ప్రతాపభావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

pratapabhavalu

బాధ్యత..సేవ

నేను మొన్న కమర్షియల్ టాక్స్ చలాన్ కట్టడానికి గుంటూరు ఆఫీసుకు వెళ్ళాను. మొత్తంరాఫీసులో నలుగురైదుగురు స్టాఫ్ ఉన్నారు. నేనక్కడ కూర్చుని ఉన్న ఒకతనికి విషయం చెప్పాను. అతను ‘అందరూ ఓట్ల కౌంటింగ్ డ్యూటీ మీద వెళ్లారు. మీ పని అవదు. సోమవారం రండి’ అన్నాడు.

నేను ఈ పని మీదే హైదరాబాదు నుంచి వచ్చానని, చలానా చాలా ముఖ్యమని చెప్పాను. అయినాఅతని నుంచి స్పందన ఏం లేదు. నన్ను తీవ్ర నిరాశ ఆవరించింది.

అంతలో అతని పక్కనే ఉన్న మరొకాయన ‘పాపం ఆయన హైదరాబాదు నుంచి వచ్చార్ట..రండి సార్’ అంటూ కొద్ది దూరంలో ఉన్న బెంచి మీద కూర్చోబెట్టి, మంచినీళ్ళిచ్చి ‘నేను సంబంధిత ఆఫీసరు కు ఫోన్ చేస్తానండి.’అని ‘సార్ ఫోన్ లోపలికి అలో చేయడం లేదని, బయట కారులో డ్రైవర్ కు ఇచ్చి వెళ్ళాడట’నొచ్చుకుంటూ అని..’నెంబరు మీరూ తీసుకోండి. ఫోన్ చేయండి. నేనూ ట్రై చేస్తూ ఉంటాను’ అన్నాడు.
ప్రభుత్వ సంస్థల్లో ఉదాశీనత ఉండే విషయం సర్వ సాధారణం..అయితే ఏ కొద్దిమందో విజిటర్స్ వైపుగా ఆలోచించి తగిన సహాయం చేస్తారు.
కొన్ని సంస్థల్లోకి వెళితే, ఎవర్ని కలవాలో, ఏ ఫామ్స్ నింపాలో తెలీదు. కొంతమంది ఉద్యోగులను అప్రోచ్ అయితే పురుగును చూసినట్టు చూస్తూ, పెడసరంగా సమాధానం ఇస్తారు. అదీ సవ్యంగా ఉండదు. మళ్ళీ అడిగితే దుర్వాస మహామునులే.

ప్రభుత్వ ఉద్యోగాల్లో బాధ్యతను సేవ అనుకోవాలని అక్కడ వేళ్ళాడదీసిన బోర్డ్ లపై ఉంటుంది.ఆ దృక్పథం భూతద్దంతో వెతికినా కనిపించదు.
లంచాలు తీసుకోకుండా చూడ్డమే కాదు. వారిలో సేవాభావాన్ని పెంపొందింపజేయాలి. బయట ఉద్యోగాల్లేక, ప్రైవేటు ఉద్యోగాల్లో కుడితిలో పడ్డ ఈగలా కొట్టుకుంటున్నవారు ఎంతోమంది ఉన్నారు. వారితో పోలిస్తే ఓ టేబుల్, కుర్చీ, ఫ్యాన్ నియమిత పని వేళల్లో, సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా పనిచేసే అవకాశం దొరకడం ఎంత అదృష్టం!సాటి మనుషుల పట్ల ఆదరణ, సేవాభావం కలిగి ఉంటే పూవుకు తావి అబ్బినట్టే. ఏవంటారూ..!

***

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు