ఆన్‌లైన్‌ స్నేహం.. ఆల్‌ 'రైట్‌' కాదు.! - ..

Excitement

ఒకప్పుడు బంధువుల గురించి మాట్లాడుకునే వాళ్లం. స్నేహితులతో కలివిడిగా ఉండేవాళ్లం. బంధువుల వ్యవహారం పక్కన పెడితే, స్నేహితుల రూటు మారిపోయింది. నీ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ లిస్టులో ఎంతమంది ఉన్నారన్నదే లెక్కగా భావిస్తున్నారు చాలామంది. ఎన్ని లైకులు పడ్డాయి.? ఎంతమంది షేర్‌ చేశారు.? ఇదీ ఈనాటి స్నేహం తీరు. ఎక్కడో అమెరికాలో ఉన్న స్నేహితుడితో ముచ్చటించాలనుకుంటే, సోషల్‌ మీడియా దానికి సరైన వేదిక. చాలా రకాల మొబైల్‌ యాప్స్‌ కూడా దూరాన్ని తగ్గించేస్తున్నాయి. కానీ స్నేహం సంగతి దేవుడెరుగు.. ఈ సరికొత్త సాంకేతిక విప్లవం ప్రాణాలు తోడేస్తోంది.

దేనినయినా మనం వాడే తీరును బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్‌ లిస్టులో ఎవరికి అవకాశం కల్పిస్తున్నామో, తెలుసుకోకుండా, పెచ్చిపోతే ఆ తర్వాతి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటాయి. ఇటీవల కాలంలో జరుగుతున్న చాలా హత్యలు, చాలా చాలా అత్యాచారాలకు సోషల్‌ మీడియానే కారణమవుతోంది. ఓ నలభయ్యేళ్ల వ్యక్తికి, ఓ పదహారేళ్ల అమ్మాయితో స్నేహం.. నిజానికి అది స్నేహం కాదు. అది ఇంకోటేదో. తెలిసీ, తెలియని వయసులో ఆ అమ్మాయి వేసే తప్పటడుగు ఆమె భవిష్యత్తును సర్వ నాశనం చేసేస్తోంది. దారుణమేంటంటే, ఆ బాలిక జీవితం నాశనమైపోయాక కానీ, అసలు జరిగిందేంటో ఆమె తల్లితండ్రులకు తెలియడం లేదు.

పరీక్షకు అప్లై చేయాలనో, ఫ్రెండ్‌తో ఛాటింగ్‌ చేస్తున్నాననో చెబుతూ, అమ్మాయిలూ, అబ్బాయిలూ చేస్తున్న పనులు చాలా వరకూ ఇవే. నియంత్రణ లేకపోవడం, సాంకేతిక విప్లవం పలు అనర్ధాలకు కారణమవుతోంది. పిల్ల మెడలో గంట కట్టేదెవరు.? ఇది మళ్లీ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఒక దారుణం జరిగింది కదా.. ఇంకో దారుణం జరగకుండా జాగ్రత్త పడతారనుకోవడానికి వీల్లేదు. ఒకదాని తర్వాత ఒకటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సెల్ఫీ పిచ్చి కావచ్చు.. తమ అందాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే అత్యుత్సాహం కావచ్చు.. బ్లాక్‌ మెయిలర్స్‌కి ఆస్కారం కల్పించేస్తున్నాయి ఇలాంటి చర్యలు.

ఎంతగా చైతన్యం తెస్తున్నా, యువతలో మార్పు మాత్రం కనిపించడం లేదు. అందరూ అని కాదు కానీ, విద్యావంతుల్లోనూ చాలా మంది ఈ చెడు స్నేహాల బారిన పడి జీవితాల్న నాశనం చేసుకుంటున్నారు. ఫ్రెండ్‌షిప్‌ పేరుతో పుట్టుకొచ్చే గ్రూపులు ఈ మధ్య పరిస్థితిని ఇంకా దారుణంగా మార్చేశాయి. వ్యక్తిగతంగా ఎవరికి వారు, ఇలాంటి దురదృష్టకర పరిణాలపై అప్రమత్తంగా ఉండకపోతే, భవిష్యత్తు మరింత భయానకంగా మారిపోతుంది. ఆన్‌లైన్‌ స్నేహం ఎప్పుడూ ఆల్‌ 'రైట్‌' కాదు. బీ కేర్‌ఫుల్‌ ఆల్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు