పంచరత్నాలు - ..

జోకులు: మాధవ్   కార్టూన్లు : అర్జున్

సన్యాసం స్వీకరించాలని ఇల్లొదిలేదీ బయల్దేరబోయాడు భర్త.
" ఇప్పుడిక్కడ తమరికేం తక్కువైందో? " వెటకారంగా ప్రశ్నించింది భార్యామణి.
" గౌరవం..." తెచ్చిపెట్టుకున్న బింకంతో పలికాడు భర్త...
" నన్నే అడిగి తగలడొచ్చుగా? ఇవ్వనా ఏమిటి? సర్లెండి...అదేదో నేనే ఇస్తాగానీ, లోపలికి వచ్చేడవండి ముందు...."



*****

స్మార్ట్ ఫోన్ చూస్తూ నడుస్తున్న ఓ మానవుడికి ఆయువు తీరి యమభటులొచ్చి పట్టుకుపోతున్నారు....
అలాగే స్మార్ట్ ఫోన్ చూస్తూ వాళ్ళతో నడుస్తున్నాడా మానవుడు....
" మానవా... ఓయ్ మానవా...నువ్వు గ్రేటోయ్..." అన్నాడో యమభటుడు...
" దేనికో..? "
ఫోన్ చూస్తూనే ప్రశ్నించాడా మానవుడు...
ప్రాణాలు తీసుకొచ్చేప్పుడు మానవులూ గింజుకుంటారు.... ఏడుస్తారు..రామని పేచీపెడతారు...నువ్వైతే ఎంచక్కా సైలెంటుగా మాతో వచ్చేస్తున్నావ్" మెచ్చుకోలుగా అన్నాడో భటుడు....
మానవుడు ఒక్కసారి తల ఎత్తి అటూ ఇటూ చూసి యమభటుల వైపు, తాము నడుస్తున్న మేఘాల వైపు చూసి....." అయ్యో...నేను పోయానా? మీరు యమభటులా? ఫోన్ చూస్తూ నడుస్తున్నా నేను గమంచించలేదు బాబోయ్..." అంటూ ఏడుపు లంకించుకున్నాడా మానవుడు....


******

" ఏమండోయ్...కార్లో వచ్చేప్పుడు...దార్లో ఓ నాలుక్కేజీల మామిడి పళ్ళు పట్టుకొస్తారూ " అడిగింది భార్యామణి....
" మామిడి పళ్ళా? కాలం కాని ఈ కాలంలో మామిడి పళ్ళెక్కణ్ణుంచి తేనే? " ఆశ్చర్యంగా అడిగాడా రాజకీయ నాయకుడు.
" మరే..! కాలాలతోనూ, సాధ్యాసాధ్యాలతోనూ సంబంధం లేకుండా ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేసేస్తూంటారుగా మరి తమరు...?" చురక అంటించింది.....

 


*******

"మా ఆయనకు ఆఫీసులో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే బాగా కోపమొస్తుందే...." చెప్పింది రమణి.
" ఏం..? వర్క్ లో డిస్ట్రబ్ చేస్తేనా? "  అడిగింది సురభి.
"నా బొంద.....నిద్రలో డిస్ట్రబ్ చేస్తే...." అసలు విషయం చెప్పింది రమణి.

******

"మన పెళ్ళి జరగదు మోహన్...." బాధగా చెప్పింది రాధ..
" ఏ....? ఎందుకు రాధా? ఎందుకు జరగదు...??" మరింత బాధగా ప్రశ్నించాడు మోహన్....
"నన్ను ఏ ఇంజనీరుకో, డాక్టరుకో మాత్రమే ఇచ్చి పెళ్ళి చేయాలని మా నాన్న గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు....." చెప్పింది...
" డాక్టరా..? ఇంజనీరా ? ఏదోకటి కచ్చితంగా కనుక్కో రాధా..." సాలోచనగా అన్నాడు మోహన్...
" కనుక్కుంటే ఏం చేస్తావు మోహన్? " ఆశ్చర్యంగా అడిగింది రాధ..
" 30 రోజుల్లో డాక్టరు కావడమెలా...30రోజుల్లో ఇంజనీరు కావడమెలా? లాంటి బుక్స్ కొనుక్కుని నేనే డాక్టరో , ఇంజనీరో అయిపోతాను డార్లింగ్" గొప్పగా చెప్పాడా ప్రియమోహనుడు.  

...

 

....

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు