ముద్దు ముచ్చట: యూత్‌ ఒప్పుకోవడం లేదట.! - ..

Youth Not Accepting!

ముద్దు ఒకప్పుడు బూతు. ఇప్పుడది యూతు.. యూత్‌ఫుల్‌ సినిమా అంటే అందులో కనీసం నాలుగైదు మూతి ముద్దులుండాలి. అలా తయారైంది ఇప్పుడు సినిమా పరిస్థితి. అది లేకుంటే హిట్టు రాదు. అది లేకుంటే, యూత్‌ రారు. ఇదే భయంతో దర్శక, నిర్మాతలు అది లేకుండా సినిమాలే తీయలేకపోతున్నారు. ఓ గాఢమైన లిప్‌కిస్‌ ద్వారా మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా ట్రాన్స్‌ఫామ్‌ అవుతుంది అని స్టడీస్‌ చెబుతున్నాయి. అదే ముద్దు కోసం చాలా క్యాలరీలు కూడా ఖర్చు చేయాల్సి వస్తుందని సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్‌ అయ్యింది. మరి ఇంత కష్టపడి ముద్దు సీన్లు ఎందుకు తీస్తున్నారు. కేవలం యూత్‌ని ఎట్రాక్ట్‌ చేయడం కోసమేనా.? కాదనలేం.

సినిమాల్లో ముద్దంటే కేవలం నటన కోసమే అనుకునేరు. ఓ సినిమా షూటింగ్‌లో తాను నటన అనే విషయాన్ని మర్చిపోయి, రొమాంటిక్‌ సీన్‌లో నటించాల్సి వచ్చినప్పుడు అది రియల్‌గానే ఫీలయ్యానని చెప్పుకొచ్చింది ఓ నటి. అంటే అక్కడ రియల్‌గానే ఆ నటి కష్టపడి రొమాన్స్‌ చేసిందన్న మాట. అంటే ఆమె అందుకోసం ఎన్ని క్యాలరీలు ఖర్చు చేయాల్సి వచ్చిందో చూశారుగా. ఆ సంగతి పక్కన పెడితే, ఆమె అలా చెబితే, దాన్ని ఎవరూ తప్పు పట్టలేదు. ప్రేమ అంటే ముద్దులు మాత్రమే కాదు, గుద్దులు (కొట్టడం) కూడా ఉండాలని సరదాగా ఓ దర్శకుడు చెబితే, ఎగేసుకుంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు కొందరు. ఈ విషయాన్ని అప్పుడు యూతే తప్పుపట్టారు. ఎదురు ప్రశ్నించారు. ఇక ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక, 'ఆ' టైప్‌ కంటెంట్‌ లేకుంటే, జనం ధియేటర్స్‌కి రాకుండా పోతున్నారని దర్శకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

హద్దులు దాటనంత వరకూ ఏదైనా ముద్దే.. అన్నది పాత మాట. కానీ, హద్దులు దాటితేనే అందరికీ ముద్దు అన్నట్లుగా తయారైంది నేటి పరిస్థితి. అలా అన్నింట్లోనూ గీతలు దాటేస్తున్నారు. ఒకప్పుడు ఉడుకు రక్తం అంటేనే హద్దుల్లేని ఆవేశం అనేవారు. కానీ, ఇప్పుడు ఉడుకు రక్తమే ఉండి ఉండి ఆలోచిస్తోంది. దేనికైనా హద్దూ అదుపూ ఉండాలంటోంది. పెద్దలు చెప్పే మాటలే ఇప్పుడు పిన్నల ద్వారా వినాల్సి వస్తోంది. యూత్‌కి ఏదైనా కొంత కాలమే. ఎక్కువయితే, బోర్‌ కొట్టేస్తుంది. అలా ఇప్పుడీ విర్రవీగిన ముద్దు ముచ్చట్లంటే విసుగు చెందుతోన్న యువత కొత్తదారి పట్టింది. ముద్దులంటే వద్దు బాబోయ్‌ అంటోంది. యూత్‌ వద్దంటోన్న ముద్దు ముచ్చట్లను సమాజం ఎందుకు ఎంకరేజ్‌ చేస్తుంది. సో మారిన పరిస్థితుల దృష్ట్యా అతి తొందరలోనే ఈ ముద్దుల గోలకు చరమ గీతం పాడేసే టైమొచ్చేసిందనిపిస్తోంది.

ఏది ఏమైనా యూత్‌ తలచుకుంటే ఇంతే ఇలాగే ఉంటుంది. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌.. అంటూ ఓల్డ్‌ని కల్చర్‌ని ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఇది కేవలం సినిమాలూ, ముద్దులూ ఎక్స్‌ట్రాకి సంబంధించి ఇష్యూనే కాదు, చాలా చాలా ఇష్యూస్‌లో ఓల్డ్‌ కల్చర్‌ని ఎంకరేజ్‌ చేసే దిశగా యూత్‌ అడుగులు వేస్తోంది. ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు కూడా మొదలెట్టేసింది. ఇక రిజల్ట్‌ ఎలా ఉండబోతుందో నిదానం మీద చూడాలంతే. 

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి