28-06-2019 నుండి4-07-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

  ఈవారం మొత్తం మీద మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట మంచిది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. చాలావిషయాలో సర్దుబాటు విధానం ఉత్తమం. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతాన పరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. అర్థికపరమైన విషయాల్లో కుటుంబ పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. 

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

 ఈవారం మొత్తం మీద అనుకోని ఖర్చులను పొందుతారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. తలపెట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆర్థికపరమైన అవసరాలకు చేసిన ప్ర్తయత్నాలు ముందుకు సాగుతాయి. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకు సాగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. స్త్రీ పరమైన విషయాల్లో మీ ఆలోచనలు మిమ్మల్ని వివాదాలబ్ నుండి బైటకు తీసుకువచ్చెడిదిగా ఉంటుంది. అనుకోకుండా చేసే ప్రయాణాలు ఫలితాలు అనుకూలంగా ఇస్తాయి. అధికారులతో సర్దుబాటు మంచిది. ఉత్తమం కూడా.  

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం మొత్తం మీద నూతన విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. శ్రమ తప్పక పోవచ్చును, స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళుట మేలు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును. పెద్దలతో నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొనే ప్రయత్నం మంచిది. చర్చల్లో కాస్త నిదానం అవసరం. బంధువుల నుండి వచ్చే సూచనలను అశ్రద్ధ చేయకండి. వాహనాల విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. విలువైన వస్తువుల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.  

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

 ఈవారం మొత్తం మీద పెద్దలతో సమయం గడుపుతారు. మీ బంధువులతో సమయం గడుపుతారు. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో మీరు చేసిన ఆలోచనలకు లేదా పనులకు నలుగురిలో గుర్తింపును పొందుతారు. చేసే ప్రయాణాలు లబ్దిని కలుగజేస్తాయి. కాకపోతే మీ మాటతీరు సరిచేసుకోవడం వలన మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యక్రమాలకు అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కాస్త వాయిదా పడే అవకాశం ఉంది, కాకపోతే తప్పక విదేశీ ప్రయాణం చేస్తారు. నూతన పరిచయాలకు అవకాశం కలదు.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు. కుటుంబంలో పెద్దలతో కలిసి ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి , వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం మొత్తం మీద విదేశీప్రయాణ  చేయువారికి అనుకూలమైన సమయం. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తగిన విశ్రాంతి తీసుకోవడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. జీవితభాగస్వామి నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. సంతానం విషయాల్లో నూతన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

 ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన పరిచయాలకు అవకాశం ఉంది , పెద్దలనుండి నూతన అవకాశాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉన్న సంతృప్తి ఉండకపోవచ్చును. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దగా ఆశించిన మేర ఫలితాలు రాకపోవచ్చును, వేచిచూసే ధొరణి మంచిది. గతంలో మీకున్న పరిచయాలు ఉపయోగపడుతాయి. బంధువులతో మనస్పర్థలు వచ్చే ఆస్కారం కలదు. మీ ఆలోచన లేక మాటతీరు కొంతమందికి నచ్చకపోవచ్చును. చర్చకు అవకాశం కలదు. 

.

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర చర్చలకు అవకాశం ఇవ్వకండి. సంతానం విషయంలో కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం మొత్తం మీద దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. చర్చలకు అవకాశం ఇవ్వకండి. కుటుంబపరమైన విషయాల్లో సర్దుబాటు అవసరం. జీవితభాగస్వామి ఆశలకు ప్రాధాన్యం ఇవ్వడం వలన విభేదాలు తగ్గుతాయి. ఖర్చులు చేయిదాటి పోయే ప్రమాదం ఉంది , జాగ్రత్త. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. ఆత్మీయులతో గతంలో మీకు ఉన్న బంధాలు నష్టపోవడం వలన జరిగిన నష్టాన్ని గుర్తించే అవకాశం ఉంది. మీ ఆలోచన్లలో మార్పు తప్పక మేలుచేస్తుంది. 
 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం మొత్తం మీద తండ్రి తరుపు బంధువులను కలుస్తారు. పెద్దలు మీ ఆలోచనలను అనుమతించే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, సాధ్యమైనంత మేర అనవ్సరమయిన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం మంచిది. మానసికపరమైన ఇబ్బందులు మాత్రం తప్పక పోవచ్చును. నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో పనిఒత్తిడి మాత్రం ఉంటుంది , ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఇబ్బఅంది లేదు. 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

 ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని వెళ్లడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాహశం ఉంది. మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు. కుటుంబంలో సభ్యులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చర్చాపరమైన విషయాల్లో సమయాన్ని గడుపుతారు. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం మొత్తం మీద ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేస్తారు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. జీవితభాగస్వామితో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది , జాగ్రత్త. 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని వ్యాసాలు