మేష రాశి : (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )
ఈవారం ముఖ్యమైన విషయాలలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం సూచన. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అఆస్కారం కలదు. నూతన పరిచయాలు ఏర్పడుతాయి, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుటకు అవకాశం ఉంది. ఋణం ఇచ్చే విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోండి, మంచిది.
వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)
ఈవారం పెద్దలను కలుసుకునే అవకాశం ఉంది, వారినుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు చేయునపుడు మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వారం ఆరంభంలో మాత్రం ఒకింత పనిఒత్తిడి లేక ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆర్థికపరమైన విషయాలలో నూతన అవకాశాలను పొందుటకు ఆస్కారం ఉంది. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. దైవ పరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.
మిథున రాశి : (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)
ఈవారం సోదరులనుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. తండ్రి తరుపు బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట వలన ఇబ్బందులు తగ్గించుకొనే అవకాశం ఉంది. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుతాయి.
కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. పెద్దలతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది, అలాగే విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ఒకింత స్పష్టత అవసరం. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకపోవడం మంచిది. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.
సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )
ఈవారం చేపట్టు పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వాహనాల వలన ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది కావున కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. తల్లితరుపు బంధువులను కలుస్తారు, వారితో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ చేయకండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి.
కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )
ఈవారం కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులను అనుకున్న సమాయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాల వలన నలుగురిలో మంచి పేరు లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం గురుంచి ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది, పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి.
తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )
ఈవారం రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. ఉద్యోగంలో నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ద అవసరం. విదేశీప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యక్రమాల విషయంలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )
ఈవారం పెద్దలను కలుస్తారు, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట వలన మేలుజరుగుతుంది. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. స్వల్పఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం సూచన. తండ్రితరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. మిత్రులను కలుసుకునే ఆస్కారం ఉంది.
ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )
ఈవారం తల్లితరుపు బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకోకుండా వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు.
మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )
ఈవారం ఆరంభంలో ఒకింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది, మానసికంగా దృడంగా ఉండుట సూచన. చిన్న చిన్న విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం. పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. విదేశీ ప్రయాణప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట సూచన. రావల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుటకు ఆస్కారం ఉంది.
కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )
ఈవారం బంధువులను కలుస్తారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. కుటుంబంలో శుభకార్యక్రమాల గురుంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళన తగ్గుముఖం పడుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. రావల్సిన ధనం విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించుట సూచన. వాహనాలను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. చర్చల్లో నిదానం అవసరం.
మీన రాశి : (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )
ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత అవసరం. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. చర్చాపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. రుణపరమైన ఇబ్బందులు కొంత ఇబ్బంది పెట్టుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చర్చల్లో నిదానం అవసరం.
డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం