బిగ్‌బాస్‌' యంగ్‌స్టర్స్‌దే హవా బాస్‌.! - ..

big boss - youngsters hava

బుల్లితెర సంచలనం 'బిగ్‌బాస్‌' సీజన్‌ 3 మరికొద్ది రోజుల్లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ బీభత్సంగా యాక్టివ్‌ అయిపోయారు. ఈ ప్రోగ్రాంలో కంటెస్టెంట్స్‌ వీరట. వారట.. అంటూ గాసిప్స్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు. ఇటీవలే బిగ్‌బాస్‌ హోస్ట్‌గా నాగార్జున పేరు రివీల్‌ చేయడంతో పాటు, ఆకట్టుకునే టీజర్‌ కూడా వదిలారు. ఆ టీజర్‌తోనే బిగ్‌బాస్‌కి సరికొత్త ఉత్సాహం వచ్చేసింది. బిగ్‌బాస్‌ తొలి సీజన్‌కి యంగ్‌స్టర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ కాగా, రెండో సీజన్‌కి నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. తొలి సీజన్‌కి ఎన్టీఆర్‌దే హవా అయితే, రెండో సీజన్‌కి హోస్ట్‌ సంగతి పక్కన పెడితే, కంటెస్టెంట్స్‌లో ఒకరైన కౌషల్‌ ఫ్యాన్స్‌ కౌషల్‌ ఆర్మీ పేరుతో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 
కౌషల్‌ ఆర్మీ పేరుతో సోషల్‌ మీడియాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ హంగామాకి పూర్తి బాధ్యత యువతరానిదే. బిగ్‌ హౌస్‌లో తన ఆటిట్యూడ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు కౌషల్‌. ఆ యూత్‌ లేకుంటే, ఆయన విజయం సాధ్యమయ్యేదే కాదు అనడం అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు మళ్లీ ఆ యువతే ప్రభంజనం సృష్టించేలా ఉంది. అయితే, బిగ్‌బాస్‌ 2కి యూత్‌ నుండి వచ్చిన హైప్‌ అనూహ్యంగా జరిగింది. కానీ, ఇప్పుడు ముందే యువత ప్రిపేర్డ్‌గా ఉన్నారట. కొన్ని గ్రూప్స్‌గా డివైడ్‌ అయిపోయేందుకు సిద్ధంగా ఉన్నారట. దాంతో ఈ సారి బిగ్‌బాస్‌ విజేతకు విజయం దక్కడం అంత ఆషామాషీ కాదండోయ్‌. 
ఈ మార్పును ముందే గమనించిన బిగ్‌బాస్‌ నిర్వహకులు కూడా కంటెస్టెంట్స్‌ని వెతకడంలో కాస్త సంయమనం పాఠించారనీ తెలుస్తోంది. ఎవరికి పడితే వారికి కాకుండా, ఈ సారి బిగ్‌ హౌస్‌లో ఎంటర్‌టైన్‌ చేయబోయే కంటెస్టెంట్స్‌కై సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట. గత సీజన్‌లో సెలబ్రిటీస్‌తో పాటు, ఓ సామాన్యుడికీ ఛాన్స్‌ దక్కింది. అలాంటి కొత్తదనం ఈ సారేం ప్లాన్‌ చేశారో బిగ్‌బాస్‌ నిర్వాహకులు వేచి చూడాలిక. ఏది ఏమైనా ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ కోసం అందరి కన్నా ఎక్కువ ఈగర్‌గా యూత్‌ ఎదురు చూస్తోంది. సోషల్‌మీడియాని ఊపు ఊపేసేది వారే కదా. అంతేకాదు, హద్దుల మీరే అసభ్యతలు, హౌస్‌లో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ యూత్‌ఫుల్‌ సరదాలూ.. డాన్సుల్లాంటివి.. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ లాంటివన్నమాట.. ఇలా పలు రకాల కారణాలతో బిగ్‌బాస్‌ 3 యువతకు మాత్రమే అనేలా మారిపోయింది. 
యువత అంటే ఈ షో ఫ్యాన్స్‌లో యంగ్‌స్టర్స్‌తో పాటు, నలభయ్యేళ్ల లోపు అంకుల్స్‌ కూడా ఉన్నారు. ఆ పై వయసు వారికి బిగ్‌బాస్‌ కనెక్ట్‌ కావడం లేదు. సో ఆల్‌మోస్ట్‌ 'యువతకు మాత్రమే బిగ్‌బాస్‌' అనే ఇమేజ్‌ దక్కించేసుకుంది. ఇక హోస్ట్‌ నాగార్జున విషయానికి వస్తే, ఆయన యూత్‌లో యూత్‌. పెద్దవాళ్లలోనూ యూతే. టోటల్‌గా యూత్‌ ఐకాన్‌. అదీ ఆయన లెక్క. అందుకే ఆయన టాలీవుడ్‌ మన్మధుడు. మరి మన మన్మధుడి హోస్టింగ్‌లో బిగ్‌బాస్‌ ఎంత రొమాంటిక్‌గా, ఎంత ఎంటర్‌టైనింగ్‌ ఉండబోతోందో ఊహించడం కష్టమే. ఏది ఏమైనా బుల్లితెరపై బిగ్‌బాస్‌ స్టార్ట్‌ అయితే వచ్చే ఆ కిక్కే వేరప్పా. 

 
 

మరిన్ని వ్యాసాలు

పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్