రెడ్డిగారి రచ్చ: యూత్‌ని సినిమాలే చెడగొడుతున్నాయా. - ..

Reddigari Rachcha

ఒక మాట ఒక వ్యక్తి నోట సినిమాలో వచ్చినా, ఇంటర్వూలో వచ్చినా ఇంకెక్కడొచ్చినా దాని అర్ధం ఒక్కటే.. దానికున్న విలువా ఒక్కటే. సినిమాలో చేస్తే నటన.. ఇంటర్వూకైతే అభిప్రాయం.. అని విభజించడానికి వీల్లేదు. ఇక అసలు విషయానికొస్తే, ఒక్క సినిమాతో సెన్సేషనల్‌ అయిపోయిన యూత్‌ స్టార్‌, రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ, 'అర్జున్‌రెడ్డి' సినిమా టైంలో వాడకూదని మాట ఒకటి వాడాడు. ఆ టైంలో ఆ మాటని యాంకర్‌ కమ్‌ నటి అనసూయ భరద్వాజ్‌ తప్పు పట్టింది. దాంతో ఆమె విపరీతమైన ట్రోలింగ్‌ని భరించింది. అలాంటిలాంటి ట్రోలింగ్‌ కాదది. ఎంతో స్ట్రాంగ్‌ అనుకున్న అనసూయ చివరికి ఏడ్చేంతగా బాధించాయవి. అయితే, అదే మాట మీడియా ఎదుట శ్రీరెడ్డి, పవన్‌ కళ్యాణ్‌ని అంటే అనసూయకి తప్పుగా అనిపించలేదు. ఇదేం న్యాయం.? 'సొసైటీ మీద బాధ్యత' అంటూ చెప్పుకు తిరిగే ఇలాంటి వాళ్లు ఆ మాటపై, అక్కడ స్పందించినట్లే.. ఇక్కడా స్పందించాలి కదా.! అంటూ స్వయానా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే యూత్‌ సూటిగా ప్రశ్నిస్తోంది.

ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. బాలీవుడ్‌లో ఈ మధ్య విడుదలైన 'కబీర్‌సింగ్‌' బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో లవ్‌లో కొట్టుకోవడం, తిట్టుకోవడం, ముట్టుకోవడం వంటి చాలా కామన్‌. అవి లేకపోతే లవ్వే లేదు.. అంటూ లవ్‌లోని చొరవ గురించి తన అభిప్రాయం చెప్పుకొచ్చారాయన. కానీ, ఆయన మాటలు పక్క దోవ పట్టాయి. సామాజిక బాధ్యత అని చెప్పుకు తిరిగే కొందరు సెలబ్రిటీలకు ఆ మాటలు తప్పుగా రీచ్‌ అయ్యాయి. దాంతో అదేదో క్రూయల్‌ యాక్ట్‌లా భావించి ఆయన్ని తప్పు పట్టేస్తున్నారు సదరు సెలబ్రిటీలైన సమంత, గాయని చిన్మయి, అనసూయ తదితరులు. ఇదే సినిమా టాలీవుడ్‌లో 'అర్జున్‌రెడ్డి' రూపంలో వచ్చి హిట్‌ అయ్యింది. అక్కడ కూడా హిట్టయ్యి, 300 కోట్లు వసూళ్లు కొల్లగొట్టింది. సినిమాలో కంటెంట్‌ నచ్చిందట కానీ, బహిర్గతంగా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడం తప్పయిపోయిందట. అలా ఒక చిన్న మాట పట్టుకుని ఆ డైరెక్టర్‌ని వేధించడం ఎంత వరకూ సబబు.? అని యువత ప్రశ్నిస్తోంది. అది బహుశా ఆ డైరెక్టర్‌ ఆటిట్యూడ్‌ కావచ్చు. ఆయన ఆటిట్యూడ్‌ని మీరెలా తప్పు పడతారంటోంది నేటి యువత. ఆ మాటకొస్తే, ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఆ ఆటిట్యూడ్‌ని ప్రదర్శించడం లేదు.? స్టార్‌ హీరో నందమూరి బాలకృష్ణ ఓ వేదిక మీద చేసిన వ్యాఖ్యల్ని సమర్ధించగలమా.?

సినిమా వేరు, ఆటిట్యూడ్‌ వేరు.. సినిమాని చూసి ఆటిట్యూడ్‌ ఛేంజ్‌ చేసుకునేంత నీచ స్థితికి ప్రెజెంట్‌ సొసైటీలో యువత ఇంకా దిగజారలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు నేటి జనరేషన్‌. సినిమాని సినిమాగానే చూస్తాం. అందులోని కంటెంట్‌ని చాలా లైట్‌గా తీసుకుంటాం. అంతేకానీ, రియల్‌ లైఫ్‌లో ఆపాదించుకోం.. అని సూటిగా చెప్పేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌ తీసుకుంటే, ఇక్కడ కేవలం పబ్లిసిటీ స్టంట్‌ మాత్రమే కనిపిస్తోంది. సినిమాని చూసి యూత్‌ ఎఫెక్ట్‌ అవుతుందనడానికి ప్రూఫ్‌ లేదు. 'అర్జున్‌రెడ్డి' వచ్చింది. వెళ్లింది. యువత ఆదరించింది. అంతే.. కానీ, సినిమాలో అర్జున్‌రెడ్డిలా కొత్తగా యువత డ్రగ్‌ అడిక్ట్‌ కాలేదు.. లవర్స్‌ని కొట్టడం చేయలేదు. పబ్లిగ్గా లిప్‌లాక్స్‌ చేసి రచ్చ చేయలేదు. అలాంటప్పుడు కొత్తగా ఎందుకీ రచ్చ.? ఈ రచ్చ కారణంగా సభ్య సమాజానికి వారు ఏం మెసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నారు.? అంటూనే, చివరిగా నీతులు చెప్పడం ఫస్ట్‌ మీరు మానేయండి.. అని యువత అలాంటి వారికి స్ట్రెయిట్‌గా స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చేస్తోంది.

మరిన్ని వ్యాసాలు