రంగారావు కంగారుగా పోలీస్ స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
"సార్ నన్ను జైల్లో వేసి తాళం పెట్టేయండి! మా ఆవిడ మీదకి రోకలి బండ విసిరాను" అన్నాడు ఇన్ స్పెక్టర్ తో.
'ఆవిడ చచ్చిపోయిందా? ఆదుర్దాగ అడిగాడు ఇన్ స్పెక్టర్.
"అబ్బే ..గురి తప్పింది సార్.... అదే రోకలి పుచ్చుకొని మా ఆవిడ నా వెంటబడి పరిగెత్తుకొస్తోంది."
*************************
అనిత కిరాణా దుకాణం కు వెళ్ళింది. షాపు వాడిని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, గసగసాలు ఒక్కొక్కటీ కేజీ చొప్పున అన్నీ కలిపి ప్యాక్ చేసి ఇవ్వమని అడిగింది.
షాపువాడు ఆశ్చర్య పోయి ' ఏవమ్మా ఏదైనా కొత్త వంటకం చేస్తున్నారా?' అని అడిగాడు.
"లేదండీ రేపు మా అత్తగారు వస్తున్నారు. రాగానే వీటన్నింటినీ వేరు చేయమని ఆమెకు ఇస్తే తిరిగి వెళ్ళేంత వరకు నన్ను పట్టించుకునే సమయం ఆవిడకు ఉండదని.
*************************
అబ్బా.. మా ఆవిడ వాషింగ్ మెషిన్ కొనమని ఒకటే సతాయిస్తున్నది రా..
"మా ఇంట్లో అటువంటి డిమాండ్ వినపడదు"
"అదృష్టవంతుడివిరా"
"అహా అది కాదు... మా ఇంట్లో బట్టలు ఉతికేది నేనే అన్నాడు స్నేహితుడు.
*************************
"నీకు ఏ పని చెప్పినా వాయిదా వేస్తుంటావు. లేదా మరచి పోతుంటావు. ఇంతకు ముందు ఎక్కడ చేశావురా" అంటూ విసుక్కున్నాడు యజమాని.
" జడ్జిగారింట్లో పనిచేశానండి" చెప్పాడు పనివాడు.
*************************
"ఒసేవ్.. ఇటు చూడు వీడు కొత్త ఇంటి గోడల నిండా పెన్సిల్ తో బొమ్మలు గీస్తున్నాడు" అంటూ అరిచాడు తండ్రి.
"అమ్మనెందుకు పిలవటం.. అమ్మే ఇది మన డ్రాయింగ్ రూం అని చెప్పింది" అంటూ సమాధానం చెప్పాడు చింటూ.