ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈవారం ( 2/8-7/8) మహానుభావులు

జయంతులు

ఆగస్ట్ 2

1.శ్రీ పింగళి వెంకయ్య : వీరు ఆగస్ట్2, 1876 న , భట్లపెనుమర్రు లో జన్మించారు.స్వాతంత్ర సమరయోధుడు. భారత జాతీయ త్రివర్ణ పతాక సృష్టికర్త.   కాషాయం, ఆకుపచ్చలకు తోడుగా   సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా   చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించారు.

2.శ్రీ తాడిపర్తి రాఘవాచార్య :  “ బళ్ళారి రాఘవ “ గా ప్రసిధ్ధిచెందిన వీరు, ఆగస్ట్ 2, 1880 న తాడిపత్రి లో జన్మించారు. తెలుగు నాటకరంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది అయినా నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభతో రాణించాడు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం వెచ్చించారు.

ఆగస్ట్ 3

శ్రీ శ్రీపాద పినాకపాణి : వీరు ఆగస్ట్3, 1913 న , ప్రీయాక అగ్రహారం లో జన్మించారు. రోగాలను, రాగాలను సరిచేసిన సవ్యసాచి. తమిళ నాట లాగే శాస్త్రీయ సంగీతం తెలుగునాట పరిమళించాలని ఆకాంక్షించారు. ఆ దిశగా ఎందరో సంగీత శిఖామణులను తెలుగు వారికి అందచేశారు.

ఆగస్ట్ 5

1.శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి :  వీరు ఆగస్ట్ 5, 1896 న చందోలు లో జన్మించారు. గొప్ప లలితాత్రిపుర సుందరీ ఉపాసకులు. వీరికి అమ్మ దయతో అష్టసిధ్ధులూ వశమయినాయి. దేవతా శక్తులు నిరంతరం, వారి చుట్టూ తిరుగుతూండెవి.

2.శ్రీ ఆలూరు వెంకటసుబ్బారావు :  “ చక్రపాణి “ గా ప్రసిధ్ధి చెందిన వీరు, ఆగస్ట్ 5, 1908 న, తెనాలి లో జన్మించారు.  బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు.

ఆగస్ట్  7

శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య : వీరు ఆగస్ట్ త్, 1890 న కొంకుదురు లో జన్మించారు. గ్రంథాలయోద్యమకారుడు, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్దహస్తులు మరియు పత్రికా సంపాదకుడు. గ్రంథాలయ సర్వస్వము అనే పత్రికను నిర్వహించారు.. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడుగా పేరుగాంచారు.

ఆగస్ట్ 8

శ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి :  వీరు ఆగస్ట్ 8, 1870 న కడియంలో జన్మించారు.  తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో ఒకరు. తిరుపతి వేంకటకవులుగా, శ్రీ దివాకర్ల వెంకటావధాని గారితో కలిసి, వీరు చేసిన అవధానాలు క్రమేపీ తెలుగునాట అష్టావధానాలు, శతావధానాలకు ప్రజాదరణ, రాజాదరణ సంపాదించి పెట్టడంలో ముఖ్యపాత్ర పోషించాయి. జంటగా వీరు మహాభారతం ఆధారంగా రాసిన పద్యనాటకాల్లో పాండవోద్యోగ విజయాలు ఊరూరా ప్రాచుర్యం పొందాయి.

వర్ధంతులు

ఆగస్ట్ 3

శ్రీ వేగుంట మోహనప్రసాద్ :  ప్రముఖ కవి, రచయిత, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మో’ పేరుతో సాహితీలోకంలో సుప్రసిద్ధులైన ఈయన తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందారు..

వీరు ఆగస్ట్ 3, 2011 న స్వర్గస్థులయారు.

ఆగస్ట్ 6

శ్రీ దండమూడి రాజగోపాల రావు : మన దేశానికి చెందిన  వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, "ఇండియన్ టార్జన్" అన్న బిరుదు పొందారు. తెలుగు  రంగస్థల మరియు సినిమా నటుడు.  1951లో ఢిల్లీలో జరిగిన ప్రథమ ఆసియా క్రీడోత్సవాలలో వెయిట్‌ లిఫ్టింగ్ పురుషుల సూపర్ హెవీవెయిట్ (+105 కేజీలు) వర్గములో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

వీరు ఆగస్ట్ 6, 1981 న స్వర్గస్థులయారు.

ఆగస్ట్ 8

శ్రీ పసుమర్తి కృష్ణమూర్తి :   ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనుల పండువ అనిపించే నాట్యాలను తెర మీద ఆవిష్కరించారు.  ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలోని నృత్యాల రూపశిల్పి .

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి