గోవిందరాజు సీతా దేవి సాహితి వేదిక అధ్యక్షురాలు సుభద్రాదేవి ఆద్వర్యం లో కార్టూనిస్ట్ రామ్ శేషుకు " గోవిందరాజు సీతా దేవి "పురస్కారం అందజేశారు. చిత్రంలో గోవిందరాజు సీతా దేవి సాహితి వేదిక అధ్యక్షురాలు సుభద్రాదేవి ,శ్రీమతి వినయ,ప్రముఖ కవి శ్రీ ఈతకోట సుబ్బారావు ,కార్టూనిస్టులు శ్రీ రామ్ ప్రసాద్,శ్రీ బి,వి.ఎస్ ప్రసాద్ గార్లు వున్నారు.
రాజాధిరాజ, చిటపటలు కార్టూన్ ఫీచర్ల ద్వారా గోతెలుగు పాఠకులకు చేరువైన రాం శేషుగారికి గోతెలుగు శుభాభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి పురస్కారాలు వారు మరెన్నో అందుకోవాలనీ, మరెన్నో చక్కటి కార్టూన్లు వారి కుంచె నుంచి జాలువారి పాఠకులను అలరిస్తూనే ఉండాలనీ కోరుకుంటోంది.