్రసిద్ధుడు. దత్త సంప్రదాయమును ప్రచారం చేసారు. షిరిడీకివచ్చే భక్తులలో అధికులు దక్షిణాది వారంటే అందులో భరద్వాజ గారి కృషి చాలా ఉంది.
వీరు ఏప్రిల్ 12, 1989 న స్వర్గస్థులయారు.
ఏప్రిల్ 13
శ్రీ షేక్ చిన మౌలానా సాహేబ్ : ప్రముఖ నాదస్వర విద్వాంసులు. నాదస్వరం పేరెత్తగానే ఆంధ్రులందరికీ నాదస్వర విద్వాన్ షేక్ చినమౌలా స్ఫూర్తినిస్తారు, సంస్కృత విద్వాంసుడు. రామాయణం, అమరకోశం వారికి కంఠోపాఠం అని చెప్పుకునేవారు.
వీరు ఏప్రిల్ 13, 1999 న స్వర్గస్థులయారు.
ఏప్రిల్ 14
శ్రీ ప్రతివాది భయంకర శ్రీనివాస్ : P B శ్రీనివాస్ గా ప్రసిధ్ధి చెందారు. ప్రముఖ చలనచిత్ర నేపథ్యగాయకుడు. ఈయన తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలోఎక్కువ పాటలు పాడారు..ఆయన హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడారు.. ఈయన గళం “ సువర్ణ గళం “ గా పేరు పొందింది.
వీరు ఏప్రిల్ 14, 2013 న స్వర్గస్థులయారు.
ఏప్రిల్ 16
శ్రీ తాడిపత్రి రాఘవాచార్యులు : “ బళ్ళారి రాఘవ “ గా ప్రసిధ్ధులు. అవడం వృత్తిరీత్యా న్యాయవాది అయినా, నాటకరంగమంటే ప్రత్యేకాభిమానం. తన సమయాన్ని, సంపదనూ నాటకరం గ పురోభివృధ్ధికే ఉపయోగించారు. ఎందరో దేశ విదేశ ప్రముఖులనుండి ప్రశంసలు అందుకున్నారు.
వీరు ఏప్రిల్ 16, 1946 న స్వర్గస్థులయారు.
ఏప్రిల్ 17
శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ : మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతి, తరువాత 5 సంవత్సరాల పాటు, రాష్త్రపతి గా కూడా పదవిని అలంకరించారు. ప్రముఖ తత్వవేత్త. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు