స్మార్ట్‌ కిడ్స్‌: కండిషన్స్‌ అప్లై.! - ..

smart kids conditions apply

చిన్న పిల్లలే కదా వారికేం తెలుసులే అనుకుంటే పొరపాటే. వాళ్లు చిచ్చర పిడుగులు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు. ప్రపంచాన్ని దున్నేస్తారు. ఏడాది వయసు నుండే ఈ స్మార్ట్‌ వాడకం మొదలెడుతున్నారు. అంతెందుకు.. పుడుతూనే స్మార్ట్‌ జనరేషన్‌లోకి అడుగుపెడుతున్నారు కొత్త జనరేషన్‌ పిల్లలు. రోజుకు 24 గంటలు సమయం ఉంటే, అందులో మ్యాగ్జిమమ్‌ సమయాన్ని స్మార్ట్‌ గ్యాడ్జిట్స్‌ వినియోగానికే ఎక్కువగా కేటాయిస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం స్మార్ట్‌ గ్యాడ్జిట్స్‌తో సంబంధం ఉన్న పిల్లల మెదడుకీ, సంబంధం లేని పిల్లల మెదడుకీ మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపించిందట. స్మార్ట్‌ గ్యాడ్జిట్స్‌ వాడుతున్న పిల్లలు నిర్ణయాల్ని వేగంగా తీసుకుంటుంటే, స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ వాడని పిల్లలు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారట. తద్వారా ఆలోచనా విధానం స్మార్ట్‌ వినియోగం పిల్లల కన్నా, వినియోగించని పిల్లల్లోనే మెరుగ్గా ఉంటోందనీ ఈ అధ్యయనం ద్వారా తేలింది.

స్మార్ట్‌ ఫోనులు, ఆన్‌ లైన్‌ గేమ్స్‌లాంటి వాటికి అడిక్ట్‌ అయిన పిల్లల్లో కంటి చూపు సమస్యలు, ఇతరత్రా మానసిక సమస్యలు తలెత్తుతున్నాయన్న విషయం తెలిసిందే. అయితే, వీటిని ఎంత మాత్రమూ లెక్క చేయకుండా స్మార్ట్‌ కిడ్స్‌ తమ పని తాము చేసుకుని పోతున్నారు. ఇదిలా ఉంటే, పద్ధతిగా స్మార్ట్‌ టెక్నాలజీని వాడుతున్న పిల్లలు కూడా వెయ్యిలో ఒకరు చొప్పున ఉండనే ఉన్నారు. వీరు మానసికంగా చాలా ఆహ్లాదంగా ఉంటున్నారు. యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. మరోవైపు స్మార్ట్‌ టెక్నాలజీకి అలవాటు పడిన పిల్లలు అంతా తమకే తెలుసు.. అనే ధోరణిలో ఇక గురువులతో కూడా సంబంధం లేదనే స్థాయికి దిగజారిపోతున్నారని కొన్ని ఎగ్జాంపుల్స్‌ ద్వారా తెలుస్తోంది.

ఇస్మార్ట్‌గా ఆలోచించి, ప్రపంచం గురించి తెలుసుకుంటున్నారు.. సరే, రెండు, మూడు తరగతులకొచ్చేసరికే అపారమైన జ్ఞాన సంపదను పెంపొందించుకుంటున్నారు. అదీ బాగుంది. ఏడెనిమిది తరగతుల్లోకి వచ్చేసరికి ఇంజనీరింగ్‌ నైపుణ్యాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇది ఇంకా ఇంకా బాగుంది. అయితే, ఎంత ఇస్మార్ట్‌ జ్ఞానాన్ని సంపాదించినా, నాణానికి రెండు వైపులున్నట్లు మంచీ, చెడూ పక్క పక్కనే ఉంటాయన్న సంగతిని చాలా మంది పిల్లలు అస్సలు పరిగణనలోనికే తీసుకోవడం లేదు. తల్లి తండ్రులు కూడా ఈ విషయంలో పెద్దగా ఫోకస్‌ పెట్టడం లేదు. తద్వారా స్మార్ట్‌ ప్రపంచంలోకి చొచ్చుకొని పోయి, అంతా తమకే తెలుసనే భ్రమలో పడి, తాము ప్రమాదాల బారిన పడుతూ, ఇతరుల్నీ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇలాంటి కిడ్స్‌కి కాస్త తల్లితండ్రులు, గురువుల పర్యవేక్షణ ఉంటే, ఈ స్మార్ట్‌ కిడ్స్‌ భవిష్యత్తులో 'స్మార్ట్‌ యంగ్‌స్టర్స్‌' అవుతారనడం నిస్సందేహం.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు