జలసంరక్షణ - కందర్ప మూర్తి

jalasamrakshana

భూమండలం మీద ప్రాణుల మనుగడకు పంచభూతాల్లో గాలి తర్వాత జలానికి ప్రాశస్త్యం ఉంది.మనిషి ఆరోగ్యంగా ఉండి జీవనక్రియ జరగాలంటే శరీరంలో  రక్త ప్రసరణ సక్రమంగా జరిగి  లోపలి మలినాలు బయటకు విసర్జింప బడాలంటే వంట్లో నీటి శాతం తగినంత ఉండాల్సిందే. అందుకు రక్షిత మంచి నీరు శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో మానవ అవసరాలకు, వ్యవసాయం , వాణిజ్య  పరిశ్రమలకు నీరు ప్రకృతి పరంగా లబ్యం కావడం లేదు. మానవుడు స్వార్దంతో ప్రకృతి వనరుల్ని కాజేస్తూ పర్యావరణానికి
హాని కలిగిస్తు తన మరణ శాసనాన్ని తానే రాసుకుంటున్నాడు. గ్లోబలైజేషన్ కారణంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చి
 ప్రకృతి సమతుల్యం దెబ్బ తిని ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతం తగ్గి జలవనరులు అడుగంటి మానవాళితో పాటు జంతు పక్షి జలచరాలు
మృత్యువాత పడుతున్నాయి. నవనాగరి ప్రపంచంలో అభివృద్ధి పేరుతో పల్లెలు గ్రామాలు నగరాల్లో ఏళ్లనాటి  భారీ వృక్షాలు పచ్చని పంటపొలాలు  ఫలవృక్ష తోటలు , విలువైన కలప కోసం అడవుల్ని నాశనం చేసి, ఖనిజ సంపద కోసం కొండల్ని  భారీ యంత్రాలతో తవ్వి గుల్ల చేస్తూ, జల విద్యుత్ ప్రోజెక్టుల కోసం నదులపై ఆనకట్టలు నిర్మించి నీటి ప్రవాహాన్ని కట్టడి చేసి నందున వరదలు , బొగ్గు వంటి ఖనిజాల కోసం అటవీ భూముల్ని డొల్ల చేసి భూకంపాలకు కారణమవు తున్నారు.

అడవుల్లోని భారీ వృక్షసంపద నశించి  పర్వతాలు కృసించి  వర్షించే నీటి మేఘాలు స్థిరంగా నిలవక గాలి వత్తిడికి చెల్లాచెదురై  వర్షపాతం
సక్రమంగా నమోదు కావడం లేదు. ఫలితంగా నీటి కొరత . జనాబా పెరుగుదల , వాణిజ్య పరిశ్రమల నీటి అవసరాల పెంపు కారణంగా
నీటి కోసం కఠిన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. ప్రకృతి పరంగా  కావల్సినంత నీరు లభించక పట్టణాల్లో  నగరాల్లో పంట భూముల్లో భారీ యంత్రాలతో భూగర్భ జలాలు తోడి భవన నిర్మాణాలకు  వాణిజ్య అవసరాలకు  తాగునీటి వ్యాపారానికి వినయోగిస్తున్నారు. ఆకాశ హర్మ్యాల నిర్మాణం , నేల కనబడకుండా రవాణా రోడ్డు మార్గాలన్నీ సిమ్మెంటు కాంక్రీటుమయం చేసి  వాడుక నీరు కాని, వర్షాకాల వరద నీరు కాని భూమిలోకి  పోక  భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. నీటి వనరులైన చెరువులు కుంటలు  నదీ పరీవాహక ప్రాంతాలు కబ్జాలకు గురై  పక్షి  జలచరాలు మృత్యువుకి కారణ మవుతున్నారు.  మానవ తప్పిదం కారణంగా పర్యావరణ సమతుల్యం దారి తప్పి గ్రామాల్లో బావులు  చెరువులు  చెక్ డ్యాములు ఎండి నీటి కొరత ఏర్పడి ప్రజలు తాగునీటి కోసం నడిచి వెళ్లి కొండ కోనల్నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. పశు పక్ష్యాదులకు నీరు కరువై  మృత్యువాత పడుతున్నాయి.

వర్షాబావ కారణంగా బోర్లలో, దిగుడు బావుల్లో నీరు లబ్యం అవక సాగునీరు లేక గ్రామీణ  ప్రాంత ప్రజలు వ్యవసాయ పనులు వదిలి
జీవనోపాధి కోసం పొట్ట చేత పట్టుకుని కుటుంబాలతో పట్టణాలకు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. పూర్వపు రోజుల్లో మన పెద్దలు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రకృతి సంపదను పరిరక్షించేవారు. అందువల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలించి పుష్కళంగా  వర్షాలు కురిసి జలవనరులు కళకళలాడేవి.   పల్లెలు గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా మనుషులతో పాటు పెంపుడు జంతువులు , పక్షులు కుటుంబ సబ్యుల్లా ఇళ్ల పరిసరాల్లో సందడి చేస్తూ జీవించేవి. కుక్కలు , పిల్లులు , కోతులు అలాగే కాకులు, పిచ్చుకలు , మైన గోరలు , రామచిలుకలు, కోయిలలు , నెమళ్లు, ఉడుతలు ,తొండలు, వంటి చిన్న జంతువులు పెరటి చెట్ల మీద, గుమ్మాల్లో సంచరిస్తూ ఆహ్లాదాన్ని కలుగచేసి మనుషుల మానసిక శక్తిని పెంచేవి. వాటికి కావల్సిన నివాసాలు , తిండి , నీరు కావల్నినంత లభించి నిర్భయంగా జీవించేవి.   నేడు వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఆధునిక సాంకేతికపరికరాల వినీయోగం పెరిగి రేడియేషన్ , శబ్దకిలుష్యం, నీటి కాలుష్యం,
రసాయనాల ఆహారం, తాగునీటి , నివాసాల కొరత, అభద్రత కారణంగా అన్ని ప్రాంతాల్లో వాటి ఉనికిని కోల్పోయి ఆ జాతులు నశిస్తున్నాయి.
కొంగలు, గెద్దలు , రాబందులు వంటి పక్షి జంతుజాలం భావి తరాలకు బొమ్మలు , చిత్రపటాలు ,అంతర్జాలంలో చూడాల్సి రావచ్చు.

కాబట్టి మనిషి మేలుకునే స్థితి వచ్చింది. ఇప్పటి నుంచే నీటి పొదుపు ఉద్యమం చేపట్టాలి. ప్రభుత్వాలు , స్వచ్ఛంద సంస్థల సబ్యులు, యువత జల సంరక్షణ ఆవస్యకత గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చెయ్యాల్సిన అవుసరం ఉంది. గృహావసరాలకు , శీతల పానీయాలు, ఆల్కహాల్, రసాయన వంటి వాణిజ్య పరిశ్రమల అవసరాలకు నీటిని పొదుపుగా వినియోగించాలి. మురుగు నీటిని శుద్ది చేసి పునర్వినియోగానికి తేవాలి. భవనాల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేసి వర్షాకాల వరద నీటిని భూమి లోకి చేర్చి భూగర్భ జలాలు వృద్ధి చేయాలి.చెరువులు , కుంతలు లోతు చేసి పటిస్టమైన గట్లు ఏర్పాటు చేసి నీటి నిల్వలు పెంచాలి. భవనాలు, కాళీ ప్రదేసాల్లో , పార్కుల్లో వృక్షాలు నాటి పర్యావరణ పరిరక్షణ కోసం హరిత వనాల్ని పెంచవల్సి ఉంది.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మాదిరి ప్రపంచ వ్యాప్తంగా జలవనరులు నసించి నీటి కొరత ఏర్పడితే భవిష్యత్తు లో మానవాళి మనుగడకే
ముప్పు వాటిల్లే అవకాశముంది. తస్మాత్   జాగ్రత్త !

మరిన్ని వ్యాసాలు

సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు