త్రిమతా చార్యులలో ఒకరైన అద్వైత మత స్థాపకులు ఆదిశంకరులు ఆదర్శమూర్తి . 8 వ. శతాబ్ధిలో కేరళలోని కాలడీ లో నంబూద్రి బాహ్మణ వంశమున ఆర్యాంబ , శివ గురువులకు ప్రవేశ గర్భం ద్వారా జన్మించా డు. సంతానంలేని ఆ దంపతులు వృషభా చలేశుని ప్రార్ధించగా, గర్భాలయం లోని శివలింగం నుండీ ఒక వెలుగు వచ్చి ఆర్యాంబ గర్భమున ప్రవేశిస్తుంది. ఆమె గర్భం ధరించి మగ శిశువుకు జన్మని స్తుంది. వారి ఇల వేల్పైన శంకరుని వరంతో పుట్టినందున 'శంకరు డని ' నామకరణంచేస్తారు. పసివయస్సులోనే తండ్రినికొల్పోయిన శంకరుని తల్లి తన నిరంతర పర్యవేక్షణతో ప్రేమతోపెంచిఅఖండ ప్రఙ్ఞావంతునిగా సకల విద్యలలో ప్రవీణునిగా ,మానవతా మూర్తిగా చేస్తుంది. పసివయస్సులోనే వేద వేదాంగాలు పుక్కిట పడతాడు శంకరుడు.
తల్లిపట్ల కృతఙ్ఞత, భక్తి:- ఒక నాడు దూరంగా ఉన్న పూర్ణా నదినుండీ నీరు తెచ్చుకోను తల్లిపడే బాధ చూసి ఎంతో నొచ్చుకున్న బాలశంక రు డు' పూర్ణానది ఈ క్షణం నుండీ మా పెరడు ముందు నుంచీ ప్రవహించు గాక ' అని అన గానే నది శంకరునిపెరటి వాకిలి పక్క నుండీ ప్రవహించ సాగింది.
అలా పసితనంలోనే తల్లికి సేవ చేసి మాతృఋణం తీర్చుకుని,' మాతృదేవోభవ ' అనే భారతీయ సంస్కృతిని ఆచరించిన మేధా వంతుడు, మాతృ భక్తుడు, ఆదర్శ కుమారుడు బాలశంకరుడు .
తల్లి అనుఙ్ఞ:- ఒక నాడు పూర్ణా నదిలో స్నానం చేస్తున్న బాల శంకరుని నదిలో ఒక 'మొసలి కాలు పట్టుకుని లోనికి లాగ సాగింది. శంకరుడు ఒడ్డున పనిలో ఉన్న తల్లిని "అమ్మా! ఈమొసలి నన్ను వదిలే లాగా లేదు, నాకు మరణం తధ్యం, ఈ చివరి క్షణాల్లో నాకు, సన్యాసం స్వీకరించేందుకు అనుమ తివ్వు" అని కోర తాడు. తల్లి ఐన ఆర్యాంబ కుమారుని చివరి కోరికను అయిష్టంతోనే మన్నిస్తుంది. ఆశ్చర్యంగా మొసలి బాలశంకరుని వదలి వెళ్ళిపోతుంది. అలా బాల్యంలోనే శంకరులు తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి దేశ యాత్ర చేయుటకై ఇల్లు వదలి వెళ్ళుతూ " అమ్మా! నీవు కోరినంతనే నీ వద్దలు రాగలను " అని తల్లికి మాట ఇచ్చి ,అలా 8వ ఏటనే శంక రుడు సనాతన ధర్మోధ్దరణకై దేశాటనకు బయల్దేరి వెళతాడు.
పేదరికము పట్ల బాధ్యత :- ఒకనాడు భిక్షాటన చేయుచున్న బాల శంకరుడు ఒక బ్రాహ్మణ గృహము ముందునిల్చి 'మాతా భిక్షాం దేహి ' అనగా, తలుపు వెనక నుండే ఆ గృహిణి " నాయనా ! నా ఇంట నీకు ఇచ్చుటకు ఏమీలేదు , బయటికి వచ్చి చెప్పుట కైననూ, నా కున్న ఒకే ఒక చీరను ఆర బెట్టు కొను చున్నాను, నాయనా ! బ్రహ్మ చారిని ఉట్టిగా పంప కూడదు , నాఇంట ఉన్న ఈ ఎండిన ఉసిరి కాయను స్వీకరించు " అని చెప్పి తలుపు చాటునుండే ఆ ఉసిరి కాయను శంకరుని జోలెలో వదులుతుంది..
ఆమె పేదరికమునకు శంకరుని హృదయం ద్రవించి , లక్ష్మీ దేవిని ప్రార్ధిస్తాడు , ఆ గృహిణికి సంపద ప్రసాదించమని ,' లక్ష్మీదేవి " ఈమె ఏ జన్మలోనూ దానం చేయ నందున నేను సంపద ప్రసాదించ లేను,” అని చెప్పగా ,శంకరుడు " తల్లీ ! ఈమె నాకు ఈ ఉసిరికాయను దానం చేసింది కనుక నీవు ఈమెకు సంపద ప్రసాదించ వచ్చు కదా?" అని అడిగి, ' కనక ధారా స్తవం ' చదగానే ఆగృహిణి ఇంట పై కప్పు నుండీ బంగారు ఉసిరికాయలు కురుస్తాయి. అలా శకరుడు చిన్నతనంలోనే మాన వత్వాన్ని , పేదలపట్ల తన కర్తవ్యాన్ని చూపి ఆదర్శమూర్తి ఐనాడు.
తండ్రి మాటపై భక్తి విశ్వాసాలు :- ఒక రోజున తండ్రి పని మీద బయటికి వెళుతూ బాల శంకరుని 'పార్వతీ మాతకు పూజ చేసి క్షీర నైవేద్యం 'చేయమని చెప్తాడు.
పూజ పూర్తిచేసి శంకరుడు పాలు నైవేద్యం చేయగా ఆమె త్రాగదు. శంకరుడు కోపంతో " ఏమి తల్లీ! నా తండ్రి చేసిన నైవేద్యం స్వీకరించి నేను ఇస్తే గ్రహించ వేమి? నా పూజలో లోపమా ? నీవు పాలు త్రాగందే నేను వదిలేది లేదని" హఠం వేయగా, పార్వతీమాత వచ్చి గిన్నెలో పాలన్నీ త్రాగి వెళుతుంది.
ఇంట్లోవారు , పాల ప్రసాదం ఏదని అడుగగా " అమ్మ త్రాగిందని " చెప్తాడు బాలశంకరుడు , తండ్రి కోపంతో " పాలన్నీ నీవే త్రాగి అమ్మ త్రాగిం దని చెప్తావా? " అని కోపించగా తిరిగి దేవతా గృహంలోనికి వెళ్ళి తలుపులు వేసి " ఏమమ్మా! మాకు ప్రసాదం మిగల్చక అన్నీ త్రాగే శావా? ఇంట్లోవారు నన్నుకోపిస్తున్నారు , ప్రసాదం ఇవ్వు " అని అడగ్గా ఆ బాలుని భక్తికి, హృదయ స్వఛ్ఛతకూ మెచ్చినమాత తన స్థనం నుండీ పాలుతీసి ప్రసాదంగా ఇస్తుంది. ఆ పాల ప్రసాదపు తియ్యద నానికి ఆశ్చర్య పడ్డ ఇంటివారు " ఈపాలు ఎక్కడివని " అడగ్గా బాలశంకరుడు జరిగిన విషయంచెప్తాడు. ఆ పసి బాలుని స్వఛ్ఛ హృదయానికీ , భక్తికీ తండ్రి అచ్చెరు వందుతాడు.
గురుభక్తి:- శంకరుడు నర్మదానదీ తీరంచేరి అచ్చట నివసిస్తున్న గోవింద భగవత్పాదులకు ఏడేళ్ళు శిష్యరికం చేసి వేదాంత రహస్యా లన్నీ నేర్చి గుర్వాఙ్ఞపై కాశీ నగరంచేరి అచ్చటి ఉధ్ధండ పండితు లను వాగ్వివాదంలో ఓడించి అద్వైత మత స్థాపన చేసి ఆదర్శ శిష్యు డై ప్రస్థాన త్రయము నకుభాష్యము వ్రాసి అద్వైత సందేశమును సుగమం చేస్తాడు.
శంకరుని కార్యదీక్ష:- బ్రహ్మ సూత్రములకు భాష్యము వ్రాయుచున్న సమయంలో కాశీలో శంకరునికి వేద వ్యాసుడు దర్శనమిచ్చి ' దిగ్వి జయ యాత్ర చేయమని చెప్తాడు. ఇది ఆయన కార్య దీక్షకు నిదర్శ నం.
నిరాడాంబరత:- ఆ తర్వాత దిగ్విజయ యాత్రలో కర్మ సిధ్ధాంతము సర్వోత్తమ మైనదని నమ్మి దానిని సమాజం లో ప్రచారం చేయు చున్న కుమారీల భట్టును , మండన మిశ్రుని వంటి మహా పండితు లను , మండన మిశ్రుని భార్య ఉభయ భారతిని సైతం ఓడిచి , ఒప్పం దం ప్రకారం మండన మిశ్రుని తన శిష్యునిగా చేసుకుని ఖ్యాతి గాoచి ననూ నిరాడంబరునిగా , నమ్మిన సిధ్ధంతమును ప్రచారం గావించి ప్రజా శ్రేయస్సుకై పాటుపడిన ఆదర్శ బోధకునిగా శంకరుడు పేరుగాంచాడు.
సమాజంపట్ల బాధ్యత:- కర్మ సిధ్ధాంతం పేర మోసపుచ్చే స్వార్ధ పరు లైన మతాచార్యుల నుండీ అమాయక జనులను కాపాడుటకై తన శిష్యుల తో కల్సి ,అర్ధం లేని ఆచారాలను ఖండించి సనాతన ధర్మ విశిష్టతను వివరించి ఙ్ఞాన మార్గమును బోధించి సమాజం పట్ల తన కర్తవ్య దీక్షను చూపిన బాధ్యతాయుతుడైన ఆచార్యుడు,మహోన్నత మానవతామూర్తి శంకరుడు.
కుమారునిగా తల్లి పట్ల కర్తవ్యదీక్షాపాలన :-అవసాన దశలోఉన్నతల్లి తలచు కొనగానే వెళ్ళి, ఆమెకు స్వస్థత చేకూర్చి కుమారునిగా తన ధర్మమును నెరవేర్చి ,ఆమె మరణించగా , భౌతిక కాయమును దహన ము చేయుటకు గ్రామస్థు లెవ్వరూ సహక రించనందున తన ఇంటి వెనుక పూర్ణా నదీతీరమున శవ దహనము గావించాడు. ఆప్రదేశము ఒక పవిత్ర యాత్రా స్థలమై వెలసినది.
కార్య నిర్వహణా సమర్ధత:- తన అద్వైతమత సిధ్ధాంత శాశ్వత ప్రచా రమునకై ఉత్తరమున హిమాలయ ములపై బదరి లోనూ, పడమర ద్వారక లోనూ, తూర్పున పూరీ జగన్నాధo లోనూ, దక్షిణ మున శృంగేరీ లోనూ పీఠములు స్థాపించి తన ప్రధాన శిష్యులను పీఠాధి పతులుగా చేసి కర్తవ్య దీక్షలో కృత కృత్యు డైన కార్య నిర్వ హణా సమర్ధుడు .
ఆధ్యాత్మిక గ్రంధకర్త:-శంకరుని రచనలలో ముఖ్యమైనవి బ్రహ్మ సూత్రములు, దశోపనిషత్తులు, భగవద్గీతకు భాష్యo, వివేక చూడా మణి, ఆత్మబోధ, సౌందర్యాలహరి, ఉపదేశ సహస్రిక , కనకధారా స్తవం వంటి అనేక స్తోత్రాలు,భజ గోవిందం అనేవి కొన్ని మాత్రమే! సర్వతంత్రస్వతంత్ర, పరమ హంస పరి వ్రాజకా చార్య అనే బిరు దులు , అనేక అద్భుత కృత్యములు సాధించిన శంకరాచార్యులు తన 32 వఏటనే కేదారనాధ్ లో అదృశ్యమై పోయినారు. ఆచార్య ఆది శంకరులు కేవలo అద్వైత మత స్థాపకులే కాక ఉత్తమోత్తమ ఆదర్శ మానవునిగా, సమాజ సేవకునిగా, కుమారునిగా, భక్తునిగా , శిష్యునిగా , గురువుగా ,కర్తవ్యాపాల కునిగా ,గ్రంధకర్తగా, భక్తునిగా సర్వ జనాళికీ సర్వేసర్వదా చిరస్మరణీయులు.