పంచరత్నాలు - ..

 

జోకులు : వేణు, బొమ్మలు: కందికట్ల

 

వెంగళప్ప: సార్ నా బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి
బ్యాంక్ ఉద్యోగి: అకౌంట్ క్లోజ్ చేయాలా.. నీ సమస్య ఏంటో నాతో చెప్పు..
వెంగళప్ప: రాత్రి నన్ను ఎవరో హత్య చేసినట్లు కల వచ్చిందండి.
బ్యాంక్ ఉద్యోగి: కల వస్తే ఎవరైనా అకౌంట్ క్లోజ్ చేసుకుంటారా..
వెంగళప్ప: ‘మీ కలలను నిజం చేస్తాం’ అనే మీ బ్యాంక్ స్లోగన్ గుర్తొచ్చిందంటూ వణుకు.

***

ప్యాసింజర్ 1: మీరు నా జేబులో చెయ్యి ఎందుకు పెట్టారో చెప్పండి
ప్యాసింజర్ 2: అబ్బే ఏం లేదు సార్.. జస్ట్ అగ్గిపెట్టే తీసుకుందామని ట్రై చేశా
ప్యాసింజర్ 1: నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదా.. జేబులో చేతులు పెట్టడం ఏంటి..?
ప్యాసింజర్ 2: నేను అపరిచితులతో అంతగా మాట్లాడను.. అందుకే మరి..

***

రంగనాథ్: నాకు ముగ్గురు కొడుకులున్నారు. ఇద్దరు కొడుకులు ఇంజినీరింగ్ చదివారు. చిన్నవాడికి చదువు అబ్బలేదు. చివరకు కూలీ పనులు చేస్తున్నాడు.
రామారావు: అలాంటి వాడిని నువ్వు ఏందుకు భరిస్తున్నారు. తన్ని ఇంటినుంచి వెళ్లగొట్టు. వాడే ప్రయోజకుడు అవుతాడు
రంగనాథ్: భలే వాడివి రామారావు. చిన్నోడిని పంపడం ఎలా కుదురుతుంది. మా కుటుంబాన్ని పోషిస్తున్నది వాడే కదా..!!

***

పుల్లయ్య: జడ్జిగారూ.. నాకు మా ఆవిడ నుంచి ఎలాగైనా విడాకులు ఇప్పించండి
జడ్జి: ముందుగా నీ కారణం చెప్పు..
పుల్లయ్య: ఓ రెండేళ్ల నుంచి మా ఆవిడ నాతో మాట్లాడటం లేదు. నన్ను లెక్క చేయడం లేదు సార్
జడ్జి: అంత ప్రశాంతమైన కాపురం మరెవరికి దొరకదు పుల్లయ్య. మరోసారి ఆలోచించుకో..

***
టీచర్: 4-4 ఎంత అవుతుంది రాజు?
రాజు: లెక్కల టీచర్‌ అయిన మీకే తెలియకపోతే నాకేం తెలుస్తుంది సార్..
టీచర్: అది కాదు రాజు.. నీ దగ్గర నాలుగు ఇడ్లీలు ఉన్నాయనుకో. నేను ఆ ప్లేట్ ఇడ్లీలను తీసుకుంటే, నీ వద్ద అప్పుడు ఏం ఉంటుంది?
రాజు: ఇంకేముంటుంది సార్.. సాంబర్, చట్నీ తప్ప..!

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు