19-07-2019 నుండి25-07-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈవారం కుటుంబపరమైన విషయాల్లో పెద్దల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి, వారం చివరలో చేయవల్సి వస్తుంది. మీ మాటతీరును మీ అనుకున్నవారే వ్యతిరేకించే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులతో అనుకోకుండా వివాదాలు ఏర్పడే ఆస్కారం ఉంది, జాగ్రత్త. నూతన వాహనాలు కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సోదరులతో చేపట్టిన చర్చలు మిశ్రమఫలితాలు ఇస్తాయి.

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం కుటుంబంలో శుభకార్యాక్రమాల గురుంచి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం ఉంది. సోదరుల నుండి కావల్సిన సహకారం లభిస్తుంది. సంతానం నుండి వచ్చిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. తొందరపాటు ఆలోచనలు వద్దు, కాస్త నిదానంగా ముందుకు వెళ్లడం సూచన. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. రావల్సిన ధనం చేతికి అందుతుంది.

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు అవసరం. చేపట్టిన పనులను నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. స్వల్పఅనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. సమయానికి భోజనం చేయుట సూచన. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన.  

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మిత్రులనుండి ముఖ్యమైన సహకారం లభిస్తుంది, చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి , పెద్దలనుండి ఆశించిన మేర గుర్తింపును అదేవిధంగా సహకారం పొందుతారు. నూతన ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు లేదా ఖర్చులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీ లేదా పురుష సంభందమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. సంతానం గురుంచి ఆలోచనలు కలిగి ఉంటారు , వారికోసం సమయాన్ని కేటయిస్తారు.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

 ఈవారం ఉద్యోగంలో అధికారుల నుండి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు , కాకపోతే కొంతమేర ఒత్తిడి ఉంటుంది. పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నూతన వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా పడే ఆస్కారం కలదు. గతంలో చేపట్టిన పనులను నలుగురి సహకారం తీసుకోవడం ద్వారా పూర్తిచేయవచ్చును. సంతానం వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు.

 

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం మొత్తంమీద చేపట్టిన పనుల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి కీలకమైన సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. వ్యాపారపరమైన విషయాల్లో పెద్ద పెద్ద పెట్టుబడుల కన్నా చిన్న చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. కుటుంబపరమైన విషయంలో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ఆరంభంలో ఒకింత ఒత్తిడికి గురయ్యేఅవకాశం ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగంలో పెద్దల లేదా అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు లభిస్తాయి , విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. చర్చల్లో సమయాన్ని గడుపుతారు.

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం ఆరంభంలో పెద్దలనుండి మాటలను పడవలసి వస్తుంది. సాధ్యమైనంత వరకు చర్చలకు అవకాశం ఇవ్వకండి. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మీ మాటతీరు మూలన నూతన సమస్యలు వచ్చే ఆస్కారం కలదు , జాగ్రత్త. కుటుంబంలో వివాదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అధికారుల నుండి సంతృప్తికరమైన సహకారం లభిస్తుంది, మీ ఆలోచనలను తెలియజేయటం మంచిది. 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మీ మాటతీరును కొన్ని విషయాల్లో సరిచూసుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వారం మద్యలో ఒకింత ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. సంతానం వలన పెద్దలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో తొందరపాటు వద్దు. సాధ్యమైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొనే ప్రయత్నం చేయుట అన్నివిధాలా మేలు. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా పడుతుంది. 

 

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. మాటపట్టింపులకు వెళ్ళకండి, అలాగే ఆత్మీయులను కోల్పోకండి. కుటుంబపరమైన విషయాల్లో సర్దుబాటు విధానం మంచిది. అనుకోకుండా కుటుంబసభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడే ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో విభేదాలు ఏర్పడుతాయి. 
 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం సాధ్యమైనంత వరకు ఆరంభంలో చర్చలు చేయకండి. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చేపట్టు పనుల విషయంలో అవగాహన లేకపోతే నూతన సమస్యలు వస్తాయి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందకపోవచ్చును. వ్యాపారపరమైన విషయంలో వేచిచూసే ధోరణి మంచిది అలాగే శ్రమించుట ద్వారా మేలుజరుగుతుంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. చర్చల్లో అధికంగా పాల్గొంటారు. సమయాన్ని సాధ్యమైనంత వరకు వృధాచేయకండి. విలువైన వస్తువులను నస్టపోయే అవకాశం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ప్రయాణాలు అనుకోకుండా చేయవల్సి వస్తుంది. కొన్ని కొన్ని విషయాల్లో మొండినిర్ణయాలు తీసుకోవడం వలన పనులు ముందుకు సాగుతాయి. విదేశీప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం నుండి నూతన విషయాలు తెలుస్తాయి,వాటికీ అనుగుణంగా నడుచుకోండి. 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు