క్రికెట్టూ.. యువతను కట్టి పడేసేట్టూ.! - ..

Cricket .. young people

ఇండియన్‌ ప్రీమియర్‌ లీడ్‌ హ్యాంగోవర్‌ ఇంకా తగ్గకుండానే వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీలు దూసుకొచ్చేశాయి. దిగ్గజ ఆటగాళ్లు క్రికెట్‌లో మేటి జట్లు తలపడుతోన్న ఈ టోర్నమెంట్‌లో గెలుపు గుర్రం ఎవరనేది ఇప్పుడే అంచనా వేయలేం. పోటీలు మాత్రం నరాలు తెగే ఉత్కంఠని సృష్టించబోతున్నాయి. ఈ క్రికెట్‌కి రాజపోషకులు ఎవరంటే, యువతరమే. ఎక్కువగా ఎగ్జామ్స్‌ సీజన్‌లో వచ్చే వరల్డ్‌ కప్‌ ఈ సారి కాస్త డిఫరెంట్‌గా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు మొదలైంది. సో యువతరం పూర్తిగా చదువులు నాశనం చేసుకోవల్సిన పని లేదు. క్రికెట్‌ కోసం జీవితాన్ని పణంగా పెట్టే వీరాభిమానులున్న దేశం మనది. సో మరీ అంత అతి ఈ సారి ఉండదనీ ఆశిద్దాం. 
ఒకప్పుడు క్రికెట్‌ అంటే, ఆట. ఇప్పుడు క్రికెట్‌ అంటే జూదం. మనోడు గెలిస్తే బావుండు.. అనే రోజులు దాటేసి, ఎవరు గెలిచినా మనకు డబ్బులొస్తే చాలు.. అనే స్థాయికి క్రికెట్‌ని బెట్టింగ్‌కి సులభమైన మార్గంగా ఎంచుకుంటోంది

నేటి యువత. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ జరుగుతున్నన్ని రోజులూ, దేశవ్యాప్తంగా వందల కోట్ల, వేల కోట్ల బెట్టింగ్‌ నడిచింది. అంతకు మించిన బెట్టింగ్‌ ఇప్పుడు జరగబోతోందనీ అంచనా వేస్తున్నారు బెట్టింగ్‌ కింగ్‌లు. ఊరూ వాడా అనే తేడాల్లేవ్‌. ఎక్కడ చూసినా ఈ బెట్టింగ్‌ని గురించిన చర్చే జరుగుతోంది. దారుణమైన విషయమేంటంటే, బెట్టింగ్‌లో బాగుపడ్డవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. పోగొట్టుకున్నవాళ్లే ఎక్కువ మంది కనిపిస్తారు.

ఏడో తరగతి పిల్లాడి నుండి, డెభ్బై ఏళ్ల ముదుసలి వరకూ ఈ బెట్టింగ్‌ బానిసలున్నారు. ప్రధానంగా 15 నుండి 35 ఏళ్లలోపు వయసు వారు బెట్టింగ్‌లో తీవ్రమైన బాధితులుగా ఉంటున్నారనీ ఓ సర్వే చెబుతోంది. ఈ సారి బెట్టింగ్‌ చిన్న దేశాల మీద కూడా గట్టిగానే ఉండబోతోందట. క్రికెట్‌ అంటే మన దేశంలో ఉన్నంత పిచ్చి ఇంకెక్కడా కనిపించదు. క్రికెట్‌ మీద బెట్టింగ్‌ కూడా అంతే. దానర్ధం పైత్యం మనోళ్లకు చాలా ఎక్కువ అని. ఆల్రెడీ బెట్టింగులు మొదలైపోయాయ్‌. కొంచెం సామాజికి స్పృహతో తమ సన్నిహితులపై దృష్టి పెడితే, కొంతవరకూ ఈ బెట్టింగ్‌ మహమ్మారి నుండి వారిని కాపాడుకోగలం. ముఖ్యంగా విద్యార్ధులపై తల్లితండ్రులూ, విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ క్రికెట్‌ సీజన్‌ నడిచినన్నాళ్లూ ఓ కన్నేసి ఉంచాల్సిందే. తప్పదు.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు