1.ఒక ప్రవచనా కారుడు మరొకరితో : “ నేను “ ప్రవచనాలు చెప్పబడును “ అని పొట్ట పోషించుకోవడం కోసం టికెట్ పెడితే నా వ్యాపారం దెబ్బతియ్యడానికి నువ్వు నాకెదురుగా” ఫ్రీవచనాలు “ చెప్పబడును అని బోర్డు పెడతావా ?”
****
2.“నిన్న మా మామగారు మతిమరుపుతో చనిపోయారు ?”
“ అదేమిటి విడ్డూరంగా వుందే ?”
“ అవును ఒక అరగంటసేపు వూపిరి పీలవడం మరిచిపోయాడు “
****
3.“ నీ జీవితంలో తలనొప్పి అంటూ కూడా ఎప్పుడూ ఎరగను అన్నావుగా మరి ఒక నెలరోజుల క్రితం అదేదో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్లో కనిపించావ్ ?”
“ ఏమి లేదు . నాకు అప్పుడు బ్రైన్ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందిలే “
****
4.“ ఎడం చేత్తో షేక్ హాండ్ ఇవ్వకూడదని తెలియదా ?”
“ మరేం చెయ్యమంటావ్ కుడిచేతికి లక్షరూపాయల ఖరీదు చేసే వుంగరాలు వున్నాయి మరి “
****
5.గోపాలం మాస్టారికి నుదుటిమీద గోళీకాయంత కణిత వుండేది. ఆయన క్లాసులోకి రాగానే పిల్లలంతా “గోళీగారు” వచ్చారు అంటూ గట్టిగా అరుస్తూ వుండేవారు. ఈ బాధ పడలేక ఒకరోజు ఆయన ఆ “గోళీ” కాస్తా ఆపరేషన్ చేయించుకుని చక్కా వచ్చారు. అంతే “ కట్ గోళీ గారు వచ్చారు “ అంటూ క్లాస్ రూమ్ మార్మోగిపోయింది.