పంచరత్నాలు - ..

జోకులు : మాధవ్, బొమ్మలు: మోహన్

 

రోజూ గొడవపడే భార్యాభర్తలు ఆ రోజు ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు..
భార్య : మీరు చాలా అమాయకులండీ.. మిమ్మల్ని ఎవరైనా సరే చిటికెలో యెదవను చేయగలరు..
భర్త : నిజమే
కమలా
.. కానీ ఆ విషయాన్ని ముందు కనిపెట్టింది మీ నాన్నే.. నిన్ను నాకు అంటగట్టాడుగా (నవ్వుతూ)..

****

చనిపోయి నరకంలో కలుసుకున్నారు సుబ్బారావు, వెంకట్రావు.. ఎలా చనిపోయారో మాట్లాడుకుంటున్నారు..
సుబ్బారావు : చలికి తట్టుకోలేక చనిపోయాను.. నువ్వెలా చనిపోయావు ?
వెంకట్రావు: క్యాంపు పని మీద వెళ్తున్నాను వారం రోజులదాకా రానని భార్యకు చెప్పి వెళ్లిపోయా. కానీ అదేరోజు రాత్రి ఇంటికి వచ్చి చూశాను.. బెడ్రూములో నా భార్య ఒక్కతే నిద్రపోతూ ఉంది..
సుబ్బారావు: ఆ తర్వాతేం జరిగింది..
వెంకట్రావు : అమాయకురాలైన భార్యను అనుమానించినందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయా.. బాధగా చెప్పాడు
సుబ్బారావు: ఎంత పని చేశావు రామారావు.. ఒక్కసారి బెడ్రూమ్‌లోని ఫ్రిజ్ తెరిచి చూసింటే మనిద్దరం బతికి ఉండేవాళ్లం కదయ్యా..  

***

అప్పు కోసం తిరుగుతున్నాడని తెలిసి రంగనాథానికి రూ. 10 వేలు ఇచ్చాడు రామారావు
రంగనాథం  : నువ్వు ఎంత మంచివాడివి. నేను అడగకుండానే నా కష్టాలు తెలుసుకుని అప్పు ఇచ్చావు..
రామారావు : అదేం కాదురా.. నాతో డబ్బు ఉంటే నా భార్య షాపింగ్‌కు తగలేస్తుంది. మాల్స్‌లో కొనడం కంటే ట్రయల్స్‌కే రోజులు రోజులు చేస్తుంది.. నీ దగ్గరుంటే తర్వాత తీసుకోవచ్చు.. అసలు విషయం కక్కేశాడు.

***

రాధమ్మ వాళ్లింటికి బంధువులొచ్చారు.. అయితే ఆమె భర్త గోపన్న ఒక్కడే వంటలు చేస్తున్నాడు..
రాధమ్మ: వదినా.. కాస్త అన్నయ్య గారిని పంపిస్తారా.. చుట్టాలకు మా ఆయన ఒక్కరే వంటలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు..
సూర్యకాంతం : తప్పకుండా పంపిస్తా వదినా.. నా మాటను మా ఆయన జవదాటరని నీకు ప్రత్యేకంగా చెప్పాలా..!  

***

జీవశాస్త్రం లెక్చరర్ బాయ్స్ కాలేజీలో క్లాస్ చెబుతూ ఇంటర్ విద్యార్థులను ఓ ప్రశ్న అడిగారు..
లెక్చరర్ : మీ గుండె ఎక్కడ ఉంటుందో చెప్పగలరా..
విద్యార్థులు : ‘పక్కన ఉన్న ఉమెన్స్ కాలేజీలో’ అని విద్యార్థులంతా గట్టిగా అరిచారు..
లెక్చరర్ : నాది మాత్రం ఇంట్లో ఉంటుందా ఏంటి.. ఉమెన్స్ కాలేజీలోనే ఉందని చెప్పేసరికి నవ్వులే నవ్వులు..           
      

మరిన్ని వ్యాసాలు

పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్