ప్రశ్న :తలకి దెబ్బతగిలి నక్షత్రాలు కనిపిస్తే ఆనందించేది?
జవాబు : ఖగోళ శాస్త్రజ్ఞుడు.
***
ప్రశ్న : పండినా రాలనిది?
జవాబు : తల.
***
ప్రశ్న : పెళ్లి చూపుల్లో అబ్బాయి తండ్రి ఎడిటర్ అయితే?
జవాబు :’మీ అమ్మాయి నచ్చితే మేమే తెలియజేస్తాం, ఇందులో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు” అనేవాడు
***
ప్రశ్న : భార్యభర్తలు కామెంట్ ప్లీజ్?
జవాబు :నియంత, బానిస!
***
ప్రశ్న : సబ్బులమ్మడానికి సేల్స్ గాళ్ డాక్టర్ల ఇళ్లకు వెళుతుంది గాని లాయర్ల ఇళ్లకు వెళ్లదు కారణం?
జవాబు : డాక్టర్లు తెల్లకోట్, లాయర్లు నల్లకోట్ వేసుకుంటారు కాబట్టి!
***
ప్రశ్న : భార్య ‘అర్ధాంగి’కారం, మరి భర్త?
జవాబు : మౌనాంగికారం!
***
ప్రశ్న : సెల్ ఫోన్?
జవాబు : అందరినీ తన వల్లో వేసుకున్నది!
***
ప్రశ్న : దాంపత్య జీవితం?
జవాబు :ఆర్భాటంగా మొదలై, ప్రశాంతంగా ముగిసేది!
***
ప్రశ్న : న్యూస్ పేపర్?
జవాబు :కొనేది ఒక్కరు, చదివేది ఎందరో!
***
ప్రశ్న : అప్పిచ్చువాడు..?
జవాబు :పిచ్చివాడు!