జోకులు: అర్జున్ కార్టూన్లు : చక్రవర్తి
మంచి మొగుడు

దర్శనాలయ్యాక మెట్లమీద కూచుని ప్రసాదం తింటున్నారు.
" ఏం కోరుకున్నావోయ్ దేవుణ్ణి" సరాగా అడిగాడు భర్త
"మంచి మొగుడు రావాలని కోరుకున్నానండీ" చెప్పిండి భార్యామణి
"ఆల్రెడీ నీ కోరిక తీర్చాడు కదా దేవుడూ"
సర్లెండి కనీసం వచ్చే జన్మలో నైనా తీర్చమని మొక్కుకున్నా"
*****
మ్యారేజ్ సెంటర్

"ఇది పొట్ట కాదు డియర్, కడుపు, వెళ్ళాల్సింది ఒబేసిటి సెంటర్ కి కాదు, రిజిస్టర్ మ్యారేజ్ సెంటర్ కు...
*****
ముద్దుల మొగుడు

"ఇద్దరికి చీరలు కొనివ్వడం, ఇద్దర్నీ షాపింగ్ కు తీసుకెళ్ళడం ఇద్దర్నీ సుఖపెట్టడం, ఇద్దర్నీ పోషించడం నాకేం ఇబ్బండి లేదురా, కానీ...
"మరి ప్రాబ్లెం ఏంటిరా?
"ఇద్దరితో దెబ్బలు తినాలంటేనే... నా వల్ల కావట్లేదురా"
బావురుమన్నాడు.
*****
ఆంగ్ల భాష

"50% వచ్చు"
"అదేంటి?"
'30 రోజుల్లో ఆంగ్ల భాష నేరుచుకుంటున్నాను.
ఇప్పటికి 15 రోజులయింది.."
*****
బాగుందా..

"రాత్రి కూర బాగున్నందుకు మా ఆవిడ.."
"అదేంట్రా కూర బాగుందని మెచ్చుకుంటే కొట్టడమేంటీ?"
"కూరొక్కటే బాగుందా, చారు బాలేదా? అన్నం బాలేదా
ఇంకేం బాలేవా అనీ..."