25-07-2019 నుండి1-08-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

ఈ వారం ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మీ ఆలోచన తీరు చాలామందికి నచ్చుటకు అవకాశం ఉంది. కాస్త నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు పొందుతారు, ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. అనుకోకుండా వాహనాల మూలాన ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది, జాగ్రత్త. 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం పెద్దలతో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. అలాగే దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త ఇబ్బంది తప్పక పోవచ్చును. ముందు గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలియు వస్తాయి , విదేశీప్రయాణాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. మిత్రులనుండి ఆశించిన సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది, కాకపోతే అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం మేలు. చిన్న చిన్న విషయాలకు హైరానా పడకుండా , ప్రశాంతంగా ఉండే ప్రయత్నం మేలుచేస్తుంది.

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

 ఈవారం ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. జీవిత బాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను పూర్తిచేయుటకు కాస్త శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగంలో లేక వృత్తిస్థానంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన, వాటివలన ఆశించిన మేర ఫలితం రాకపోవచ్చును. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందటం అనేది మంచి మార్పు. కుటుంబంలో మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త వేచిచూసే ధోరణి మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును. రావల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం ఉంది. కుటుంబంలో కాస్త గందరగోళ పరిస్థితులను పెంచుటకు అవకాశం ఉంది, జాగ్రత్త. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. నూతన ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. మీ మాటతీరు కొంతమందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది, కలిసి వస్తాయి.

 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, సమయాన్ని వారితో గడుపుటకు ఆస్కారం కలదు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులను నస్టపోయే అవకాశం కలదు. పెద్దలతో మీకున్న పరిచయం కాస్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంది, ఈవిషయంలో కాస్త సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. వివాదాస్పద నిర్ణయాలకు అలాగే మాటలకు దూరంగా ఉండుట మంచిది. సోదరులతో చేపట్టిన చర్చలు పెద్దగా ఆశించిన మేర ఫలితాలను ఇవ్వకపోవచ్చును. మిత్రులతో సమయం గడుపుతారు.

 

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం ఉద్యోగంలో చేపట్టిన నూతన ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోయిన , ఇబ్బందులను ఇవ్వకపోవచ్చును. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ఆశించిన మేర సహకారం ఇతరుల నుండి లభిస్తుంది. విలువైన వస్తువుల వలన నస్టపోయే ఆస్కారముకలదు. కావున కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట మేలు. మిత్రులనుండి వచ్చిన అభిప్రాయాలూ మీకు పెద్దగా నచ్చకపోవచ్చును, సర్దుబాటు విధానం మేలు. మానసికంగా కాస్త ఇబ్బంది తప్పక పోవచ్చును, ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం కలదు. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం పెద్దలను కలుస్తారు , వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలను అనుభవజ్ఞులకు తెలియజేయడం వలన మేలుజరుగుతుంది. నూతన పెట్టుబడుల కోసం చేప్పట్టిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. మిత్రులతో కలిసి ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది, వేచిచూసే ధోరణి మేలు. కుటుంబంలో శుభకార్యక్రమాల విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. బంగారు ఆభరణాలు కోల్పోయే అవకాశం ఉంది , జాగ్రత్త. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. తండ్రితరుపు బాంధవుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.

 

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట ద్వారా పెద్దలనుండి ప్రశంశలు పొందుతారు. దూర ప్రదేశంలో ఉన్న మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. జీవితభాగస్వామి నుండి వచ్చే సూచనల మేర ముందుకు వెళ్ళండి. కొంత వ్యతిరేక బావాలు ఉన్న కలుపుకొని వెళ్ళుట సూచన. చిన్న చిన్న విషయాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వడం మేలు. భూసంబంధమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట ఉత్తమం. నూతన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేయుట సూచన.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం అధికసమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. తల్లి తరుపు బంధువులను కలుస్తారు , వారినుండి నూతన విషయాలు తెలుసుకుంటారు అదేవిధంగా వారితో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు ఆశించిన ఫలితాలను కలుగజేస్తాయి. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. నలుగురిలో ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఏమాత్రం అలసత్వం వద్దు, స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళండి. గతంలో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుటకు అవకాశం కలదు.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం కుటుంబంలో మార్పులకు అవకాశం ఉంది, మీ ఆలోచనలను కుటుంబపెద్దలతో పంచుకుంటారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, ప్రయాణాల్లో నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సంతానం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. వ్యాపారపరమైన విషయంలో కాస్త శ్రమించుట ద్వారా చక్కటి ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయంలో ఏమాత్రం అశ్రద్దగా ఉన్న నస్టపోయే అవకాశమే ఎక్కువ, కావున అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. పెద్దలనుండి వచ్చు సూచనలను కాస్త పరిగణలోకి తీసుకొనే ప్రయత్నం మంచిది.
 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీస్కోవడం మంచిది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే విధంగా ఆలోచనలు చేయుట సూచన. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మిత్రులనుండి లేక ఆత్మేయుల నుండి వచ్చిన సూచనలను అలాగే సలహాలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం కలదు. 
 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి లబ్దిని పొందుతారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. విదేశాల్లో ఉన్న బంధువులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, నూతన పెట్టుబడులకు మాత్రం అవకాశం ఉంది. సంతానం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు కీలకమైన మార్పుల వైపు వెళ్ళుటకు అవకాశం ఉంది. స్వల్పఅనారోగ్య సమస్యలు మాత్రం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. సరైన ప్రణాళిక కలిగి ఉండుట సూచన.

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి