ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

జయంతులు

జూన్ 1

శ్రీ శీరిపి ఆంజనేయులు :  వీరు  జూన్ 1, 1891 న ధర్మవరంలో జన్మించారు. కృతికర్తగా, కృతిభర్తగా, పత్రికా సంపాదకుడిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా, , సంఘసంస్కర్తగా, పరిశోధకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు.  విజ్ఞానవల్లి, ప్రకృతిమాత, విద్యార్థి మొదలైన పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించి సమర్థవంతంగా వాటిని నడిపారు. వీరు సాహిత్యపోషణే కాకుండా ఎన్నో భూరిదానాలు కూడా చేసారు. సుమారు 40 పుస్తకాలు రచించారు.

జూన్ 2

శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య :  వీరు జూన్ 2, 1889 న, పెనుగంచిప్రోలు లో జన్మించారు.  ఆయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు. ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు. ఆయన నాయకత్వంలో నడచిన చీరాల పేరాల సమరం సుప్రసిద్ధం. తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశారు.

జూన్ 4

శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య  :  వీరు జూన్ 4, 1897 న , శింగపేట లో జన్మించారు. గిరిజనుల జీవిత సమస్యలపై అనేక గ్రంథాలు వ్రాశారు. వారి హక్కుల కోసం పోరాడారు గిరిజనుల జీవిత సమస్యలపై అనేక గ్రంథాలు వ్రాశారు. వారి హక్కుల కోసం పోరాడారు.

జూన్ 5

శ్రీ రావి నారాయణ రెడ్డి :  వీరు జూన్ 5, 1908 న బొల్లేపల్లి లో జన్మించారు. నిజాం పాలనలో, తెలంగాణా పోరాటం లో ముఖ్యుడిగా  పేరు తెచ్చుకున్నారు. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు.

జూన్ 6

శ్రీ విక్రాల శేషాచార్య  : వీరు జూన్ 6, 1915 న కలిశవాయి లో జన్మించారు. ఎనిమిదేళ్ళ వయసులోనే తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి శతకత్రయాన్ని రచించారు. ఇతడు చదువుకునే సమయంలోనే అమరకోశంలో వదిలి వేసిన పదాలను శ్లోకాలను రచించి దానికి శేషనిఘంటువు అనే పేరుపెట్టి తండ్రి, మాతామహుల అభినందనపాత్రుడైనారు.

వర్ధంతులు

 మే 31

శ్రీమతి దువ్వూరి సుబ్బమ్మ : స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు వెళ్ళిన మెట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ.. వీరు ఖద్దరు కట్టడమే కాకుండా, ఖద్దరు చరఖా మీద నేసి ఊరూరా తిరిగి అమ్మేవారు.. విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పారు., వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసారు.
వీరు మే 31, 1964 న స్వర్గస్థులయారు.

  1. శ్రీ సముద్రాల రామానుజాచార్య :  సముద్రాల జూనియర్ గా ప్రసిధ్ధిచెందిన సినిమా రచయిత. ఎన్నో సినిమాలకి మాటలు, పాటలూ రాసారు. 70 ప్రముఖ సినిమాలకు సంభాషణలు రాసారు.

    వీరు మే 31,  1985 న స్వర్గస్థులయారు.

జూన్ 3

  1.  శ్రీమతి సంగం లక్ష్మీబాయ్ :  స్వాతంత్రసమర యోధురాలు. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభకి ఎన్నికైన తొలి మహిళ.  స్త్రీలు, బాలికల సంక్షేమం కొరకు నిర్విరామంగా కృషిచేసారు. .. వారికోసమే  ఇందిరా  సేవాసదన్  స్థాపించారు.

     వీరు జూన్ 3 ,  1979 న స్వర్గస్థులయారు.

 

  1.  శ్రీ గరిమెళ్ళ రామమూర్తి  :  ప్రముఖ నటులు. నాటక సంస్థ నిర్వాహకులు.. పదవ ఏటనుండే నాటకరంగంలో ప్రవేశించి, ఎన్నో నాటకాల్లో నటించి, ఎంతో పేరు తెచ్చుకున్నారు.  వీరికి  ఉత్తమనటుడిగా ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయి.

    వీరు మే 3, 2004 న స్వర్గస్థులయారు.

జూన్ 4

  1. శ్రీ  భాగవతుల సదాశివశంకర శాస్త్రి :  “ ఆరుద్ర “ గా ప్రసిధ్ధిచెందారు. వీరు ఒక అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.. తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రాపంచిక దృష్టితోపాటు భౌతిక దృక్పథాన్ని పరిచయం చేసిన సాహితీ ఉద్యమం అభ్యుదయ సాహిత్యం . అభ్యుదయ సాహిత్యంలో పరిచయం అవసరం లేని సాహితీ మూర్తుల్లో ఆరుద్ర ఒకరు.. వివిధ రంగాల్లోనే కాక వివిధ ప్రక్రియల్లో ఆరితేరిన అరుదైన వ్యక్తి ఆరుద్ర.   “ త్వమేవాహం “, “ కూనలమ్మ పదాలు “, “ సినీ వాలి “, “ సమగ్ర ఆంధ్ర సాహిత్యం “ వీరి ప్రముఖ రచనలు. ఎన్నో సినిమాలకి పాటలు రాసారు.

   వీరు జూన్ 4 , 1998 న స్వర్గస్థులయారు.

  1. శ్రీ బూదరాజు రాధాకృష్ణ  :   ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సీనియర్‌ పాత్రికేయులు. పాత్రికేయులకు భాషాభిమానులకు విశేషంగా ఉపయోగపడే అనేక పుస్తకాలను రచించారు. తెలుగుసంస్కృత భాషల్లో మంచి పట్టున్న  వీరు, వాస్తు పదకోశం, వ్యవహారకోశం మొదలైన భాషా సంబంధ పుస్తకాలను రచించారు. ఆధునిక పత్రికల తెలుగు భాషను ప్రామాణీకరించిన ఘనత ఆయనకు చెందుతుంది.

     వీరు జూన్ 4, 2006 న స్వర్గస్థులయారు.

.

 

 

 

 

 

 

 

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు