శ్రీరాముడు.. యుగపురుషుడు - -ప్రతాప వెంకట సుబ్బారాయుడు

sriramudu yugapurushudu

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా!

ముగ్గురమ్మల ముద్దుల కొడుకువు

తండ్రి దశరథుని కంటి పాపవు

చిరుప్రాయంలోనే యాగ రక్షణకు

విశ్వామిత్రుని అడుగుజాడలలో నడిచావు

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా!

బ్రహ్మర్షిని మెప్పించి అస్త్ర శస్త్రాలు పొందావు

రాతిని తాకిన నీ పాదం నాతికి ఇచ్చింది రూపు

ఘోర తాటకిని వధించావు

మారీచ సుబాహులను తుదముట్టించావు

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా!

ఒద్దికగా శివధనుస్సును సంధించి విరిచావు

అందాల సీతమ్మను ఆలిగా పొందావు

అన్యోన్య దాంపత్యమునకు

ఆదర్శంగా నిలిచారు

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా!

చెల్లెలి చెప్పుడు మాటలు

మనసును విరవగ రావణుడు

అపహరించగ సీతను

శోకార్తిచే దుఖించావు

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా!

జటాయువు బుజ్జి ఉడత సుగ్రీవుడు ఆంజనేయుడు

నీ బాధను పంచుకున్నారు

వారధి కట్టారు

రావణ సంహారానికి సహకరించారు

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా!

అమ్మను వెంట కొనితెచ్చుకున్నావు

మీ జంట పండువ అందరి కనులకు

జయము జయము సీతారాములకు

శిర దాయకాలు మీ అడుగుజాడలు!

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా!

ఏరు దాటించ గుహుడిని కాకపోతిని

కీర్తనలతో రామదాసులా మెప్పించకపోతిని

పోతనమాత్యుడిలా నిబద్ధత లేనివాణ్ని

బంటులా నిన్ను కనిపెట్టుకోలేనివాణ్ని

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా!

శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

నా మనసు అనవరతం స్మరించే తారకమంత్రము

భవసాగరాన్నీదే బలము!

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా!

ఒకటే మాట ఒకటే బాణం ఒకతే భార్య

ఇంతకాన్నా లోకానికి ఇంకేంకావాలయ్యా

నీ జీవితమే ఓ సందేశం

నిన్ను కొలవడమే మా జీవితానికి అర్థం

త్రేతాయుగాన జన్మించిన రామయ్యా

జగతిన యుగపురుషుడివై నిలిచావయ్యా

******