బంప్స్‌.. బర్త్‌ డే కోసం కాదు, డెత్‌ డే కోసం.! - ..

Bumps .. Not for Birthday, For Death Day!

వెన్ను తట్టి ప్రోత్సహించడమంటే మనిషి నడవలేని స్థితికి చేర్చేలా వెన్ను విరగ్గొట్టేయడం కాదు.! ఏదైనా సాధించగమన్న నమ్మకం కలిగించేలా.. కార్మోన్ముఖుల్ని చేసేలా వారిని ప్రేరేపించడమనేది 'వెన్నుతట్టి ప్రోత్సహించడం' అనే మాటకి అర్థం. మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఇలా వెన్నుతట్టి ప్రోత్సహించే సంస్కృతి వుంది. దురదృష్టవశాత్తూ ఇప్పుడది వెర్రి తలలు వేసేస్తోంది. వెస్ట్రన్‌ కల్చర్‌లోని మంచిన పక్కన పడేసి, చెడుని మాత్రమే స్వీకరిస్తున్న మనం.. అతి భయంకరమైన ఓ జాడ్యాన్ని అంటించుకున్నాం. ప్రధానంగా యువత, ఇప్పుడీ జాడ్యంతో ప్రాణాలు కోల్పోతోంది. 'బర్త్‌ డే బంప్స్‌' అనే కాన్సెప్ట్‌ యువత ప్రాణాలు తీస్తోందంటే నమ్మగలమా.? నమ్మినా, నమ్మకపోయినా ఇది ఇప్పుడు నిప్పులాంటి నిజం.

'అమ్మా.. ఫ్రెండ్స్‌కి బర్త్‌ డే పార్టీ ఇవ్వడానికి వెళుతున్నా..' అని ఓ కుర్రాడు తన తల్లికి చెప్పాడంటే, ఆ తల్లి వెంటనే జాగ్రత్త పడాలి. లేకపోతే, కొడుకుని కోల్పోవాల్సి వస్తుంది ఆ కన్న తల్లి. బర్త్‌ డే బంప్స్‌.. అంటే, కింద పడేసి కుమ్మేయడమట. ఇదీ.. నేటి యువతరం వెర్రి తలలు వేస్తున్న వైనం. బేకరీలో కేక్‌ కొనుక్కుని వచ్చి.. అది తినకుండా, మొహానికి పూసుకోవడం ఓ ట్రెండు. పోన్లే, కడుక్కోవచ్చు.. అదేమంత ప్రమాదకరమైనది కాదు. గుడ్లు కూడా నెత్తి మీద చితక్కొట్టుకోవొచ్చు. కానీ, కింద పడేసి కుమ్మేయడమేంటి.? వినడానికే భయానకంగా వుంది కదూ.! పైగా, ఇవి నడి రోడ్డు మీదనే ఎక్కువగా జరుగుతున్నాయట. జన సంచారం ఎక్కువగా లేని ప్రాంతాలకు వెళ్ళి కేక్‌ కట్‌ చేశాక, అసలు తతంగం మొదలవుతుంది.

నిండు నూరేళ్ళు జీవించు.. జీవితంలో అనుకున్నది సాధించు.. అంటూ బర్త్‌ డే విషెస్‌ చెప్పే క్రమంలో వెన్ను తట్టాల్సింది పోయి.. వెన్ను విరగ్గొట్టేస్తున్న సందర్భాలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోయాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇందులో బాధితులు అబ్బాయిలు మాత్రమే కాదట.. అమ్మాయిలు కూడా వుంటున్నారట. ఇదేమీ మానసిక వైకల్యం కాదు.. మనిషి వికృత రూపం. క్షణికానందం కోసం.. ఒళ్ళు తెలియని మైకంలో చేస్తున్న నేరాలు. చాచి పెట్టి కొడితే గూబ గుయ్యిమనిపోతుందని తెలియనిదెవరికి.? అవతలి వ్యక్తికి నొప్పి పెడుతుందని తెలిసీ.. కొట్టేవాడ్ని ఏమనాలి.? మరి, ప్రాణం తీసేవాళ్ళని స్నేహితులని అనగలమా.? కానీ, అనాల్సిందే.. ఎందుకంటే ఇదో చెత్త ట్రెండ్‌ మరి.

ఓ సర్వే ప్రకారం.. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని విధంగా భారతదేశంలోని యువత, ఇలాంటి చెత్త ప్రక్రియల పట్ల ఎక్కువ ప్రభావితమవుతున్నారని  తేలింది. ఎందుకు.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న ఏమీ కాదు.. దురదృష్టవశాత్తూ మన ఆలోచనలు అంత చెత్తలా మారిపోతున్నాయంతే.

మరిన్ని వ్యాసాలు

అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్
పియానో పాటలు .
పియానో పాటలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి