రామారావు, సునంద ఇద్దరూ తమ పెళ్ళిరోజున గుడికెళ్ళారు.
దర్శనం పూర్తయ్యాక, మెట్లమీద కూర్చుని కొబ్బరి ముక్కల ప్రసాదం తింటున్నారు.
" ఇంతకీ దేవుణ్ణి ఏం కోరుకున్నావోయ్...?" సరదాగా భార్యనడిగాడు రామారావు.
" మంచిమొగుడు రావాలనీ..." చెప్పింది సునంద.
" ఆ కోరిక ఆల్రెడీ తీర్చాడు కదోయ్ దేవుడు...?"
" అబ్బా నేను కోరుకున్నది వచ్చే జన్మ కోసం అడ్వాన్సు కోరికండీ..."
భర్తగారికి దిమ్మతిరిగిపోయింది...
****************
"ఏమండీ....తపస్సు చేసుకుంటానని అడవికెళ్ళారుగా? మళ్ళీ వచ్చేశారేం?"
ఏం చెయ్యనోయ్..? మొబైల్ డాటా అయిపోయింది...అక్కడ వై-ఫై లేదు...!"
**************
"ఏమిటోయ్ సుబ్రావూ? ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నావని విన్నాను? నిజమేనా?"
" అవున్సార్, నిజమే! " తలొంచుకుని చెప్పాడు సుబ్బారావ్.
" ఏం జాబయ్యా? ఏం పని చేయాలి..? "
" అదీ.. అదీ....అంట్లు తోమడం...బట్టలుతకడం.."
ఇక్కడ ఇంతమంచి ఉద్యోగం చేస్తూ అలాంటి పని చెయ్యడానికి సిగ్గులేదూ? ఇంతకీ ఎక్కడ?
" మా ఆవిడ దగ్గర సార్..! " అసలు విషయం చెప్పాడు...
********************
" బాబూ....ఓ పది రూపాయలు ధర్మం చెయ్యండయ్యా...టీ తాగుతా!"
అదేంటయ్యా? టీ ఐదు రూపాయలేగా?"
" ఓ గంటయ్యాక టీ తాగాలనిపిస్తే ధర్మం చెయ్యడానికి మళ్ళీ ఏ తలకు మాసినోడు దొరుకుతాడో లేదో అయ్యా"
************
జడ్జి : "ఏమయ్యా? పదేపదే దొంగతనం చేస్తూ పట్టుబడడానికి నీకు సిగ్గు లేదా?"
దొంగ : సిగ్గెందుకు సార్...నేను చాలా పట్టుదల మనిషిని....
ఇలాంటి జోకులు మీరూ చెప్పగలరు....మరింకెందుకాలస్యం? ఐదు జోకులకు వందరూపాయల పారితోషికం కూడా అందుకోవచ్చు..అరిగిపోయిన పా.......త జోకులు కాకుండా పాఠకులనాకట్టుకునేవీ, చదవగానే నవ్వొచ్చేవీ పంపండి...మీరు పంపే పది జోకుల్లోంచి ఓ ఐదు ఎన్నిక చేసి ప్రచురిస్తాం....